ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు వివాదం

ఆంధ్రా, ఒడిశా మధ్య భూసరిహద్దు వివాదం చాలా కాలంగా జరుగుతున్నది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఇక్కడ 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ, అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి.[1][2]

చరిత్ర

మార్చు

1942లో బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఇందులో ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు. 1953లో మద్రాసు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్న కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. ఒరిస్సా సరిహద్దును దాటి ఆంధ్రా సరిహద్దులోకి సుమారు 600 మీటర్లు ఒరిస్సా ఆక్రమించుకున్నారు.డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్ పంచాయతీకి చెందిన డెక్కపాడు, బొడ్ల మామిడి, నెట్ట మామిడి, కొల్లాపుట్ గ్రామాలకు చెందిన భూములు ఒడిషా ప్రస్తుతం అక్రమించిన పరిథిలోకి వెళ్లిపోతుంది. సుమారు ఐదు వందల ఎకరాల సాగు భూమి, పోడుభూములు పూర్తిగా ఒడిషా లోకి వెళ్లిపోతాయని అక్కడ రైతులు వాపోతున్నారు. దీంతో ఆదీవాసిలు తమ హక్కులను కాపాడుకునేందుకు 1968 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సూచించింది. అంతవరకూ ఎవరూ ఆక్రమణలకు పాల్పడవద్దని 2006లో ఆదేశాలు ఇచ్చింది.[3][4]

ఆంధ్రప్రదేశ్ వాదన

మార్చు

కొఠియా గ్రామస్తులంతా ఆంధ్రాకిచెందినవారేననడానికి తగిన ఆధారాలు ఉన్నాయి.మద్రాస్‌ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భౌగోళిక విస్తీర్ణం, సరిహద్దులపై ఇచ్చిన వివరణలోనూ ఈ గ్రామాల ప్రస్తావన ఉంది. సాలూరు మండలంలోని కొటియా సహా 21 గ్రామాలు ఏపీవేనంటూ ఆంధ్రప్రదేశ్‌ గజిట్‌లో పొందుపరిచారు. ఇందుకు ఆధారంగా గిల్‌.బి సర్వే నివేదికతో పాటు అనేక అంశాలను పొందుపరిచారు.దీనిపై ఒడిసా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులతో పాటు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలు ఉన్నాయి.

ఒరిస్సా వాదన

మార్చు

కొటియా భౌగోళికంగా ఒడిశాకే చెందుతుంది. కోరాపూట్ జిల్లాలో భాగమే కొటియా గ్రామాలు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి హక్కులూ లేవు. 1951లోనే ఒడిశా ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించింది. ఇప్పటీకే కొటియా గ్రామాల్లో చాలా అభివృధ్ది చేశాం.

కొటియా గ్రామాల అభివృద్ధి

మార్చు

ఏపీ, ఒడిశా రెండు రాష్ట్రాలు కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాయి. అయితే ఏపీ కంటే ఒడిశాయే ముందంజలో ఉంది.కొటియా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.180 కోట్లను మంజూరు చేసింది. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే గిరిజన ఉత్సవాలకు, పండుగలకు భారీగా నజరానాలు అందిస్తోంది.కొటియాలోని అన్ని గ్రామాలను కలుపుతూ రహదారులు నిర్మించింది. రహదారి విస్తరణ పనులు చేపట్టింది. ఆసుపత్రి, పోలీస్‌ స్టేషన్, పాఠశాల, ఆశ్రమ పాఠశాల ఇలా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

ఖనిజ సంపద

మార్చు

ఈ కొఠియా గ్రామాల కోసం రెండు ప్రభుత్వాలు పోరాడటానికి కారణం ఉంది. కొఠియా గ్రామాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. మాంగనీస్‌ బాక్సైట్‌ తదితర గనులున్నాయి. కారణం ఏదైనా రెండురాష్ట్రాల ప్రభుత్వాలు కొఠియా గ్రామాలు తమవంటే తమవని వాదిస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. "AP News: కొనసా... గుతున్న కొటియా వివాదం: మరోసారి ఉద్రిక్తత". EENADU. Retrieved 2021-11-07.
  2. "ఆంధ్రా, ఒడిశా భూసరిహద్దు వివాదం". The Indian Express. 2021-09-13. Retrieved 2021-11-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి?". BBC News తెలుగు. Retrieved 2021-10-29.
  4. "ఒడిసాతో చర్చలు జరపండి". andhrajyothy. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-29.