అమ్మ రాజీనామా

అమ్మ రాజీనామా 1991 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది.[1] మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాలలో ఇది తొలివరుసలో ఉంటుంది.[2] ఈ సినిమాను దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడుకిది కెమెరా మెన్ గా తొలి సినిమా ఇది. 2001 లో ఈ సినిమా కన్నడంలో అమ్మ పేరుతో పునర్నిర్మించారు. ఇందులో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది.

అమ్మ రాజీనామా
Amma Rajeenama.jpg
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు
నిర్మాతకె. దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, సి. అశ్వనీదత్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
సంగీతంకె. చక్రవర్తి
విడుదల తేదీలు
1991
భాషతెలుగు

కథసవరించు

భారతి కుటుంబ యజమాని. ఇంట్లో పనులన్నీ ఆమె చేతులమీదుగా జరుగుతూ ఉంటాయి. ఆమె భర్త రామచంద్రరావు ఉద్యోగ విరమణ చేసి మరే పనీ చేయడం ఇష్టం లేక ఇంట్లోనే ఉంటాడు. అందరి జీతాలు రాగానే భారతి చేతిలో పెట్టి ఆమెనే ఇంటి బాధ్యతలన్నీ చూసుకోమంటూ ఉంటారు. అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నా, ఇంట్లో సభ్యులు తన శ్రమకు విలువ ఇవ్వకపోవడం చూసి అకస్మాత్తుగా ఆ బాధ్యతలనుంచి విరమణ తీసుకుంటుంది. అదే అమ్మ రాజీనామా.

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు. అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు.[3] ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న తియ్యని కావ్యం[4][5], సృష్టికర్త ఒక బ్రహ్మ పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ పాటలో దర్శకుడు దాసరి నారాయణరావు అంధుడైన ఒక భిక్షగాడిగా కనిపిస్తాడు.

మూలాలుసవరించు

  1. www.thenewsminute.com [www.thenewsminute.com/article/revisiting-28-year-old-telugu-movie-which-amma-resigns-her-job-amma-109321 www.thenewsminute.com/article/revisiting-28-year-old-telugu-movie-which-amma-resigns-her-job-amma-109321]. Retrieved 2020-06-02. {{cite web}}: Check |url= value (help); Missing or empty |title= (help)
  2. Nadadhur, Srivathsan (2017-05-31). "Dasari: The original trendsetter". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2020-06-02.
  3. Balakrishna, Palli. "Amma Rajinama (1991)". Telugu Lyrics World. Retrieved 2020-06-02.
  4. Krishna (2020-05-10). "Mother's day special: 'అమ్మ' పాటకి టాలీవుడ్‌ నీరాజనం". www.hmtvlive.com. Retrieved 2020-06-02.
  5. "అందరి నోటా 'అమ్మ' పాట..!". www.eenadu.net. Retrieved 2020-06-02.