జాన్ హ్యూస్టన్
జాన్ మార్సెల్లస్ హ్యూస్టన్ (1906, ఆగస్టు 5 – 1987, ఆగస్టు 28) అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, నటుడు.[1] తను దర్శకత్వం వహించిన 37 సినిమాలలో చాలా సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశాడు. ఇతను దర్శకత్వం వహించిన ది మాల్టీస్ ఫాల్కన్ (1941), ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే (1948), ది అస్ఫాల్ట్ జంగిల్ (1950), ది ఆఫ్రికన్ క్వీన్ (1951), ది మిస్‌ఫిట్స్ (1961), ఫ్యాట్ సిటీ (1972), ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్ (1975), ప్రిజీస్ ఆనర్ (1985) వంటి సినిమాలు నేడు క్లాసిక్‌లుగా పరిగణించబడుతున్నాయి. తన 46 సంవత్సరాల సినీ జీవితంలో 15 అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యి, రెండు అవార్డులను గెలుచుకున్నాడు. తన తండ్రి వాల్టర్ హ్యూస్టన్, కుమార్తె అంజెలికా హస్టన్ ఇద్దరికీ ఆస్కార్ అవార్డులను అందించాడు.
జాన్ హ్యూస్టన్ | |
---|---|
జననం | నెవాడా, మిస్సౌరీ, యుఎస్ | 1906 ఆగస్టు 5
మరణం | 1987 ఆగస్టు 28 రోడ్ ఐలాండ్, మిడిల్‌టౌన్, యుఎస్ | (వయసు 81)
సమాధి స్థలం | హాలీవుడ్ ఫరెవర్ స్మశానవాటిక |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1930–1987 |
జీవిత భాగస్వామి |
|
భాగస్వామి | జో సల్లిస్ |
పిల్లలు | 5, అంజెలికా, టోనీ, డానీ, అల్లెగ్రా |
తల్లిదండ్రులు | వాల్టర్ హ్యూస్టన్ రియా (నీ గోర్) |
జననం
మార్చుజాన్ హ్యూస్టన్ 1906, ఆగస్టు 5న రియా (నీ గోర్) - వాల్టర్ హ్యూస్టన్ దంపతులకు మిస్సౌరీలోని నెవాడాలో జన్మించాడు. ఇతని తండ్రి ఒక నటుడు, మొదట్లో వాడేవిల్లే, తరువాత ఇతర సినిమాలలో నటించారు. ఇతని తల్లి వివిధ ప్రచురణలకు స్పోర్ట్స్ ఎడిటర్‌గా పనిచేసింది.
కళారంగం
మార్చుపారిస్లో ఫైన్ ఆర్ట్ పెయింటర్‌గా చదువుకున్నాడు, పనిచేశాడు. మెక్సికోకు వెళ్ళి అక్కడ నాటకాలు, చిన్న కథలు రాయడం ప్రారంభించాడు. తరువాత హాలీవుడ్ స్క్రీన్ రైటర్‌గా లాస్ ఏంజిల్స్‌లో పనిచేశాడు. విలియం డైటెర్లే, హోవార్డ్ హాక్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు అనేక అకాడమీ అవార్డుల రచనకు నామినేట్ అయ్యాడు. ది మాల్టీస్ ఫాల్కన్ అనే సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇది తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ వాణిజ్యపరంగా, విమర్శనాత్మకంగా విజయవంతమైంది. ప్రతి సన్నివేశాన్ని ముందుగా కాగితంపై గీసేవాడు, ఆపై షూటింగ్ సమయంలో తన పాత్రలను జాగ్రత్తగా రూపొందించాడు. చాలామంది దర్శకులు పోస్ట్-ప్రొడక్షన్ ఎడిటింగ్‌పై ఆధారపడుతుండగా, ఇతను తన సినిమాలను తీస్తున్న సమయంలోనే జాగ్రత్త వహించేవాడు, అందుకే ఇతని సినిమాలకు తక్కువ ఎడిటింగ్ అవసరం ఉంటుంది.
