అసేల గుణరత్నే

శ్రీలంక క్రికెటర్

డౌండెగెదర అసేల సంపత్ గుణరత్నే, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక తరపున క్రికెట్ లోని అన్ని రకాల ఫార్మాట్లలో ఆడాడు.[1] ఇతడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు పార్ట్-టైమ్ మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. ప్రస్తుతం శ్రీలంక ఆర్మీలో 6వ ఫీల్డ్ రెజిమెంట్, శ్రీలంక ఆర్టిలరీకి అనుబంధంగా ఉన్న వారెంట్ అధికారిగా పనిచేస్తున్నాడు.[2][3] 2017 నవంబరులో శ్రీలంక క్రికెట్ వార్షిక అవార్డుల వేడుకలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా రెండు అవార్డులతో సహా నాలుగు అవార్డులను గెలుచుకున్నాడు.[4]

అసేల గుణరత్నే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డౌండెగెదర అసేల సంపత్ గుణరత్నే
పుట్టిన తేదీ (1986-01-08) 1986 జనవరి 8 (వయసు 38)
కాండీ నగరం, శ్రీలంక
ఎత్తు6 అ. 1 అం. (1.85 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 138)2016 అక్టోబరు 29 - జింబాబ్వే తో
చివరి టెస్టు2017 జూలై 26 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 176)2016 నవంబరు 14 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2019 జనవరి 5 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.14
తొలి T20I (క్యాప్ 63)2016 ఫిబ్రవరి 14 - ఇండియా తో
చివరి T20I2017 డిసెంబరు 24 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005–2008Mohammedan Sporting Club
2008–presentSL Army
2017ముంబై ఇండియన్స్
2017Dhaka Dynamites
2018–presentComilla విక్టోరియాns
2019Lahore Qalandars
2019–20Chattogram Challengers
2020Kandy Tuskers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI T20I లిఎ
మ్యాచ్‌లు 6 31 12 50
చేసిన పరుగులు 455 575 225 919
బ్యాటింగు సగటు 56.87 27.38 25.00 24.18
100లు/50లు 1/3 1/1 0/2 -/4
అత్యుత్తమ స్కోరు 116 114* 84* 75*
వేసిన బంతులు 156 834 149 960
వికెట్లు 3 22 5 26
బౌలింగు సగటు 38.00 32.86 40.80 23.84
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/28 3/10 1/11 5/12
క్యాచ్‌లు/స్టంపింగులు 6/0 10/0 5/0 22/0
మూలం: Cricinfo, 5 January 2019

డౌండెగెదర అసేల సంపత్ గుణరత్నే 1986, జనవరి 8న శ్రీలంకలోని కాండీ నగరంలో జన్మించాడు. కాండీలోని శ్రీ రాహులా కళాశాలలో చదివాడు.[5]

దేశీయ, టీ20 ఫ్రాంచైజీ క్రికెట్

మార్చు

2017 ఫిబ్రవరిలో 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది.[6]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[7][8] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం క్యాండీ జట్టులో కూడా ఎంపికయ్యాడు.[9]

2018 ఆగస్టులో 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[10] 2018 అక్టోబరులో 2018-19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం డ్రాఫ్ట్ తర్వాత, కొమిల్లా విక్టోరియన్స్ జట్టులో జట్టులో ఎంపికయ్యాడు.[11] 2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[12] 2020 అక్టోబరులో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం క్యాండీ టస్కర్స్ చేత డ్రాఫ్ట్ చేయబడ్డాడు.[13] 2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ రెడ్స్ జట్టులో ఎంపికయ్యాడు.[14] 2021 నవంబరులో 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్స్ డ్రాఫ్ట్ తర్వాత క్యాండీ వారియర్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[15]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2016 ఫిబ్రవరిలో భారతదేశానికి శ్రీలంక పర్యటన కోసం ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు.[16] 2016 ఫిబ్రవరి 14న తన టీ20 అరంగేట్రం చేసాడు, నాలుగు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.[17]

2016 అక్టోబరు 29న జింబాబ్వేపై శ్రీలంక తరపున అరంగేట్రం చేశాడు.[18] మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యాభై పరుగులు చేశాడు, అదే పర్యటనలో రెండో మ్యాచ్‌లో తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు.

జింబాబ్వేలో ట్రై-సిరీస్ లో వెస్టిండీస్ మ్యాచ్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[19] ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసి 3 వికెట్లు పడగొట్టాడు.[20]

2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో అతను ఒకడు.[21][22] 2018 డిసెంబరులో 2018 ఎసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[23]

మూలాలు

మార్చు
  1. "Asela Gunaratne". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  2. "Army Cricketers Selected for T-20 Tour in India". Archived from the original on 11 September 2016. Retrieved 2023-08-24.
  3. "Army Promotions For Seekkuge Prasanna and Asela Gunaratne". News First. Retrieved 2023-08-24.
  4. "Gunaratne wins big at SLC's annual awards". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  5. "Coach Kuruppu lauds 'reluctant' schoolboy cricketer Gunaratne's growth". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  6. "List of players sold and unsold at IPL auction 2017". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  7. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-24.
  8. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-24.
  9. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-24.
  10. "SLC T20 League 2018 squads finalized". The Papare. Retrieved 2023-08-24.
  11. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 2023-08-24.
  12. "Squads, Fixtures announced for SLC Provincial 50 Overs Tournament". The Papare. Retrieved 2023-08-24.
  13. "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  14. "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 2023-08-24.
  15. "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  16. "Dilhara Fernando back in Sri Lanka T20 squad". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  17. "Sri Lanka tour of India and Bangladesh, 3rd T20I: India v Sri Lanka at Visakhapatnam, Feb 14, 2016". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  18. "Sri Lanka tour of Zimbabwe, 1st Test: Zimbabwe v Sri Lanka at Harare, Oct 29 – Nov 2, 2016". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  19. "Tharanga named SL captain for tri-series". ESPNcricinfo. ESPN Sports Media. 5 November 2016. Retrieved 2023-08-24.
  20. "Zimbabwe Tri-Nation Series, 1st Match: Zimbabwe v Sri Lanka at Harare, Nov 14, 2016". ESPNcricinfo. ESPN Sports Media. 14 November 2016. Retrieved 2023-08-24.
  21. "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-24.
  22. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  23. "Sri Lanka Squad for the ACC Emerging Teams Cup 2018". Sri Lanka Cricket. Archived from the original on 3 December 2018. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు

మార్చు