ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎ.ఎం.ఆర్.సి) , విజయవాడ మెట్రో, విశాఖపట్నం మెట్రో నిర్వహణకు ఉద్దేశించి ప్రారంభించిన ప్రభుత్వ-పబ్లిక్ సెక్టార్ సంస్థ.[1] విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్.పి.వి) గా మొదట దానిని ఎ.ఎం.ఆర్.సిలో చేర్చారు, తర్వాత విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా ఈ జాబితాలో చేర్చారు.[2] ఇది మొదట వి.జి.టి.యం ఉడాలో ఒక మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం వలె ప్రతిపాదించబడింది, తర్వాత దీనిని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ లోకి మార్చారు.[3]
రకం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
---|---|
పరిశ్రమ | ప్రజా రవాణా |
పూర్వీకులు | 29-10-2015 |
స్థాపన | 29 అక్టోబరు 2015 విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ప్రధాన కార్యాలయం | విజయవాడ, అమరావతి , భారతదేశం |
కీలక వ్యక్తులు | ఆర్. కరికాల్ వలవెన్ (చైర్మాన్) ఎన్.పి. రామకృష్నా రెడ్డి (మ్యానేజింగ్ డైరెక్టరు) |
సేవలు | విజయవాడ మెట్రో, విశాఖపట్నం మెట్రో |
యజమాని | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
చరిత్ర
మార్చు2015 అక్టోబరు 29 న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ను మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా ఎన్.పి. రామకృష్ణ రెడ్డితో ప్రారంభించారు . మొదటి ఈ ప్రాజెక్టును డి.ఎం.ఆర్.సి ఒక మీడియం మెట్రో రైలు ప్రాజెక్టుగా రూపకల్పన చేసింది, కాని కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఇది భారత ప్రభుత్వంచే తిరస్కరించబడింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైట్ మెట్రో రైలును ఎంపిక చేసింది, [4] దీనిని మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్న ఇ.శ్రీధరన్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని నగరమైన అమరావతి యొక్క అవసరాలను ఇది తీర్చలేదని ఆయన అన్నరు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం లేక ప్రతిపాదనను మార్చలేదు. ఈ కారణంగా ఆయన విధుల నుండి తప్పుకున్నారు, అంతేకాక ఎ.ఎం.ఆర్.సి, డి.ఎం.ఆర్.సి మధ్య ఒప్పందం రద్దయింది.[5] కొందరు కొరియా, మలేషియా కంపెనీల ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ.ఎం.ఆర్.సి ను ఆదేశించింది.[6]
ప్రాజెక్టులు
మార్చువిజయవాడ మెట్రో
మార్చువిజయవాడ మెట్రో రెండు కారిడార్లుగా ప్రతిపాదించారు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు 13.3 కిమీ, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు 12.8 కిమీ పొడవు. ఈ కారిడార్లలో 25 స్టేషన్లు ఉన్నాయి[7] బస్టాండ్, పెనమలూరు మధ్య కారిడార్ కోసం ₹ 831 కోట్ల (US $ 120 మిలియన్), బస్టాండ్ నుండి నిడమానూరు కారిడార్ కోసం ₹ 969 కోట్ల (US $ 130 మిలియన్) వెచ్చించారు.[8]
విశాఖపట్నం మెట్రో
మార్చుదీనిని 42 కిలోమీటర్ల పొడవైన కారిడార్లతో ప్రతిపాదించారు, 31 కిలోమీటర్ల పొడవుతో గాజువాక నుండి కొమ్మాడి వరకు మొదటిది, గురుద్వార్ నుండి 5 కిలోమీటర్ల ఓల్డ్ పోస్ట్ ఆఫీసు వరకు రెండవది, మూడవది తడిచెట్లపాలెంనుండి చిన్న వాల్తేరు వరకు 7 కిమీ.[9] ఈ ప్రాజక్టు వ్యయం ₹8,000 crore₹8,000 crore (US$1.0 billion)[10]గా అంచనా.
మూలాలు
మార్చు- ↑ "G.O.MS.No. 141" (PDF). MUNICIPAL ADMINISTRATION & URBAN DEVELOPMENT (H2) DEPARTMENT. 13 August 2014. Archived from the original (PDF) on 13 జూలై 2019. Retrieved 12 నవంబరు 2018.
- ↑ "AMRC issues RfP to 5 bidders for Vizag metro rail project - Times of India". The Times of India. Retrieved 11 November 2018.
- ↑ "Andhra Pradesh to replace VGTM-UDA with CRDA - Times of India". The Times of India. Retrieved 11 November 2018.
- ↑ "Vijayawada Metro: Andhra picks Light Metro Rail for Amaravati, puts project on fast track - The Financial Express". www.financialexpress.com. Retrieved 2018-11-11.
- ↑ "Fresh plea made to Centre for Vizag, Vijayawada metro rail". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-01-14. Retrieved 2018-11-11.
- ↑ "Where do Vizag and Vijayawada metro projects stand? AMRC MD tells TNM". The News Minute. 2017-11-26. Retrieved 2018-11-11.
- ↑ "Project Profile - Amaravati Metro". Amaravati Metro (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-11-11. Retrieved 2018-11-11.
- ↑ "Vijayawada Metro Rail to cost Rs. 288 crore per km". Vijayawada. 17 March 2015. Retrieved 11 November 2018.
- ↑ "DMRC prepares report on Vizag Metro rail". Deccan Chronicle. Retrieved 11 November 2018.
- ↑ "Rs 8,000 crore light metro rail project in Visakhapatnam". The New Indian Express. Retrieved 2018-11-11.