ప్రారంభంలో కొన్ని నాటకాలలో నటించినప్పటికీ, అప్పుడప్పుడు తన స్వంత సినిమాలలో బిట్ పార్ట్‌లలో నటించాడు. 1963లో ఒట్టో ప్రీమింగర్ తీసిన ది కార్డినల్ సినిమాలో నటించే వరకు అతను కెమెరా వెనుక పనిచేశాడు. ఈ సినిమాకు ఇతడు ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. 1974లో చైనాటౌన్ (రోమన్ పోలన్స్కి దర్శకత్వం వహించాడు) సినిమాతోపాటు తరువాతి రెండు దశాబ్దాలు ప్రముఖ సహాయక పాత్రలను పోషించాడు. అనేక ప్రముఖ చిత్రాలకు వాయిస్ యాక్టర్, వ్యాఖ్యాతగా తన బారిటోన్ వాయిస్‌ని అందించాడు. ఇతడు చివరిదశలో ఉన్నప్పుడు 1985లో ప్రిజీస్ ఆనర్, 1987లో ది డెడ్ అనే సినిమాలు తీశాడు. ఇవి రెండూ బహుళ అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడ్డాయి. తన చివరి చిత్రం పూర్తిచేసిన కొద్దిసేపటి తరువాత మరణించాడు.
హాలీవుడ్ సినిమారంగంలో ఇతడిని "టైటాన్", "తిరుగుబాటుదారుడు", "పునరుజ్జీవనోద్యమ వ్యక్తి" అని పిలుస్తారు. వివిధ సమయాల్లో ఫ్రాన్స్, మెక్సికో, ఐర్లాండ్‌లో స్థిరపడ్డాడు. ఇతడు పుట్టుకతో యుఎస్ పౌరుడు, కానీ 1964లో ఐరిష్ పౌరుడిగా, నివాసిగా మారాడు. అతను తరువాత యుఎస్ కి తిరిగి వచ్చి, తన జీవితాంతం గడిపాడు.[2] అమెరికన్ సినిమారంగానికి చేసిన కృషికి 1960 ఫిబ్రవరిలో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్‌ని అందుకున్నాడు.
సినిమాలు
మార్చుస్క్రీన్ రైటర్‌గా
మార్చుసంవత్సరం | పేరు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|
1930 | ది స్ట్రోమ్ | విలియం వైలర్ | చార్లెస్ లోగ్, లాంగ్డన్ మెక్‌కార్మిక్, టామ్ రీడ్ & వెల్స్ రూట్‌తో సహ రచయిత |
1931 | ఎ హౌజ్ డివైడెడ్ | జాన్ బి. క్లైమర్, ఆలివ్ ఈడెన్స్ & డేల్ వాన్ ప్రతితో సహ రచయిత | |
1932 | మర్డర్స్ ఇన్ ది ర్యూ మార్చురీ | రాబర్ట్ ఫ్లోరీ | టామ్ రీడ్ & డేల్ వాన్ ప్రతితో సహ రచయిత |
లా అండ్ ఆర్డర్ | ఎడ్వర్డ్ ఎల్. కాహ్న్ | టామ్ రీడ్ & రిచర్డ్ షాయర్‌తో సహ రచయిత | |
1935 | డెత్ డ్రైవ్స్ త్రూ | కేథరీన్ స్ట్రూబీ & గోర్డాన్ వెల్లెస్లీతో సహ రచయిత | |
ఇట్స్ హప్పెండ్ ఇన్ పారిస్ | రాబర్ట్ వైలర్ | కేథరీన్ స్ట్రూబీ & హెచ్ఎఫ్ మాల్ట్బీతో సహ రచయిత | |
1938 | ది అమేజింగ్ డాక్టర్. క్లిట్టర్‌హౌస్ | అనటోల్ లిట్వాక్ | జాన్ వెక్స్లీతో సహ రచయిత |
జెజెబెల్ | విలియం వైలర్ | క్లెమెంట్స్ రిప్లే, అబెమ్ ఫింకెల్ & రాబర్ట్ బక్నర్‌తో సహ రచయిత | |
1939 | జుయారెజ్ | విలియం డైటెర్లే | ఈనియాస్ మెకెంజీ & వోల్ఫ్‌గ్యాంగ్ రీన్‌హార్డ్‌తో సహ రచయిత |
1940 | డాక్టర్ ఎర్లిచ్స్ మ్యాజిక్ బుల్లెట్ | నార్మన్ బర్న్‌స్టైన్ & హీంజ్ హెరాల్డ్‌తో సహ రచయిత | |
1941 | హై సియర్రా | రౌల్ వాల్ష్ | బర్నెట్‌తో సహ రచయిత |
సార్జెంట్ యార్క్ | హోవార్డ్ హాక్స్ | అబెమ్ ఫింకెల్, హ్యారీ చాండ్లర్ & హోవార్డ్ కోచ్‌లతో సహ రచయిత | |
1946 | ది కిల్లర్స్ | రాబర్ట్ సియోడ్మాక్ | |
త్రీ స్ట్రేంజర్స్ | జీన్ నెగులేస్కో | హోవార్డ్ కోచ్‌తో సహ రచయిత | |
స్ట్రేంజర్ | ఓర్సన్ వెల్లెస్ | [3] | |
1988 | మిస్టర్ నార్త్ | డానీ హ్యూస్టన్ | జానెట్ రోచ్ & జేమ్స్ కోస్టిగాన్‌తో సహ రచయిత |
అవార్డులు, సన్మానాలు
మార్చుప్రధాన అసోసియేషన్ అవార్డులు
మార్చుసంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|
1941 | డాక్టర్ ఎర్లిచ్స్ మ్యాజిక్ బుల్లెట్ | ఉత్తమ రచన, ఒరిజినల్ స్క్రీన్ ప్లే | నామినేట్ |
1942 | మాల్టీస్ ఫాల్కన్ | ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లే | నామినేట్ |
సార్జెంట్ యార్క్ | ఉత్తమ రచన, ఒరిజినల్ స్క్రీన్ ప్లే | నామినేట్ | |
1949 | ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే | ఉత్తమ దర్శకుడు | విజేత |
ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లే | విజేత | ||
1951 | ది అస్ఫల్ట్ జంగిల్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లే | నామినేట్ | ||
1952 | ఆఫ్రికన్ క్వీన్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
ఉత్తమ రచన, స్క్రీన్‌ప్లే | నామినేట్ | ||
1953 | మౌలిన్ రోగ్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
1958 | హెవెన్ నోస్, మిస్టర్ అల్లిసన్ | ఉత్తమ రచన, మరొక మీడియం నుండి మెటీరియల్ ఆధారంగా స్క్రీన్ ప్లే | నామినేట్ |
1964 | ది కార్డినల్ | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ |
1976 | ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్ | ఉత్తమ రచన, ఇతర అంశాల నుండి స్వీకరించబడిన స్క్రీన్‌ప్లే | నామినేట్ |
1986 | ప్రిజ్జీస్ హానర్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
సంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|
1949 | ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే | ఉత్తమ దర్శకుడు | విజేత |
1951 | ది అస్ఫల్ట్ జంగిల్ | నామినేట్ | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ | ||
1963 | ఫ్రాయిడ్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
1964 | ది కార్డినల్ | ఉత్తమ సహాయ నటుడు | విజేత |
1965 | ది నైట్ ఆఫ్ ది ఇగ్వానా | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
1975 | చైనాటౌన్ | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ |
1986 | ప్రిజ్జీస్ హానర్ | ఉత్తమ దర్శకుడు | విజేత |
బ్రిటీష్ సినిమా అవార్డులు
మార్చుసంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|
1975 | చైనాటౌన్ | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ |
1980 | — | బ్రిటీష్ సినిమా ఫెలోషిప్ | విజేత |
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు
మార్చుసంవత్సరం | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|
1988 | ది డెడ్ | ఉత్తమ దర్శకుడు | విజేత |
విమర్శకుల అవార్డులు
మార్చుసంవత్సరం | అసోసియేషన్ | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
1948 | న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే | ఉత్తమ దర్శకుడు | విజేత |
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ | ఉత్తమ స్క్రీన్ ప్లే | విజేత | ||
1950 | న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | ది అస్ఫల్ట్ జంగిల్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ | ఉత్తమ దర్శకుడు | విజేత | ||
1952 | న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | ఆఫ్రికన్ క్వీన్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
1956 | మోబి డిక్ | విజేత | ||
ఉత్తమ స్క్రీన్ ప్లే | నామినేట్ | |||
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ | ఉత్తమ దర్శకుడు | విజేత | ||
1974 | కాన్సాస్ సిటీ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | చైనాటౌన్ | ఉత్తమ సహాయ నటుడు | విజేత |
1979 | లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ | — | కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డు | విజేత |
1984 | నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ | — | కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డు | విజేత |
1985 | న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | ప్రిజ్జీస్ హానర్ | ఉత్తమ దర్శకుడు | విజేత |
1986 | బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ | ఉత్తమ దర్శకుడు | విజేత | |
నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ | ఉత్తమ దర్శకుడు | విజేత | ||
1987 | న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | ది డెడ్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ |
1988 | నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ | |
1989 | ఫ్రెంచ్ సిండికేట్ ఆఫ్ సినిమా క్రిటిక్స్ | ఉత్తమ విదేశీ చిత్రం | విజేత | |
లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ | విజేత |
ఫిల్మ్ ఫెస్టివల్స్
మార్చుసంవత్సరం | ఫెస్టివల్స్ | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
1948 | వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ | ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే | గ్రాండ్ ఇంటర్నేషనల్ అవార్డు | నామినేట్ |
1950 | ది అస్ఫల్ట్ జంగిల్ | గోల్డెన్ లయన్ | నామినేట్ | |
1953 | మౌలిన్ రోగ్ | నామినేట్ | ||
సిల్వర్ లయన్ | విజేత | |||
1963 | బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | ఫ్రాయిడ్ | గోల్డెన్ బేర్ | నామినేట్ |
1979 | చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | వైజ్ బ్లడ్ | గోల్డ్ హ్యూగో | నామినేట్ |
శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | గోల్డెన్ షెల్ | నామినేట్ | ||
1981 | మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | విక్టరీ | గోల్డెన్ ప్రైజ్ | నామినేట్ |
1984 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ | అండర్ ది వోల్కనో | పామ్ డి'ఓర్ | నామినేట్ |
1985 | వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ | ప్రిజ్జీస్ హానర్ | గోల్డెన్ లయన్ | నామినేట్ |
గోల్డెన్ సియాక్ | విజేత | |||
— | మొత్తం పని కోసం ప్రత్యేక సింహం | విజేత | ||
1987 | టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ | ది డెడ్ | టోక్యో గ్రాండ్ ప్రిక్స్ | నామినేట్ |
ప్రత్యేక సాఫల్య పురస్కారం | విజేత |
గిల్డ్ అవార్డులు
మార్చుసంవత్సరం | గిల్డ్ | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
1949 | రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | ది ట్రెజర్ ఆఫ్ ది సియెర్రా మాడ్రే | ఉత్తమ రచన అమెరికన్ డ్రామా | నామినేట్ |
ఉత్తమ పాశ్చాత్య రచన | విజేత | |||
కీ లార్గో | ఉత్తమ రచన అమెరికన్ డ్రామా | నామినేట్ | ||
1951 | డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | ది అస్ఫల్ట్ జంగిల్ | చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయం | నామినేట్ |
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | రాబర్ట్ మెల్ట్జర్ అవార్డు | నామినేట్ | ||
ఉత్తమ రచన అమెరికన్ డ్రామా | నామినేట్ | |||
1953 | మౌలిన్ రోగ్ | ఉత్తమ రచనా నాటకం | నామినేట్ | |
1957 | డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | మోబి డిక్ | చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయం | నామినేట్ |
1958 | హెవెన్ నోస్, మిస్టర్ అల్లిసన్ | నామినేట్ | ||
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | ఉత్తమ రచనా నాటకం | నామినేట్ | ||
1962 | డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | ది మిస్‌ఫిట్స్ | చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయం | నామినేట్ |
1963 | ఫ్రాయిడ్ | నామినేట్ | ||
1964 | రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | — | స్క్రీన్ రైటింగ్ అచీవ్‌మెంట్ కోసం లారెల్ అవార్డు | విజేత |
1965 | డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | ది నైట్ ఆఫ్ ది ఇగ్వానా | చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయం | నామినేట్ |
