అవును (సినిమా)
అవును 2012 లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఒక హారర్, థ్రిల్లర్ సినిమా. పూర్ణ, హర్షవర్ధన్ రాణే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతాన్నందించాడు. ఈ సినిమా 45 లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించబడింది.[1]
అవును | |
---|---|
దర్శకత్వం | రవిబాబు |
కథ | రవిబాబు |
నిర్మాత | రవిబాబు |
తారాగణం | పూర్ణ హర్షవర్ధన్ రాణే |
ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | సురేష్ ప్రొడక్షన్స్ పివిపి సినిమా |
విడుదల తేదీ | 21 సెప్టెంబరు 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఎప్పట్నుంచో ప్రేమికులుగా ఉన్న మోహిని (పూర్ణ), హర్ష (హర్షవర్ధన్ రాణే) పెళ్ళి చేసుకుని ఒక కొత్త ఇంటిలో కాపురం పెడతారు. కొత్త కాపురంలో అంతా సర్దుకునే దాకా హర్ష తల్లిదండ్రులు కొద్ది రోజులు ఉండటానికి వస్తారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళెవరికీ తెలియకుండా ఓ ఆత్మ తిరుగుతూ మోహిని వెంటపడుతూ ఉంటుంది. మోహినికి తెలియకుండా ఆమె బట్టలు మార్చుకుంటున్నపుడు, స్నానం చేస్తున్నపుడు ఆమెను చాటుగా గమనిస్తుంటుంది.
హర్ష వాళ్ళ పక్కింట్లో ఉండే చిన్న అబ్బాయి ఆత్మలతో చూడగలిగే, మాట్లాడే శక్తి ఉంటుంది. ఓ రెండు సార్లు అబ్బాయి హర్ష ఇంటికి వచ్చినపుడు ఆ ఇంట్లో ఉండే ఆత్మలతో మాట్లాడతాడు. కానీ పెద్దవాళ్ళకు మాత్రం ఏమీ కనిపించదు. వాళ్ళూ పిల్లవాడు ఏదో ఆట ఆడుకుంటున్నారని దాని గురించి పట్టించుకోరు. హర్ష తల్లిదండ్రులు తిరిగి ప్రయాణమవుతారు. మోహిని తాము హనీమూన్ కి వెళడానికి సరంజామా అంతా సిద్ధం చేస్తుంటుంది. అప్పుడే ఆత్మ వచ్చి ఆమె మీద అత్యాచారం చేయబోతుంది. మోహిని తప్పించుకును పక్కింట్లో తల దాచుకుంటుంది. అక్కడ దైవ పూజలు బాగా చేసే ఒక ఆవిడ (సుధ) ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ ఇంట్లోకి తీసుకు వెళుతుంది. కానీ ఆత్మ ఆమెను కూడా చంపేస్తుంది. హర్ష ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని ఆ ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మోహిని మరో రాత్రి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ ఆత్మ నుంచి వారిద్దరూ తప్పించుకున్నారా లేదా అన్నది మిగతా కథ.
తారాగణం
మార్చు- మొహినిగా పూర్ణ
- హర్షగా హర్షవర్ధన్ రాణే
- సుధ
- కెప్టెన్ రాజుగా రవిబాబు
నిర్మాణం
మార్చుఈ సినిమాలో చాలాభాగం హైదరాబాదులోని గండిపేట దగ్గర, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర చిత్రీకరించబడింది. రవిబాబు ఈ సినిమాకు సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చుతో తీశాడు. సినిమా చూసిన తర్వాత ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దీన్ని 3.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశాడు. తరువాత ఇందులో పొట్లూరి ప్రసాద్ కూడా భాగస్వామి అయ్యాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Ravi Babu's Avunu to be remade in Hindi?". 123telugu.com. 123telugu.com. Retrieved 18 November 2016.
- ↑ "Ravi Babu makes super profit on Avunu". 123telugu.com. Retrieved 7 June 2013.