అహలె బైత్
అహలె బైత్ (అరబ్బీ: أهل البيت, టర్కిష్: ఎహల్ - ఇ బేయిత్ ) ఒక పదము, సాహితీభాషలో "పరివార సభ్యులు". ఇస్లామీయ సాహిత్యములో ప్రవక్త ఐన ముహమ్మద్ యొక్క కుటుంబ పరివారం.[1]
పదవ్యుత్పత్తి
మార్చుఅహ్ల్ అనగా ప్రజలు లేదా సభ్యులు. బైత్ అనగా "ఇల్లు" లేదా నివాసం, లేదా నిలయం. అహలె బైత్ లేదా ఆహ్లల్ బైత్, అనగా కుటుంబ సభ్యులు, కుటుంబంలో నివసించే సభ్యులు.[2]
ఖురాన్ లో అహలె బైత్
మార్చుఖురాన్లో "అహలె బైత్" అనే పదజాలము రెండు సార్లు ముహమ్మద్ ప్రవక్త భార్యలను సగౌరవంగా ఉద్యేశించి వర్ణింపబడింది.[3] మొదటి ఉదాహరణ ముహమ్మద్ ప్రవక్త గారి భార్యల గురించి [ఖోరాన్ 33:33] ఐతే, రెండవ ఉదాహరణ ఇబ్రాహీం ప్రవక్త భార్య ఐన సారాహ్ గురించి .[ఖోరాన్ 11:73]
షియా ఇస్లాం ప్రకారం అహలె బైత్
మార్చుషియాల ప్రకారం అహలె బైత్ అహ్ల్ అల్-కిసా లను, ఇమాం లను కూడా అహలె బైత్ గా భావిస్తారు. అహలె బైత్ లను పవిత్రంగానూ, ముస్లిం సమూహానికి గురువులుగానూ భావిస్తారు. అహలె బైత్ గా క్రింది వారిని గుర్తిస్తారు :
- ముహమ్మద్ ప్రవక్త
- ఫాతిమా జహ్రా
- ఇమాం అలీ ఇబ్న్ అబీ తాలిబ్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుసైన్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ హుసైన్
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం జాఫర్ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం మూసా ఇబ్న్ జాఫర్
- ఇమాం అలీ ఇబ్న్ మూసా
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుజ్జత్ ఇబ్న్ హసన్ [4]
ఇవీ చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ Ahl al-Bayt, Encyclopedia of Islam
- ↑ Mufradat al-Qur'an by Raghib Isfahani; Qamus by Firoozabadi; Majm'a al-Bahrayn
- ↑ Böwering, Gerhard; Patricia Crone; Wadad Kadi; Mahan Mirza; Muhammad Qasim Zaman; Devin J. Stewart (2012-11-11). The Princeton Encyclopedia of Islamic Political Thought. Princeton University Press. ISBN 9780691134840.
The term ahl al-bayt (the people of the house) is used in the Qur'an as a term of respect for wives, referring to Abraham's wife Sarah (Q. 11:73), for example, and to the Prophet Muhammad's wives, who are declared to be purified by divine act: "God's wish is to remove uncleanness from you" (Q. 33:32-33).
- ↑ "A Shi'ite Encyclopedia". www.al-islam.org (in ఇంగ్లీష్). 2013-11-12. Retrieved 2023-02-04.
మూలాలు
మార్చు- Madelung, Wilferd (1997). The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
- Ordoni, Abu Muhammad; Muhammad Kazim Qazwini (1992). Fatima the Gracious. Ansariyan Publications. ASIN B000BWQ7N6.
- Tahir-ul-Qadri, Muhammad (2006). Virtues of Sayyedah Fatimah. Minhaj-ul-Quran Publications. ISBN 969-32-0225-2.
- Tritton, A.S, Goldziher, I., Arendonk, C. van. "Ahl al-Bayt". In Bearman PJ, Bianquis T, Bosworth CE, van Donzel E, Heinrichs WP (eds.). Encyclopaedia of Islam. Brill Academic Publishers. ISSN 1573-3912.
బయటి లింకులు
మార్చు- I. K. A. Howard, Ahl al-Bayt in Encyclopædia Iranica.
- షియా - సంబంధిత
- సున్నీ సంబంధిత