సుధ (నటి)
సుధ ఒక ప్రముఖ సినీ నటి. 500 కి పైగా తెలుగు సినిమాలలో నటించింది.[1] ఆమె, గ్యాంగ్‌లీడర్, చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్షా లాంటి సినిమాలో మంచి పాత్రలు పోషించింది. తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎంటీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత, విశాల్ వంటి హీరోలందరికీ తల్లి పాత్రలు చేసింది.[2]
సుధ | |
---|---|
జననం | టి. హేమ సుధ 1964 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1990's–ఇప్పటివరకు |
జీవిత విశేషాలు
మార్చుఆమె పుట్టి పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. ఆమె తమిళురాలు అయినప్పటికీ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆమె కూతురు ఎంబీఏ పూర్తి చేసింది.[1]
కెరీర్
మార్చుఅలనాటి పౌరాణిక గాధను కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన శ్రీ వినాయక విజయం ద్వారా బాలనటిగా పరిచయమైన సుధ తరువాత అనేక చిత్రాలలో నటించింది. ఆమె నటించిన ఒక నాటకానికి విసు, ఎస్వీ ముత్తురామన్, బాలచందర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అక్కడ ఆమెను చూశాక సినిమాల్లో అవకాశం ఇచ్చారు. తమిళంలో మూడు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆమె తొలి చిత్రం ఏవీఎం సంస్థ నిర్మించింది. దాన్ని ముత్తురామన్ తీశారు. రెండో చిత్రం బాలచందర్ దర్శకత్వం వహించింది. ఇది షూటింగ్ పూర్తవ్వడంతో తొలిచిత్రంకంటే ముందే విడుదల అయ్యింది. సినిమా మాత్రం ఆకట్టుకోలేదు. ఆమె కెరీర్‌కు ఏడాదిపాటు గ్యాప్ వచ్చింది. అప్పుడు బాలచందర్ ఆమెకు హీరోయిన్‌కు చెల్లి పాత్ర ఇచ్చి చేయాలా వద్దా అనేది ఆమెనే నిర్ణయించుకోమన్నాడు. వారం రోజులు టైమ్ ఇచ్చాడు. ఆమె కేవలం గంటలో నిర్ణయం తీసుకుని ఓకే చెప్పింది. అప్పటి నుంచి సహాయ నటి పాత్రలకుపరిమితమమైపోయింది. అన్ని భాషల్లో కలిపి ఏడొందల చిత్రాలు పూర్తి చేసింది.
తెలుగులో ఆమె తొలి చిత్రం తల్లిదండ్రులు. ఆ సినిమాకు తాతినేని రామారావు దర్శకుడు.[1]
నటించిన చిత్రాలు
మార్చు2020లు
మార్చు- ఉత్సవం (2024)
- మాతృదేవోభవ (2022 సినిమా)
- దేశం కోసం భగత్ సింగ్ (2023)
2010లు
మార్చు- ఆటాడుకుందాం రా (2016)
- జానకి రాముడు (2016)
- అప్పుడలా ఇప్పుడిలా (2016)
- ఒక్కడినే (2013)
- శ్రీరామరాజ్యం (2011) - జనకుడి భార్య
- దూకుడు (2011) - జానకి
- బద్రీనాథ్ (2011)
- వీర (2011)
- సీమ టపాకాయ్ (2011)
- తీన్ మార్ (2011)
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు (2011)
- మిరపకాయ్ (2011)
- ఖలేజా (2010) - జి.కె. అసిస్టెంట్
- డాన్ శీను (2010)
- ఝుమ్మంది నాదం (2010)
- పంచాక్షరి (2010)
- శంభో శివ శంభో (2010)
2000లు
మార్చు- జయీభవ (2009)
- గణేష్ (2009)
- కరెంట్ (2009)
- బోనీ (2009)
- రైడ్ (2009)
- బంగారు బాబు (2009)
- కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
- ఫిటింగ్ మాస్టర్ (2009)
