ఫరీద్‌కోట్ జిల్లా
భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫరీద్‌కోట్ జిల్లా ఒకటి. ఫరీద్‌కోట్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఈ జిల్లా పూర్వపు ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో ఒక భాగం. 1996 సంవత్సరంలో ఫరీద్‌కోట్, భటిండా, మాన్సా జిల్లాలను కలిపి ఫరీద్‌కోట్ పట్టణం ప్రధాన కార్యాలయంగా ఫరీద్‌కోట్ డివిజన్ స్థాపించారు.
ఫరీద్‌కోట్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
ముఖ్యపట్టణం | ఫరీద్కోట్ |
Founded by | రాజా మొకల్సి |
Named for | షేక్ ఫరీదుద్దీన్ గంజ్‌షకర్ |
Government | |
• డిప్యూటీ కమిషనరు | Malwinder Singh Jaggi , IAS |
విస్తీర్ణం | |
• Total | 1,458 కి.మీ2 (563 చ. మై) |
Elevation | 196 మీ (643 అ.) |
జనాభా (2011) | |
• Total | 6,17,508 |
• Rank | 17 |
• జనసాంద్రత | 424/కి.మీ2 (1,100/చ. మై.) |
Demonym(s) | ఫరీద్‌కోటియన్, ఫరీద్‌కోటియా |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 151203 |
Telephone code | +91-1639 |
లింగ నిష్పత్తి | 1000/890 ♂/♀ |
శబ్దవ్యుత్పత్తి
మార్చుఫరీద్కోట్ నగరం పేరిట జిల్లాకు ఈ పేరు పెట్టారు. దీనికి సూఫీ సాధువు, ముస్లిం మిషనరీ అయిన బాబా ఫరీద్ గౌరవార్థం పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఫరీద్‌కోట్ పట్టణాన్ని 13 వ శతాబ్దంలో మొకల్హర్ అనే పేరుతో రాజా మొకల్సి స్థాపించాడు. ఇతడు రాజస్థాన్‌లోని భట్నైర్ భట్టి నేత రాయ్ ముంజ్‌కు మనవడు. ప్రసిద్ధ జానపద కథల ప్రకారం, బాబా ఫరీద్ ఈ పట్టణాన్ని సందర్శించినపుడు రాజా, పట్తణం పేరును ఫరీద్‌కోట్ గా మార్చాడు. మొకల్సి తరువాత పాలించిన జైర్సీ, వైర్సీ ల కాలంలో ఇదే రాజధానిగా ఉండేది.
చరిత్ర
మార్చుస్వాతంత్ర్యానికి ముందు, జిల్లాలో ఎక్కువ భాగం ఫరీద్‌కోట్ మహారాజా పాలనలో ఉండేది. తరువాత ఇది 1948 లో పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు) లో భాగమైంది. ఫరీద్‌కోట్‌ను 1972 ఆగస్టు 7 న పూర్వ భటిండా జిల్లా లోని కొంత భాగాన్ని (ఫరీద్‌కోట్ తహసిల్) , ఫిరోజ్‌పూర్ జిల్లా లోని కొంత భాగాన్నీ (మోగా, ముక్తసార్ తహసిళ్ళు) కలిపి ప్రత్యేక జిల్లాగా రూపొందించారు. మళ్ళీ, 1995 నవంబరులో, ఫరీద్‌కోట్ జిల్లాను మూడు ముక్కలు చేసారు. జిల్లా లోని మోగా, ముక్తసార్ ఉపవిభాగాలను విడదీసి విడివిడిగా జిల్లాల హోదా ఇచ్చారు.
ప్రభుత్వ పాలన
మార్చుఫరీద్కోట్ జిల్లాకు వాయువ్యంలో ఫిరోజ్‌పూర్, నైరుతిలో ముక్తసార్, దక్షిణాన భటిండా, పశ్చిమాన మోగా జిల్లాలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 1469 కిమీ 2. ఇది రాష్ట్ర మొత్తం వైశాల్యంలో 2.92%. జిల్లా జనాభా 552,466. ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో ఇది 2.27%. జిల్లాలో ఫరీద్‌కోట్, జైటో అనే రెండు ఉపవిభాగాలు / తహసీళ్ళు ఉన్నాయి, అవి కోట్కాపురా, సాదిక్ అనే రెండు ఉప తహసీళ్ళు, మొత్తం 171 గ్రామాలూ ఉన్నాయి. జిల్లాలో ఫరీద్కోట్, కోట్కాపురా అనే రెండు డెవలప్‌మెంట్ బ్లాకులు ఉన్నాయి.
జిల్లాలో ఫరీద్కోట్, కోట్కాపురా, జైతు అనే 3 నగరాలున్నాయి. ఫరీద్‌కోట్ ప్రాంతంలో బజాఖానా, పంజ్‌గరైన్ కలాన్, దీప్ సింగ్ వాలా, గోలేవాలా, ఝోక్ సర్కారి, దోడ్, ఘుగియానా, సాదిక్, చంద్ భాన్ అనే 7 ముఖ్యమైన పట్టణాలు / గ్రామాలు ఉన్నాయి.. ఫరీద్‌కోట్ విద్యా సంస్థలకు కేంద్రంగా ఉంది. ఉత్తర భారతదేశంలోని ఏకైక వైద్య విశ్వవిద్యాలయం బాబా ఫరీద్ పేరుతో ఫరీద్‌కోట్‌లో ఉంది
జనాభా వివరాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1951 | 1,82,145 | — |
1961 | 2,44,718 | +34.4% |
1971 | 2,93,475 | +19.9% |
1981 | 3,70,556 | +26.3% |
1991 | 4,55,005 | +22.8% |
2001 | 5,50,892 | +21.1% |
2011 | 6,17,508 | +12.1% |
2011 జనాభా లెక్కల ప్రకారం ఫరీద్‌కోట్ జిల్లా జనాభా 617,508. [1] ఇదిసోలమన్ దీవుల దేశానికి [2] లేదా యుఎస్ రాష్ట్రమైన వెర్మోంట్కు సమానం. [3] జనాభా పరంగా ఈ జిల్లా భారతదేశపు జిల్లాల్లో 519 వ స్థానంలో ఉంది. (మొత్తం 640 జిల్లాల్లో ). జిల్లా జనసాంద్రత 424 మంది/చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 12.18%. ఫరీద్‌కోట్ లో లింగ నిష్పత్తి 889 / 1000. అక్షరాస్యత రేటు 70.6%
-
Entrance of Farmer's House Faridkot
-
Foundation Stone of Harindra - Civil Hospital Faridkot
-
Foundation Stone of Harindra - Civil Hospital Faridkot
-
Foundation stone of Govt. School of Bargari (Faridkot)
-
Entrance of District Court Faridkot
-
Foundation Stone of Davies Model Agricultural Farm and Farmers's House Faridkot
-
Govt. Brijindra College Faridkot
-
Govt.Brijindra College Faridkot
మూలాలు
మార్చు- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 2011-09-30.
Vermont 625,741