అల్ట్రా ప్రామినెంట్ శిఖరం
అల్ట్రా ప్రామినెంట్ శిఖరం లేదా సంక్షిప్తంగా అల్ట్రా అనేది 1,500 మీటర్లు (4,900 అ.), అంతకంటే ఎక్కువ టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ కలిగిన పర్వత శిఖరం. దీనిని P1500 అని కూడా అంటారు.[1] శిఖరం ప్రామినెన్స్ అనేది ఎత్తైన శిఖరం నుండి లేదా సముద్ర మట్టం నుండి ఏదైనా మార్గంలో శిఖరాన్ని అధిరోహించే కనీస ఎత్తు. భూమిపై ఇటువంటి శిఖరాలు దాదాపు 1,524 ఉన్నాయి. [2] మాటర్‌హార్న్, ఈగర్ వంటి కొన్ని ప్రసిద్ధ శిఖరాలు అల్ట్రాలు కావు. ఎందుకంటే అవి వాటికంటే ఎత్తైన పర్వతాలకు ఎత్తైన కోల్‌ల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. అందువల్ల వాటికి తగినంత స్థలాకృతి ప్రామినెన్స్ ఉండదు
"అల్ట్రా" అనే పదాన్ని భూ శాస్త్రవేత్త స్టీవ్ ఫ్రై కాయించాడు. 1980 లలో వాషింగ్టన్‌లోని శిఖరాల ప్రాముఖ్యత గురించి ఆయన చేసిన అధ్యయనాలలో ఈ పదాన్ని వాడాడు. అతను వాడిన అసలు పదం "అల్ట్రా మేజర్ పర్వతం", ఇది కనీసం 1,500 మీటర్లు (4,900 అ.) ప్రామినెన్స్ ఉన్న శిఖరాన్ని సూచిస్తుంది.[3]
విస్తరణ
మార్చుఇప్పటి వరకు, సముద్ర మట్టానికి పైన 1,518 అల్ట్రాలను గుర్తించారు: ఆసియాలో 639, ఉత్తర అమెరికాలో 356, దక్షిణ అమెరికాలో 209, ఐరోపాలో 120 (కాకసస్‌లో 12 సహా), ఆఫ్రికాలో 84, ఓషియానియాలో 69, అంటార్కిటికాలో 41.[2]
ఎవరెస్టు పర్వతం, K2, కాంచనజంగా, కిలిమంజారో, మోంట్ బ్లాంక్, మౌంట్ ఒలింపస్‌తో సహా ప్రపంచంలోని అనేక అతిపెద్ద పర్వతాలు అల్ట్రాలే. మరోవైపు, ఈగర్, మాటర్‌హార్న్ వంటివి అల్ట్రా కాదు. గ్రీన్‌ల్యాండ్‌లోని 39, నోవాయా జెమ్లియా, జాన్ మాయెన్, స్పిట్స్‌బెర్గెన్ ఆర్కిటిక్ ద్వీపాలలోని ఎత్తైన ప్రదేశాలు, ఆసియాలోని గ్రేటర్ శ్రేణులలోని అనేక శిఖరాలతో సహా ప్రపంచంలో ప్రజలు చాలా అరుదుగా సందర్శించే, నివాస యోగ్యం కాని ప్రాంతాలలో చాలా అల్ట్రాలు ఉన్నాయి. బ్రిటిష్ కొలంబియాలోని కొన్ని పర్వతాలకు మామూలుగా పిలుచుకునే పేర్లు కూడా లేవు.
8,000-మీటర్ల కంటే ఎత్తున్న పద్నాలుగు శిఖరాలలో పదమూడు అల్ట్రాలు (లోట్సే ఒక్కటే మినహాయింపు), 7,000 మీటర్లు (23,000 అ.) కంటే ఎక్కువ ఎత్తున్న పర్వతాలలో 64 అల్ట్రాలు ఉన్నాయి. 3,000 మీటర్లు (9,800 అ.) కంటే ఎక్కువ ప్రామినెన్స్ కలిగిన అల్ట్రాలు 90 ఉన్నాయి. 4,000 మీటర్లు (13,000 అ.) కంటే ఎక్కువ ప్రామినెన్స్ ఉన్నవి 22.
అల్ట్రాలలో చాలావాటిని ఇంకా ఎవరూ అధిరోహించ లేదు. సౌయర్ జోటాసీ, (బహుశా) మౌంట్ సైపుల్, గంగ్‌కార్ ప్యూన్సమ్ ప్రపంచంలో ఇలాంటి పర్వతాలలో కొన్ని.[3][4]
వివిధ ఖండాల్లోని ఏడు అత్యంత ఎత్తైన శిఖరాలు పెద్ద భూభాగాల లోని ఎత్తైన ప్రదేశాలు కావడం వల్ల అవి అల్ట్రాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ "కీ కోల్" సముద్ర మట్టం వద్ద లేదా దానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ కారణంగా ఈ శిఖరాల ప్రామినెన్స్ వాటి ఎత్తుకు సమానంగా ఉంటుంది.
మూలాలు
మార్చు- ↑ Rob Woodhall (18 May 2016). "Relative hills on Earth". TheRelativeHillsofBritain.
Ultra: peaks with a minimum prominence/relative height of 1500m. Steve Fry coined the term Ultra in the USA in the 1980s. His original term was 'ultra major mountain'. There are no Ultra summits in Britain. Hall of Fame entry minimum is 15.
- ↑ 2.0 2.1 Maizlish, A. "The Ultra-Prominences Page". Peaklist.org. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "PeakList" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 3.0 3.1 Helman, Adam (2005). The Finest Peaks: Prominence and other Mountain Measures. Trafford. ISBN 1-4120-5994-1. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "helman" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Maizlish, A. "Antarctic Ultra-Prominent Summits". Peaklist.org. (See footnotes 3 and 10.)