అశ్వనీ దత్ ప్రముఖ సినీ నిర్మాత. వైజయంతీ మూవీస్ పేరుతో పలు సినిమాలు నిర్మించాడు. విజయవాడలో జన్మించిన ఈయన ఎన్. టి. ఆర్ మీద అభిమానంతో చిన్న వయసు నుంచే నిర్మాతగా మారాడు. ఈయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఇద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు.

అశ్వనీ దత్
జననం
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తిసినీ నిర్మాత, పంపిణీదారు
పిల్లలుస్వప్న దత్, ప్రియ దత్, స్రవంతి దత్
బంధువులునాగ్ అశ్విన్, ప్రసాద్ వర్మ (అల్లుళ్ళు)

వ్యక్తిగత వివరాలు సవరించు

అశ్వనీ దత్ విజయవాడలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లో ఎ క్లాస్ కాంట్రాక్టరు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ఏళ్ళు కలింగ పైప్స్ కు ఏకైక పంపిణీదారుగా ఉన్నాడు. రచయిత, దర్శకుడు జంధ్యాల ఈయనకు బాల్య స్నేహితుడు. అశ్వనీదత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ప్రియాంక దత్, స్వప్న దత్. వీరిద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రియాంక దత్ దర్శకుడు నాగ్ అశ్విన్ ను 2015 లో వివాహం చేసుకుంది.[1][2] ఇక స్రవంతి దత్ హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్త.

సినిమా కెరీర్ సవరించు

ఈయన చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. ఎన్. టి. ఆర్ కు అభిమాని. 1975 లో ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా వచ్చిన ఎదురు లేని మనిషి వైజయంతీ మూవీస్ తొలి సమర్పణ. ఈ సినిమా వంద రోజులు ఆడింది.[3]

నిర్మించినవి సవరించు

మూలాలు సవరించు

  1. "Director Nag Ashwin to wed Ashwini Dutt's daughter Priyanka". Indian Express. 10 October 2015. Retrieved 19 June 2018.
  2. Eenadu (25 September 2022). "పుత్రికోత్సాహం". Archived from the original on 25 September 2022. Retrieved 25 September 2022.
  3. "ఈ పాటకి నేను డ్యాన్స్‌ చేయాలా? : ఎన్టీఆర్‌". sitara.net. ఈనాడు. Archived from the original on 14 అక్టోబరు 2018. Retrieved 19 June 2018.
  4. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 2 April 2020.