అల్లెగ్రా హ్యూస్టన్

బ్రిటిష్-అమెరికన్ రచయిత్రి, సంపాదకురాలు

అల్లెగ్రా హ్యూస్టన్ బ్రిటిష్-అమెరికన్ రచయిత్రి, సంపాదకురాలు. లవ్ చైల్డ్: ఎ మెమోయిర్ ఆఫ్ ఫ్యామిలీ లాస్ట్ అండ్ ఫౌండ్, ఎ స్టోలెన్ సమ్మర్, హౌ టు ఎడిట్ అండ్ బి ఎడిట్, హౌ టు రీడ్ వంటి నవలలు రాసింది. స్క్రీన్ ప్లే రచయితగా గుడ్ లక్, మిస్టర్ గోర్స్కీ అనే లఘుచిత్రాన్ని కూడా నిర్మించింది.[1]

అల్లెగ్రా హ్యూస్టన్
పుట్టిన తేదీ, స్థలం (1964-08-26) 1964 ఆగస్టు 26 (వయసు 60)
లండన్, ఇంగ్లాండ్
వృత్తిరచయిత్రి, సంపాదకురాలు
జాతీయతబ్రిటీష్
అమెరికన్
కాలం2009–ప్రస్తుతం
సంతానం1
బంధువులు

జీవిత విశేషాలు

మార్చు

అల్లెగ్రా హ్యూస్టన్ 1964, ఆగస్టు 26న లండన్‌ నగరంలో జన్మించింది. తల్లి బాలేరినా ఎన్రికా సోమ, తండ్రి జాన్ జూలియస్ కూపర్.[2] తన నాలుగు సంవత్సరాల వయస్సులో కారు ప్రమాదంలో తల్లి మరణించింది. తరువాత ఐర్లాండ్‌కు వెళ్ళింది. అక్కడ తన తల్లి విడిపోయిన భర్త, సినీ దర్శకుడు జాన్ హ్యూస్టన్ దగ్గర పెరిగింది.[2] హ్యూస్టన్ కు సవతి తోబుట్టువులు నటి-దర్శకురాలు అంజెలికా హ్యూస్టన్, రచయిత టోనీ హ్యూస్టన్, రచయిత ఆర్టెమిస్ కూపర్, జాసన్ కూపర్ ఉన్నారు.

కెరీర్

మార్చు

ఆక్స్‌ఫర్డ్‌లోని హెర్ట్‌ఫోర్డ్ కళాశాల నుండి ఆంగ్లంలో పట్టా పొందిన తరువాత, పుస్తక ప్రచురణను ప్రారంభించింది. ప్రారంభంలో చాటో &విండస్‌, తరువాత వీడెన్‌ఫెల్డ్ & నికోల్సన్‌, 1990 నుండి 1994 వరకు సంపాదకీయ డైరెక్టర్‌గా ఉన్నది. లండన్‌లోని పాథే ఫిల్మ్స్‌లో అక్విజిషన్ అండ్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్‌గా రెండేళ్ళపాటు పనిచేసింది.

ప్రచురించిన రచనలు

మార్చు
  • లవ్ చైల్డ్: ఎ మెమోయిర్ ఆఫ్ ఫ్యామిలీ లాస్ట్ అండ్ ఫౌండ్, ఏప్రిల్ 2009లో సైమన్ & షుస్టర్, బ్లూమ్స్‌బరీ ద్వారా ప్రచురించబడింది.[3][4][5]
  • సే మై నేమ్: ఒక నవల (లండన్: హెచ్,క్యూ, జూలై 2017; న్యూయార్క్: ఎంఐఆర్ఏ, జనవరి 2018), పేపర్‌బ్యాక్‌లో స్టోలెన్ సమ్మర్ (2019)గా తిరిగి ప్రచురించబడింది
  • ట్వైస్ 5 మైల్స్ గైడ్స్: హౌ టు ఎడిట్ అండ్ బి ఎడిటెడ్ అండ్ హౌ టు రీడ్ ఫర్ ఎన్ ఆడియన్స్ (జేమ్స్ నవేతో)[6]

మూలాలు

మార్చు
  1. Good Luck, Mr Gorski at Vimeo.com
  2. 2.0 2.1 Huston, Allegra (30 May 2011). "Life as a Hollywood Love Child". The Daily Beast. Retrieved 2023-06-08.
  3. New Book Releases, Bestsellers, Author Info. & More at Simon & Schuster Archived 6 ఏప్రిల్ 2009 at the Wayback Machine. Books.simonandschuster.com. Retrieved 2023-06-08.
  4. [1] Archived 29 ఏప్రిల్ 2009 at the Wayback Machine
  5. Khan, Urmee. (5 April 2009) Allegra Huston speaks of the shock at discovering she was the love child of a Lord. The Telegraph. Retrieved 2023-06-08.
  6. "How-to books offered by Huston and Navé". 13 November 2018.

బయటి లింకులు

మార్చు