నారదభట్ల అరుణ (జననం 1974 నవంబరు 22), తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహిత్య కారిణి. ఆమె కవిత్వాలు, పద్యాల ప్రక్రియల్లో రాణిస్తున్నది. 2016లో ‘ఇన్నాళ్ల మౌనం తరువాత’, 2022లో ‘లోపలి ముసురు’ అనే కవితా సంపుటిల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె ‘అమర్నాథ్‌ యాత్ర’ చరిత్రను సంపుటిగా ప్రచురించింది. మంత్రపురి అలియాస్‌ మంథని విశిష్ఠత గురించి ఆమె పలు కథనాలు రాసింది. ‘ఆనంత చందస్సౌరభం’ అనే 10,000 పద్యాల గ్రంథంలో 100 మంది కవులలో నారదబట్ల అరుణ ఒకరు.

నారదబట్ల అరుణ
ఆజాది కా కవి సమ్మేళన 2021 కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న అరుణ నాదరభట్ల
జననం (1974-11-22) 1974 నవంబరు 22 (వయసు 50)
జాతీయతభారతీయురాలు
విద్యఎంకామ్‌, బీఈడీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సాహిత్య రంగం
జీవిత భాగస్వామిమల్లావజ్జల నారాయణశర్మ
పిల్లలు1, మల్లావజ్జల భాషిత (కూతురు)
తల్లిదండ్రులునారదభట్ల విజయలక్ష్మి (తల్లి),
నారదభట్ల రాజేశ్వర్‌రావు (తండ్రి)

ప్రారంభ జీవితం

మార్చు

తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో విజయలక్ష్మి, నారదభట్ల రాజేశ్వర్‌రావు దంపతులకు 1974 నవంబరు 22న అరుణ జన్మించింది. ఆమె పాఠశాల విద్య పెద్దపల్లిలోని సరస్వతీ విద్యామందిర్‌, గర్ల్స్‌ హైస్కూల్‌ లలో జరిగింది. ఇక ఇంటర్మీడియట్ పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగింది. తన ఎంకామ్‌ పట్టా వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ నుండి పొందింది. కరీంనగర్‌లోని గౌరెశెట్టి బీఈడీ కళాశాలలో ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిచేసింది.

సాహిత్యం

మార్చు

వివిధ పత్రికలు, ఆదివారం సంచికలతోపాటు పలు కవుల కవిత్వ సంకలనాల్లో ఆమె రాసిన సాహిత్యం, కవిత్వాలు, పద్యాలు ప్రచురించబడ్డాయి. 2015లో ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలోనిర్వహించిన యూత్‌ ఫెస్టివెల్‌లో జరిగిన కవి సమ్మేళనంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కవి సమ్మేళనాల్లో ఆమె పాల్గొన్నది. ఆల్‌ ఇండియా రేడియో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కవి సమ్మేళనంలో ఆమె కవిత్వం వినిపించింది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు