ఆండ్రూ జోన్స్
ఆండ్రూ హోవార్డ్ జోన్స్ (జననం 1959, మే 9) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1987 నుండి 1995 వరకు న్యూజీలాండ్ తరపున 39 టెస్టులు, 87 వన్డేలు ఆడాడు. దేశీయ స్థాయిలో, సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లు, ఒటాగో, వెల్లింగ్టన్ లకు ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆండ్రూ హోవార్డ్ జోన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 9 May 1959 వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | (age 65)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 163) | 1987 ఏప్రిల్ 16 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 ఫిబ్రవరి 10 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 170) | 1987 అక్టోబరు 10 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 జనవరి 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 మే 4 |
అంతర్జాతీయ కెరీర్
మార్చు27 సంవత్సరాల వయస్సులో న్యూజీలాండ్ తరపున 1987, ఏప్రిల్ 16న శ్రీలంకతో జరిగిన టెస్టులో క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. పటిష్టమైన నంబర్ 3 బ్యాట్స్‌మన్ గా మారాడు. ఇతను ఆడిన 39 టెస్టుల్లో న్యూజీలాండ్ ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది.
తన ఏడు సెంచరీలలో ఐదింటిలో 140కి పైగా స్కోర్ చేశాడు. భారత్‌పై 50.13 సగటుతో 401 పరుగులు చేశాడు. శ్రీలంకపై 62.50 సగటుతో 625 పరుగులు చేశాడు. శ్రీలంకకు వ్యతిరేకంగా వెల్లింగ్టన్‌లో తన అత్యధిక టెస్ట్ స్కోరు 186 చేశాడు. ప్రస్తుతం న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్‌గా జోన్స్ వరుస ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
87 వన్డే ఇన్నింగ్స్‌లలో 35.69 సగటును కొనసాగించినప్పటికీ, వన్డేలో ఎప్పుడూ సెంచరీ చేయలేదు. బంగ్లాదేశ్‌పై షార్జాలో అతని అత్యధిక స్కోరు 93. 1992 క్రికెట్ ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ "Andrew Jones". CricketArchive. Retrieved 2022-04-24.
- ↑ "Bangladesh v New Zealand in 1989/90". CricketArchive. Retrieved 2022-04-24.
- ↑ Bidwell, Hamish (2015-01-23). "New Zealand great Andrew Jones gives current crop a chance of World Cup glory". Stuff (in ఇంగ్లీష్). Retrieved 2022-04-24.