ఆందోల్ శాసనసభ నియోజకవర్గం
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో ఆందోల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
- టెక్‌మల్
- అల్లాదుర్గ్
- రేగోడ్
- రాయికోడ్
- ఆందోల్
- మున్‌పల్లి
ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యులుసవరించు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్ల తేడా 2004 దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ 24723 2009 దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ 2906 2014 బాబు మోహన్ తెలంగాణ రాష్ట్ర సమితి దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ 3291 2018 చంటి క్రాంతి కిరణ్ తెలంగాణ రాష్ట్ర సమితి దామోదర రాజనర్సింహ భారత జాతీయ కాంగ్రెస్ 16,465
2004 ఎన్నికలుసవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సి.దామోదర్ రాజనరసింహ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.బాబుమోహన్‌పై 24723 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. దామోదర్‌కు 67529 ఓట్లు రాగా, బాబూమోహన్‌కు 42806 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బాబూ మోహన్ మళ్ళీ పోటీ చేయగా[1] ప్రజారాజ్యం పార్టీ నుండి మల్యాల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర్ రాజనరసింహ, లోక్‌సత్తా పార్టీ తరఫున లక్షణరావు పోటీపడ్డారు.[2]