అశోక్ గెహ్లోట్ (జననం 1951 మే 3) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి. ఇతను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు. ఇతను ఇప్పటివరకు 3 సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు:1998 డిసెంబరు నుండి 2003 వరకు మొదటిసారి, 2008 నుండి 2013 వరకు రెండవ సారి, 2018 డిసెంబరులో మూడవ సారి.

అశోక్ గెహ్లోట్
అశోక్ గెహ్లోట్


రాజస్థాన్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 డిసెంబరు 17
గవర్నరు కళ్యాణ్ సింగ్
కల్రాజ్ మిశ్రా
ముందు వసుందర రాజే
పదవీ కాలం
13 డిసెంబరు 2008 (2008-12-13) – 12 డిసెంబరు 2013 (2013-12-12)
గవర్నరు ఎస్.కె.సింగ్
ప్రభు రావు
ముందు వసుందర రాజే
తరువాత వసుందర రాజే
పదవీ కాలం
1 డిసెంబరు 1998 (1998-12-01) – 8 డిసెంబరు 2003 (2003-12-08)
గవర్నరు నవరంగ్ లాల్ టైబ్రేవాల్
అనుష్మణ్ సింగ్
నిర్మల్ చంద్ర జైన్
కైలాశపతి మిశ్రా }
ముందు భైరాన్ సింగ్ షెకావత్
తరువాత వసుందర రాజే

జనరల్ సెక్రటరీ AICC
పదవీ కాలం
2017 డిసెంబరు – 2019 జనవరి
తరువాత కే.సి. వేణుగోపాల్

కేంద్ర పర్యాటక శాఖ, పౌర విమానయాన శాఖ
పదవీ కాలం
31 December 1984 డిసెంబరు 31 – 26 September 1985 సెప్టెంబరు 26
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ / రాజీవ్ గాంధీ

కేంద్ర సహాయ మంత్రి (క్రీడా శాఖ)
పదవీ కాలం
1984 ఫిబ్రవరి 7 – 1984 అక్టోబరు 31
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి
పదవీ కాలం
1991 జూన్ 21 – 1993 జనవరి 18
ప్రధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
1991 – 1999
Constituency జోధ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-05-03) 1951 మే 3 (వయసు 73)[1]
జోధ్‌పూర్, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సునీతా గెహ్లోట్
సంతానం 2

వ్యక్తిగత జీవితం

మార్చు

అశోక్ గెహ్లోట్ తండ్రి బాబు లక్ష్మణ్ సింగ్ గెహ్లోట్ వృత్తిరీత్యా ఒక ఇంద్రజాలికుడు అతను తన ప్రదర్శనలు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉండేవాడు.[2] రాజకీయపరంగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా అశోక్ గెహ్లాట్ రాజకీయాల్లో రాణించగలిగాడు. అశోక్ గెహ్లోట్ సైన్స్ ఇంకా న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు, ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను కూడా చదివాడు. ఇతని కుమారుడు వైభవ్ గెహ్లోట్ కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు 2019 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో జోధ్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఈ పదవికి పోటీ చేశాడు.[3]

మహాత్మా గాంధీ బోధనల ద్వారా ప్రభావితుడైన అశోక్ గెహ్లోట్ తన చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేవాడు. 1971లో పశ్చిమ బెంగాల్ శరణార్ధుల ఘటన జరిగే సమయంలో, కొన్ని ప్రాంతాలలో శరణార్థులకు సహాయం అందించే కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆయనను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత జాతీయ విద్యార్థి మండలికి ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు .గాంధీజీ బోధనలు జీర్ణించుకున్న గెహ్లోట్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు.[2]

కెరీర్

మార్చు

సర్దార్‌పురా శాసనసభ నియోజకవర్గం నుండి 1977లో రాజస్థాన్ శాసనసభకు జరిగిన తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన అతను జనతా పార్టీకి చెందిన తన సన్నిహిత ప్రత్యర్థి మాధవ్ సింగ్ చేతిలో 4426 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. గెహ్లోట్ తన మొదటి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన మోటారు సైకిల్ ను విక్రయించాల్సి వచ్చింది. 1980లో జోధ్ పూర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి 52,519 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. 1984లో కేంద్ర మంత్రిగా నియమించబడ్డాడు. ఆ తరువాత 1989లో జోధ్ పూర్ నుంచి పోటీ చేసిన ఎన్నికల్లో ఓడిపోయాడు.[4]

1991లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో మళ్లీ కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. 1998లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 సీట్లలో 153 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఘన విజయం సాధించింది. అశోక్ గెహ్లాట్ తొలిసారిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

ముఖ్యమంత్రిగా

మార్చు

2003లో కాంగ్రెస్ రాజస్థాన్ ఎన్నికల్లో కేవలం 56 స్థానాలను గెలుచుకుంది. 2008 లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి గెలుపొందిన తరువాత గెహ్లోట్ రెండవ సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.[5]

మూలాలు

మార్చు
  1. "अशोक गहलोत के जन्मदिन पर समर्थकों ने किया शक्ति प्रदर्शन". Dainik Jagaran (in హిందీ). 4 May 2018. Retrieved 2 May 2019.
  2. 2.0 2.1 "Ashok Gehlot: The Magician in Rajasthan Congress". The Wire. Retrieved 2021-06-08.
  3. "Moochh ki ladai: Gehlot's son in prestige fight". www.telegraphindia.com. Retrieved 2021-06-08.
  4. "Ashok Gehlot Biography - About family, political life, awards won, history". Elections in India. Archived from the original on 2021-05-11. Retrieved 2021-06-08.
  5. Tewari, Ruhi (2008-12-08). "Congress comes up tops in Rajasthan with 96 seats". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-06-08.