అరిబండి వేణుప్రసాద్
అరిబండి వేణుప్రసాద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముఖ్యకారదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
అరిబండి వేణు ప్రసాద్ | |
---|---|
జననం | 1964 |
వృత్తి | పంజాబ్ ముఖ్యమంత్రి ముఖ్యకారదర్శి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ |
తల్లిదండ్రులు | అరిబండి రంగయ్య, మంగమ్మ |
జననం, విద్యాభాస్యం
మార్చుఅరిబండి వేణుప్రసాద్ తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం, పెంచికలదిన్నె గ్రామంలో అరిబండి రంగయ్య, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య మునగాలలో పూర్తి చేసి పదో తరగతి వరకు ఖమ్మంలో చదివాడు. వేణుప్రసాద్ నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, బాపట్లలో వ్యవసాయ కళాశాలలో ఎజిబీఎస్సీ పూర్తి చేసి, హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఎంఎస్సీ పూర్తి చేశాడు.
వృత్తి జీవితం
మార్చువేణు ప్రసాద్ 1991లో సివిల్స్ రాసి ఐఏఎస్‌గా ఎంపికై పంజాబ్ క్యాడర్‌లో నియమితుడయ్యాడు. ఆయన ఫరీద్‌కోట్, జలంధర్ జిల్లాల కలెక్టర్‌గా, పవర్‌కామ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆ తరువాత రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేసి ఎక్సైజ్, పన్నుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు & పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2022లో ఆప్ ప్రభుత్వంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ముఖ్య కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (12 March 2022). "పంజాబ్ సిఎం ముఖ్య కార్యదర్శిగా వేణుప్రసాద్". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
- ↑ TV9 Telugu (13 March 2022). "పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ బృందంలో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు." Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 Telugu (13 March 2022). "తెలుగు అధికారికే తొలి పోస్ట్: పంజాబ్ కొత్త సీఎం అదనపు సీఎస్‌గా వేణు ప్రసాద్". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (13 March 2022). "పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.