ఆవేటి పూర్ణిమ
ఆవేటి పూర్ణిమ (మార్చి 1, 1918 - నవంబరు 26, 1995) ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి.[1]
ఆవేటి పూర్ణిమ | |
---|---|
జననం | మార్చి 1, 1918 అత్తిలి |
మరణం | నవంబరు 26, 1995 ఏలూరు |
ప్రసిద్ధి | తెలుగు రంగస్థల నటీమణి |
మతం | Hindu |
భాగస్వాములు | ఆవేటి రామయ్య |
పిల్లలు | Aveti Gopalam (deceased)
B. Vijayalakshmi (deceased) Dr. G.P. Udayalakshmi (b. June 22nd 1947 d. March 29th 1996) Anuradha |
తండ్రి | వనారస గోవిందరావు |
తల్లి | సురభి లక్ష్మమ్మ |
జననం - వివాహం
మార్చుఈమె 1918, మార్చి 1న అత్తిలిలో నడియేటి పడవలో సురభి లక్ష్మమ్మ, వనారస గోవిందరావు లకు జన్మించారు. ఈమె 15వ ఏటనే ఆవేటి రామయ్య గారిని వివాహమాడారు.
మరణం
మార్చునాటకరంగ చరిత్ర
మార్చుతెలుగు టాకీ యుగ ప్రారంభంతో ప్రముఖ నటీమణులు సినిమాకి వెళ్ళిన తరుణంలో నాటకరంగంలో స్త్రీ పాత్రధారిణులకు కొరత ఏర్పడింది. ఈ స్థితిలోనే పూర్ణిమ రంగస్థలంమీద అవతరించింది. పుట్టింటివారి శిక్షణలో బాలనటిగా ఈమె నటనా జీవితం మొదలైంది. వివాహానంతరం 1936లో శ్రీ శారదా మనోవినోదిని పేరిట స్థాపించిన స్వంత నాటక కంపెనీలో నాయిక పాత్రధారిణిగా ఎంతో ప్రజాదరణను చేకూర్చుకొంది. "ఆనాటి ప్రసిద్ధ నటులందరి ప్రక్కన అన్ని నాటకాల్లోనూ ఆవేటి పూర్ణిమ స్త్రీ పాత్రలు ధరించారు. ఈవిడ పౌరాణిక పాత్రలే కాకుండా చారిత్రక పాత్రలు కూడా ధరించారు. 1944లో పూర్ణిమా ఆర్టు థియేటర్సును స్థాపించి స్వీయ సారథ్యంలో ఎన్నో నాటకాలను సమర్ధవంతంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతులు పొందారు. సత్యభామ, సక్కుబాయి, సావిత్రి, చిత్రాంగి, ప్రమీల, చంద్రమతి, మల్లమాంబ, కమల వంటి నాయిక పాత్రలు ఆమె నటజీవితంలో మైలురాళ్లుగా నిలిచాయి.
నటించిన నాటకాలు
మార్చు- సారంగధర (నాటకం)
- చిత్రనళీయం (నాటకం)
- హరిశ్చంద్ర (నాటకం)
- తులాభారం (నాటకం)
- చింతామణి (నాటకం)
- విప్రనారాయణ
- కృష్ణ లీల (నాటకం)
- సావిత్రి (నాటకం)
- పాదుకా పట్టాభిషేకం (నాటకం)
- భక్త ప్రహ్లాద
- మండోదరి
- ఖిల్జీరాజ్య పతనం
- కోకిల
- ధరణికోట
మొదలైన నాటకాలలో స్త్రీ పాత్రలన్నిటిని నటించేది." [2]
అవార్డులు
మార్చు- ఆంధ్ర నాటక కళా పరిషత్తు ప్రప్రథమంగా మద్రాసులో 1941లో నాటకపోటీలు జరిపినపుడు ఉత్తమనటి బహుమతిని అందుకుంది.[3]
సినిమారంగ చరిత్ర
మార్చుమూలాలు
మార్చు- ↑ "20వ శతాబ్ది తెలుగు వెలుగులు" (మొదటి భాగం), పేజీ. 351-2. తెలుగు విశ్వవిద్యాలయం, 2005.
- ↑ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: "నటరత్నాలు", పేజి 307. సీతారత్నం గ్రంధమాల, 2002
- ↑ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: "నటరత్నాలు", పేజి 308. సీతారత్నం గ్రంధమాల, 2002