అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్

అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్ (జననం 15 జనవరి 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖర్గోన్, ఖాండ్వా నియోజకవర్గల నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.

అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్
అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్


మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2014 – 2018
ముందు కాంతిలాల్ భూరియా
తరువాత కమల్ నాథ్

సుభాష్ యాదవ్ (తండ్రి) & దమయంతి యాదవ్
పదవీ కాలం
2009 – 2014
ముందు నంద్ కుమార్ సింగ్ చౌహాన్
తరువాత నంద్ కుమార్ సింగ్ చౌహాన్
నియోజకవర్గం ఖాండ్వా
పదవీ కాలం
2007 – 2009
ముందు కృష్ణ మురారి మోఘే
తరువాత మఖన్‌సింగ్ సోలంకి
నియోజకవర్గం ఖర్గోన్

కేంద్ర భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2009 – 2011

వ్యక్తిగత వివరాలు

జననం (1974-01-15) 1974 జనవరి 15 (వయసు 50)
బోరావాన్ , మధ్యప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సుభాష్ యాదవ్ & దమయంతి యాదవ్
జీవిత భాగస్వామి డా. నమ్రతా యాదవ్
సంతానం 2
నివాసం ఖర్గోన్ , మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి S.S. సబ్ద్ జైన్ కామర్స్ కాలేజ్, జైపూర్ , రాజస్థాన్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007లో ఖర్గోన్ లోక్‌సభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలోకాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖాండ్వా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2009 నుండి 18 జనవరి 2011 వరకు కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సహాయ మంత్రిగా, 3 మే 2013 నుండి 2014 వరకు ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) సంక్షేమ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014, 2019 లో‍క్‍సభ ఎన్నికలలో ఓడిపోయాడు.

అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ 2014 నుండి 2018 వరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశాడు.[1] ఆయన 2018లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బుధ్ని శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Arun Yadav is Madhya Pradesh's new Congress chief, The Times of India.
  2. "2018 Vidhan Sabha Elections Result Book of Madhya Pradesh" (PDF). Retrieved November 21, 2020.
  3. Financialexpress (11 December 2018). "Budhni election result: Shivraj Singh Chouhan vs Arun Yadav, check winner of this MP Assembly election constituency" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.
  4. The Indian Express (7 October 2023). "Poll countdown begins: The 5 Congress big guns central to party's Madhya Pradesh prospects" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.