- కింగ్ (2008)
- ఏకలవ్యుడు (2008)
- రెడీ (2008)
- బుజ్జిగాడు (2008)
- తిన్నామా పడుకున్నామా తెల్లారిందా (2008)
- భలే దొంగలు (2008)
- స్వాగతం (2008)
- కృష్ణ (2008) - Krishna's sister-in-law
- దీపావళి (2008)
- మంగతాయారు టిఫిన్ సెంటర్ (2008)
- టక్కరి (2007)
- టాస్ (2007)
- క్లాస్ మేట్స్ (2007) - లక్ష్మి
- మధుమాసం (2007)
- మా ఇద్దరి మధ్య (2006)
- పోకిరి (2006) - శృతి తల్లి
- శ్రీరామదాసు (2006)
- జై చిరంజీవ (2005) = శైలజ తల్లి
- భగీరథ (2005)
- 2005 Oru Naal Oru Kanavu
- అతడు (2005) - పార్థసారధి తల్లి
- భద్ర (2005)
- సుభాష్ చంద్రబోస్ (2005)
- అల్లరి బుల్లోడు (2005)
- నేనున్నాను (2004)
- లక్ష్మీ నరసింహ (2004)
- అంజలి ఐ లవ్యూ (2004)
- కొడుకు (2004)
- జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- అప్పుడప్పుడు (2003)
- దిల్ (2003)
- నాగ (2003)
- హోలీ (2002)
- మన్మధుడు (2002) - లక్ష్మి, ప్రసాద్ భార్య
- నీ స్నేహం (2002)
- నువ్వే నువ్వే (2002)
- హోలీ (2002) - సీత
- శ్రీరామ్ (2002) - శ్రీరామ్ తల్లి
- సంతోషం (2002)
- కలుసుకోవాలని (2002)
- నువ్వు లేక నేను లేను (2002)
- ఇష్టం (2001) - అమ్మ
- మనసంతా నువ్వే (2001)
- అందాల ఓ చిలకా (2001)
- బావ నచ్చాడు (2001)
- నిన్ను చూడాలని (2001)
- అమ్మాయి కోసం (2001)
- 9 నెలలు (2001)
- నువ్వు నాకు నచ్చావు (2001) - నందిని తల్లి
- నువ్వే కావాలి (2000) - మధు తల్లి
- వంశీ (2000
- నువ్వు వస్తావని (2000)
- కలిసుందాం రా (2000)
- పెళ్ళి సంబంధం (2000)
- అంకుల్ (2000)
1990లు
మార్చు- రావోయి చందమామ (1999)
- అనగనగా ఒక అమ్మాయి (1999)
- సుల్తాన్ (1999)
- స్వయంవరం (1999)
- ప్రేమించుకుందాం రా (1997)
- రాముడొచ్చాడు (1996)
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) - సుప్రియ తల్లి
- క్రిమినల్ (1995) - లక్ష్మి
- ఘరానా బుల్లోడు (1995)
- పోకిరి రాజా (1995)
- ఘటోత్కచుడు (1995)
- హలో బ్రదర్ (1994)
- ఆమె (1994)
- బంగారు కుటుంబం (1994)
- బోయ్ ఫ్రెండ్ (1993)
- ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
- ఆజ్ కా గూండా రాజ్ (1992)
- గ్యాంగ్ లీడర్ (1991) - లక్ష్మి, రఘుపతి భార్య
1980లు
మార్చు- బాదల్ (1985)
- సంధ్య మయన్ముగం నేరం(1984) - శాంతి
1970లు
మార్చు- శ్రీ వినాయక విజయం (1979) - మొదటి సినిమా
- వేటగాడు (1979)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Mallemputi, Adhinarayana. "Interview with Sudha". andhrajyothy.com. Vemuri Radhakrishna. Archived from the original on 8 జూలై 2016. Retrieved 4 July 2016.
- ↑ Sakshi (23 January 2022). "దూరం పెట్టారు, మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది". Archived from the original on 23 జనవరి 2022. Retrieved 23 January 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుధ పేజీ