అష్టలక్ష్ములు

ఒక

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.

అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు

ఈ అష్టలక్ష్ములు

  1. ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
  2. ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
  3. ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించింది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
  4. గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
  5. సంతానలక్ష్మి : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉంది.
  6. విజయలక్ష్మి : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
  7. విద్యాలక్ష్మి : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
  8. ధనలక్ష్మి : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.

కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.

ప్రార్థనసవరించు

 
రంగాపురం దేవాలయంలో గజలక్ష్మి మూర్తి

ఒక ప్రార్థన:

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

అష్టలక్ష్మి స్తోత్రంసవరించు

ఆదిలక్ష్మి :- సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి:- అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి:- జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి:- జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి:- అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే | సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి:- జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి:- ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే | నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి:- ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే | వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

"అష్టలక్ష్మీ స్తోత్రం" అనేది ఒక ప్రసిద్ధ ప్రార్థన. "జయ జయహే మధుసూదన కామిని .. " అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఇంకా అనేక తెలుగు, సంస్కృత ప్రార్థనా గీతాలున్నాయి.

ఇవికూడా చూడండిసవరించు

మందిరాలుసవరించు