కొమ్మూరి వేణుగోపాలరావు

ప్రముఖ రచయిత

కొమ్మూరి వేణుగోపాలరావు (సెప్టెంబరు 4, 1935 - అక్టోబరు 31, 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. సుమారు 50 పైగా నవలలు రచించాడు. ఈయన పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు. బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఈయన "ఆంధ్రా శరత్"గా పిలవబడ్డాడు. ఈయన రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి ప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది. 1959 లో గోరింటాకు సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.

కొమ్మూరి వేణుగోపాలరావు
జననం
కొమ్మూరి వేణుగోపాలరావు

(1935-09-04)1935 సెప్టెంబరు 4
మరణం2004 అక్టోబరు 31(2004-10-31) (వయసు 0)
వృత్తిరచయిత

తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో ఆంధ్ర జ్యోతి వారపత్రికలో 1968 లో ధారావాహికగా ప్రచురించారు.

వేణుగోపాలరావు విజయవాడలో 1935 సెప్టెంబరు 4 వ తేదీన జన్మించాడు.

కొమ్మూరి సెక్స్ ఎడ్యుకేషన్ కలిగించడానికి సృష్టి రహస్యాలు (1980) అనే సినిమాను నిర్మించాడు.

ఈయన 2004 అక్టోబరు 31 తేదీన మరణించాడు.

రచనలు మార్చు

  • పిల్లదొంగ
  • పెంకుటిల్లు
  • చిన్నక్క
  • హౌస్ సర్జన్
  • హారతి
  • ఒకే పాటకు రెండు రాగాలు
  • ఈ దేశంలో ఒక భాగం
  • వ్యక్తిత్వం లేని మనిషి
  • ఒకే రక్తం ఒకే మనుషులు
  • వెన్నెల ఒణికింది

మూలాలు మార్చు