ఆంథోని రాజ్
డా. ఆంథోని రాజ్ (మార్చి 21, 1965) రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, ధ్వన్యనుకరణ కళాకారుడు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి మిమిక్రీ కళ - వికాసం అన్న అంశంపై ఈయన చేసిన పిహెచ్.డీ, భారతదేశంలోనే మిమిక్రీ కళపై వచ్చిన మొదటి పిహెచ్.డీగా గుర్తింపు పొందింది.[1][2]
డా. ఆంథోని రాజ్ | |
---|---|
జననం | మార్చి 21, 1975 లాలాగూడా, సికిందరాబాదు తెలంగాణ |
విద్య | పిహెచ్.డి., మిమిక్రీ కళ – వికాసం (అంశం) తెలుగు విశ్వవిద్యాలయం |
వృత్తి | నట శిక్షకులు, రంగస్థల కళల శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, ధ్వన్యనుకరణ కళాకారుడు |
జీవిత భాగస్వామి | మంజుదేవి |
పిల్లలు | అలెన్ సుసై రాజ్, అలెన్ ప్రిన్స్ రాజ్ (కుమారులు), అన్నీ సమంత రాజ్ (ఒక కుమార్తె) |
తల్లిదండ్రులు |
|
జననం - విద్యాభ్యాసం
మార్చుఆంథోని రాజ్ 1975, మార్చి 21న సుసై రాజ్, తులసిబాయి దంపతులకు సికింద్రాబాదు, లాలాగూడాలో జన్మించాడు. లాలాగూడలోని రైల్వే బాలుర ఉన్నత పారశాలలో పూర్తిచేసిన ఆంథోని రాజ్, రైల్వే జూనియర్ కళాశాలలో ఇంటర్, రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివాడు. అనంతరం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లొమా ఇన్ మిమిక్రీ (2003 - 2004), పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్ (2004-2005) చదవాడు. అదే విశ్వవిద్యాలయంలో 2005 – 2007 మధ్యకాలంలో ఎం.ఏ. రంగస్థల కళలు చదివిన ఆంథోని రాజ్, 2010లో మిమిక్రీ కళ - ఒక అధ్యయనం అనే అంశంపై ఎం.ఫిల్, 2015లో మిమిక్రీ కళ – వికాసం అనే అంశంపై పిహెచ్.డి. పట్టాలు అందుకున్నాడు.
ఉద్యోగం
మార్చు2006 ఫిబ్రవరి నుండి తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శాఖలో నట శిక్షకులుగా పనిచేస్తున్నాడు.[1]
వివాహం - పిల్లలు
మార్చుఆంథోని రాజ్ కు మంజుదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (అలెన్ సుసాయ్ రాజ్, అలెన్ ప్రిన్స్ రాజ్), ఒక కుమార్తె (అన్నీ సమంత రాజ్).
రంగస్థల ప్రస్థానం
మార్చుతెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్, ఎం.ఏ. చదివిన ఆంథోని రాజ్ అదే విశ్వవిద్యాలయంలో నట శిక్షకుగా విద్యార్థలుకు నటన, ధ్వన్యనుకరణ, వెంట్రిలాక్విజం మొదలైన అంశాలలో పాఠాలు బోధిస్తూనే, వివిధ నాటక ప్రదర్శనల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా నాటకాలను రచించి, దర్శకత్వం వహిస్తున్నాడు. వివిధ నాటకాలలో సాంకేతిక సహకారం కూడా అందిస్తున్నాడు.
నటించినవి
మార్చు- కుర్చీ
- ఇదంతే
- గోగ్రహణం
- శాపగ్రస్తులు
- శశిరేఖా పరిణయం
- ట్యాక్స్ ఫ్రీ
- లోకా సమస్తా సుఖినోభవంతు
- గంగిరెద్దు
- బతుకమ్మ
- నాయకురాలు నాగమ్మ[3][4][5]
- రామప్ప
రచన, దర్శకత్వం చేసినవి
మార్చు- తప్పించుకోవడం ఎవరితరం? (రచన, దర్శకత్వం)
- ఎవడు వేసిన బాటరా ఇది
- యేసుజననం (రచన, దర్శకత్వం)
- అంథకార నగరం
- సమ్మక్క సారలమ్మ (రచన, దర్శకత్వం)
ఇతర విషయాలు
మార్చు- మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో అనేక ప్రదర్శనలు ఇవ్వడం
- మ్యాజిక్, బెలూన్ బొమ్మల[6] తయారీలో ప్రావీణ్యం ఉండడం
- నాటకరంగ ప్రదర్శనలకు రంగాలంకరణ, రంగోద్ధీపనం మొదలైన అంశాలలో సహకారం అందించడం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 మిమిక్రీ కళ వికాసం పరిశోధనకు ఆంథోని రాజ్ కు పి.హెచ్.డీ ప్రధానం, ఆంధ్రప్రభ, హైదరాబాద్ ఎడిషన్, జూలై 14, 2015, పుట. 11.
- ↑ మిమిక్రీలో తొలి డాక్టరేట్ సాధించిన ఆంథోని రాజ్, ఈనాడు, హైదరాబాద్ ఎడిషన్, జూలై 3, 2015, పుట. 12.
- ↑ www.thehindu.com (February 26, 2016). "Period plays make a mark". Retrieved 21 March 2018.
- ↑ www.thehindu.com (May 26, 2016). "Nayakuralu Nagamma, a visual delight". Retrieved 21 March 2018.
- ↑ timesofindia.indiatimes.com (Nov 15, 2016). "Bringing alive Nagamma's life on stage". Retrieved 21 March 2018.
- ↑ ఫుల్ థ్రిల్, వేసవి వినోదం, సాక్షి, హైదారాబాదు ఎడిషన్, మే 13 2016, పుట. 11.