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | ఉత్తమ రచనా నాటకం | నామినేట్ | ||
1976 | ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్ | మరొక మాధ్యమం నుండి స్వీకరించబడిన ఉత్తమ నాటకం | నామినేట్ | |
1983 | డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా | — | లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - ఫీచర్ ఫిల్మ్ | విజేత |
1986 | ప్రిజ్జీస్ హానర్ | చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయం | నామినేట్ |
ఇతర అవార్డులు
మార్చుసంవత్సరం | అసోసియేషన్ | సినిమా | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
1957 | ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ | మోబి డిక్ | ఉత్తమ విదేశీ చిత్రం | విజేత |
1966 | అకాడెమియా డెల్ సినిమా ఇటాలియన్ | ది బైబిల్ | ఉత్తమ విదేశీ దర్శకుడు | విజేత |
1979 | రికార్డింగ్ అకాడమీ | ది హాబిట్ | పిల్లల కోసం ఉత్తమ రికార్డింగ్ | నామినేట్ |
1981 | సొసైటీ ఆఫ్ కెమెరా ఆపరేటర్స్ | — | గవర్నర్స్ అవార్డు | విజేత |
1983 | గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డు ఫౌండేషన్ | అన్నీ | వరస్ట్ దర్శకుడు | నామినేట్ |
అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ | — | జీవిత సాఫల్య పురస్కారం | విజేత | |
1986 | ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ | ప్రిజ్జీస్ హానర్ | ఉత్తమ విదేశీ దర్శకుడు | నామినేట్ |
అకాడెమియా డెల్ సినిమా ఇటాలియన్ | ఉత్తమ విదేశీ దర్శకుడు | నామినేట్ | ||
1988 | కాహియర్స్ డు సినిమా | ది డెడ్ | వార్షిక టాప్ 10 జాబితాలు | 3వ స్థానం |
అకాడెమియా డెల్ సినిమా ఇటాలియన్ | ఉత్తమ విదేశీ దర్శకుడు | నామినేట్ | ||
ఉత్తమ విదేశీ చిత్రం | నామినేట్ | |||
1989 | బోడిల్ అవార్డులు | ది డెడ్ | ఉత్తమ నాన్-యూరోపియన్ చిత్రంగా బోడిల్ అవార్డు | విజేత |
మరణం
మార్చుఅధికంగా ధూమపానం చేయడం వల్ల 1978లో హ్యూస్టన్ కు ఎంఫిసెమా నిర్ధారణ అయింది. తన జీవితంలో చివరి సంవత్సరం నాటికి, ఇతడు ఆక్సిజన్ అవసరం లేకుండా ఇరవై నిమిషాల కంటే ఎక్కువ శ్వాస తీసుకోలేకపోయేవాడు.[4]
తన 81 సంవత్సరాల వయస్సులో ఊపిరితిత్తుల వ్యాధి న్యుమోనియాతో 1987, ఆగస్టు 28న మిడిల్‌టౌన్, రోడ్ ఐలాండ్‌లోని తన అద్దె ఇంటిలో మరణించాడు.[5][6] హాలీవుడ్‌లోని హాలీవుడ్ ఫరెవర్ స్మశానవాటికలో అంత్యక్రియలు చేయబడ్డాయి.
మూలాలు
మార్చు- ↑ Freer, Ian. Moviemakers Quercus (2009), pp. 70–71.
- ↑ "John Huston Becomes Irish Citizen". RTÉ Archives.
- ↑ "The Stranger". AFI Catalog of Feature Films. American Film Institute. Retrieved 2023-06-08.
- ↑ "John Huston Is Not Well But He's Very Much Alive". Chicago Tribune. March 12, 1987. Archived from the original on 2013-05-06. Retrieved 2023-06-08.
- ↑ "Actor John Huston Warns Others About Emphysema With PM-Obit-Huston Bjt". Apnewsarchive.com. August 29, 1987. Retrieved 2023-06-08.
- ↑ Byrne, James Patrick (2008). Philip Coleman, Jason Francis King (ed.). Ireland and the Americas: Culture, Politics, and History : a Multidisciplinary Encyclopedia, Volume 2. ABC-CLIO. p. 442. ISBN 9781851096145. Retrieved 2023-06-08.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జాన్ హ్యూస్టన్ పేజీ
- They Shoot Pictures, Don't They?
- Literature on John Huston
- John Huston papers, Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
- Walter and John Huston, circa 1932