అరటికాయ పెరుగు పచ్చడి

అరటికాయ పెరుగు పచ్చడి అరటి కాయతో చేయబడ్డ శాకాహార వంటకం. పచ్చి అరటికాయతో మనము చాలా రకాల కూరలను చేసుకుంటాము. అరటి చెట్టులోని ప్రతి భాగంతోను కూర వండుతారు. అన్నింటికన్నా మన తెలుగువాళ్ళకు ఎక్కువగా నచ్చేవి రోటిపచ్చళ్ళు. పొట్లకాయలోను, అరటికాయలోను పెరుగు వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ వేసే పెరుగు కొంచం పుల్లగా ఉండాలి అలానే ఎంత వేయాలో కూడా తెలిసి ఉండాలి.అప్పుడే ఆ పచ్చడి రుచి బాగుంటుంది.

అరటికాయ పెరుగు పచ్చడి
పెరుగు పచ్చడి
మూలము
మూలస్థానంభారత దేశము
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ

కావల్సిన పదార్థాలు

మార్చు
  • అరటికాయ
  • పెరుగు
  • పసుపు
  • ఉప్పు

పోపు సామాను

మార్చు
  • నెయ్యి
  • మెంతులు
  • ఆవాలు
  • జీలకర్ర
  • ఎండు మిర్చి
  • ఇంగువ
  • పచ్చిమిర్చి ముక్కలు
  • కరివేపాకు
  • కొత్తిమీర

తయారీ విధానం

మార్చు
 
అరటికాయ పెరుగు పచ్చడి

అరటికాయను చెక్కు తీయకుండా కాయగానే కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి. అరటికాయ ఉడికిన తర్వాత కాయను చల్లార్చిన తదుపరి, పై తోలు తీసి గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకుని కచ్చాపచ్చాగా మెత్తగా పిసుక్కోవాలి. మరొక గిన్నెలోకి కావల్సిన పెరుగు తీసుకొని, పసుపు, ఉప్పు కలుపుకోవాలి. ఇందులో చిదిమిన అరటికాయ గుజ్జుని కలుపుకోవాలి. [1]

బేసిన్ వేడి చేసి, వేడి ఎక్కాక, రెండు చెంచాలు నెయ్యి వేసి, అది కాగిన తర్వాత తాలింఫు సామాను వరుసగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరప వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక చిటికెడు ఇంగువ వేసి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించి పెరుగులో కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించుకోవాలి. [2] [3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు