ఆందోల్-జోగిపేట పురపాలకసంఘం
ఆందోల్-జోగిపేట పరపాలక సంఘం, సంగారెడ్డి జిల్లా చెందిన పురపాలకసంఘం. రెండు పట్టణాలను కలిపి పురపాలకసంఘంగా ఏర్పాటుచేయడంతో ఆందోల్-జోగిపేట పేరుతో పిలువబడుతుంది. 2020 జూలైలో ఇది రెవెన్యూ డివిజన్‌గా మారింది.[3] ఈ పట్టణం తెలంగాణా శాసనసభలోని ఆందోల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
ఆందోల్-జోగిపేట | |
---|---|
Coordinates: 17°50′N 78°04′E / 17.833°N 78.067°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
విస్తీర్ణం | |
• Total | 21.61 కి.మీ2 (8.34 చ. మై) |
జనాభా (2011)[2] | |
• Total | 18,494 |
• జనసాంద్రత | 860/కి.మీ2 (2,200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 502270 |
Vehicle registration | టిఎస్ |
చరిత్ర
మార్చు1955 నుంచి 1965 వరకు జోగిపేట పురపాలక సంఘంగా ఉండేది. 1965లో రెండీంటిని కలిపి పంచాయతీగా ఏర్పాటుచేశారు. ఈ రెండు పట్టణాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. 1998లో రెండింటినీ విడదీసి వేర్వేరు పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. ఆదాయం విషయంలో ఈ రెండింటి మధ్యన తగాదాలు జరుగుతుండేవి. 2013లో ఈ రెండు పట్టణాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటుచేశారు. జోగిపేటకు ఐదుగురు, ఆందోలుకు ఎనిమిది సర్పంచులు ఎన్నికయ్యారు. ఇది ఆందోల్, జోగిపేట్ అనే రెండు పట్టణాల సమ్మేళనం. ఇది 2013లో నగర పంచాయతీగా ఏర్పడి, 2018లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.[4]
జనాభా గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 18,496 జనాభా ఉంది. దీని అధికార పరిధి 21.61 కి.మీ2 (8.34 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
2014 ఎన్నికలు
మార్చునగర పంచాయతీగా ఏర్పాటైన పిదప తొలిసారిగా 2014 మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 2014 మార్చి నాటికి ఈ నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. వార్డులలో ఎన్నికైన కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.
ఇతర వివరాలు
మార్చుసురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన 1930లో ఆంధ్ర మహాసభ మొదటి సదస్సు జోగిపేటలో జరిగింది.[5]
మూలాలు
మార్చు- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 2016-06-15. Retrieved 28 June 2016.
- ↑ "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 11 June 2016.
- ↑ "Andole-Jogipet is 74th revenue division in Telangana: Harish". Telangana Today. Retrieved 2021-03-14.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Mahesh, Koride (25 March 2018). "21 nagar panchayats now elevated as municipalities | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Sundarayya, Puccalapalli (1972). Telangana People's Struggle and Its Lessons (in ఇంగ్లీష్).