అల్లు భానుమ‌తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

అల్లు భానుమతి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు గ్రంధి మాధవి
తరువాత ఈటి విజయలక్ష్మి
నియోజకవర్గం విశాఖపట్నం - I

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం మార్చు

అల్లు భానుమ‌తి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం - I నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పాలూరి శేషమాంబ పై 9038 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత విశాఖపట్నం జిల్లా డీసీసీబి చైర్‌పర్సన్‌గా పని చేసింది. భానుమతి ఫిబ్రవరి 2019లో జనసేన పార్టీలో చేరింది, ఆమె మాడుగుల నియోజకవర్గం టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో[1] 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. అల్లు భానుమ‌తి 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.

మూలాలు మార్చు

  1. Sakshi (21 March 2019). "పవన్‌ మమ్మల్ని మోసం చేశాడు: మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.