పెనమలూరు

ఆంధ్రప్రదేశ్, విజయవాడ నగరప్రాంతం

పెనమలూరు విజయవాడ నగరంలో ఒక ముఖ్య ప్రాంతం.ఇది విజయవాడ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, పెనమలూరు మండలంలో ఉంది. ఇది పెనమలూరు మండలానికి ప్రధాన కేంద్రం. పెనమలూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ నగరలోని ప్రాంతం. ఇది సముద్రమట్టానికి 19 మీ.ఎత్తులో ఉంది.

పెనమలూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెనమలూరు పంచాయితీ కార్యాలయము
పెనమలూరు పంచాయితీ కార్యాలయము
పెనమలూరు పంచాయితీ కార్యాలయము
పెనమలూరు is located in Andhra Pradesh
పెనమలూరు
పెనమలూరు
అక్షాంశరేఖాంశాలు: 16°27′45″N 80°42′34″E / 16.4625085°N 80.7094717°E / 16.4625085; 80.7094717
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ బాలాజీ నాయక్
జనాభా (2001)
 - మొత్తం 11,645
 - పురుషుల సంఖ్య 5,771
 - స్త్రీల సంఖ్య 5,874
 - గృహాల సంఖ్య 2,964
పిన్ కోడ్ 521139
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ చరిత్ర

మార్చు

మెట్రోపాలిటన్ ప్రాంతం

మార్చు

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[1]

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

గ్రామం పినమల్లేశ్వరుడు ద్వారా దాని పేరు వచ్చింది, గతంలో మథబ్ కా పెనమలూరు అని పిలుస్తారు.

పెనమలూరు నియోజకవర్గంలో మండలాలు

మార్చు

1. పెనమలూరు 2.కంకిపాడు 3విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు మొత్తం మూడు మండలాలున్నాయి.

సమీప గ్రామాలు

మార్చు

మంగళగిరి, తెనాలి, గుడివాడ

ప్రధాన గ్రామీణ రహదారులు

మార్చు

విద్యా సౌకర్యాలు

మార్చు

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[2][3] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.

  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

మౌలిక వసతులు

మార్చు
 
పశువుల ఆసుపత్రి, పెనమలూరు

ఆసుపత్రులు, వైద్యశాలలు

మార్చు

శ్రీ రామా హాస్పిటల్ యోగ ‍‍, ప్రకృతి చికిత్సాలయం,

బ్యాంకులు

మార్చు

సిండికేటు బ్యాంకు:- ఈ గ్రామంలో సిండికేటు బ్యాంకు శాఖను, 2014, డిసెంబరు-17వ తేదీనాడు ప్రారంభించారు. ఇక్కడ ఖాతాదారులకు ఆధునిక సాంకేతిక పరిఙానంతోకూడిన సేవలను అందించెదరు.

కార్యాలయాలు, ఇతర ఆఫీసులు

మార్చు
  • ఎమ్మర్వో కార్యాలయము, పెనమలూరు.
  • ఎమ్డీవో కార్యాలయము, పెనమలూరు.
  • పెనమలూరు వ్యవసాయ, మత్స్యశాఖ కార్యాలయాలున్నాయి.
  • పెనమలూరు చేపలకుండీల సెంటరులో మత్స పరిశోధన కేంద్రం ఉంది.
  • ఇందిరక్రాంతి పథకం కార్యాలయం, పెనమలూరు.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

గోగులమ్మ చెరువు.

గ్రామ పంచాయతీ

మార్చు
 
ఎం ఆర్ ఓ కార్యాలయం, పెనమలూరు

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో బర్మావత్ బాలాజీ నాయక్ సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా అర్వపల్లి చంటి ఎన్నికైనాడు.

 
శ్రీ రామంజనేయ స్వామి దేవస్థానం, పెనమలూరు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.

  • శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పెనమలూరులోని ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2014, జూన్-16 నుండి 19 వరకు నిర్వహించారు. 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఆ రోజున విష్వక్సేన ఆరాధన, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, తీర్ధగోష్ఠి తదితర పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు.17వ తేదీ ఉదయం, ధ్వజారోహణ, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం,18వ తేదీన హోమపూజలు 19వ తేదీన వసంతోత్సవం నిర్వహించారు
  • శ్రీ గంగానమ్మ ఆలయం:- ఈ పురాతన ఆలయం, పెనమలూరులోని గోగులమ్మ చెరువు ప్రక్కనే ఉంది.

ప్రధాన వృత్తులు

మార్చు
 
పాల కేంద్రం, పెనమలూరు

పరిశ్రమలు

మార్చు

హిందూస్థాన్‌ లివర్‌, సిప్లా ఇండియా, ఎల్‌జీ, రాన్‌బాక్సీ, బ్రూక్‌బ్రాండ్‌, గోద్రెజ్‌ కంపెనీల కార్యాలయాలు, గోదాములు ఉన్నాయి. వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు
  • రచయిత, టీవీ నటుడు పరిటాల ఓంకార్
  • సినీనటుడు కోట శ్రీనివాసరావు పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.
  • మండవ రిషిత:- పెనమలూరు గ్రామానికి చెందిన మండవ కోటేశ్వరరావు, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య రాజ్యలక్ష్మి గృహిణి. వీరు మధ్య తరగతి కుటుంబీకులు. ఈ దంపతుల కుమార్తె రిషిత, సంగారెడ్డిలోని ఎం.ఎన్.ఆర్.వైద్యకళాశాలలో చదివి ఎం.బి.బి.ఎస్.పూర్తిచేసింది. ఈమె విలువిద్యలో సవ్యసాచి. గురిచూసి బాణం వదిలితే లక్ష్యాన్ని ఛేదించినట్లే. విల్లు ఎక్కుపెడితే, పతకం ఆమె చేతిలో పడినట్లే. పెనమలూరు నుండి అంతర్జాతీయస్థాయిలో ఆర్చరీలో విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె విలువిద్యలోనేగాక అటు ఉన్నత విద్యలోగూడా రాణించి, ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసింది.
  • వెంకటేష్ కిలారు .(తెలుగుచలనచిత్ర రచయిత) I శ్రీ కిలారు సుబ్బారావు ,భవాని ల కుమారుడు. . వ్యవసాయ రంగానికి చెందిన కుటుంబం నుండి వచ్చి double M.A చదివి ఈనాడు లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభించి,క్రమంగా సినీ రంగంలో ప్రవేశించి ,ఎన్నోచిత్రాలకు స్క్రిప్ట్ రచయితగా కథ,స్క్రీన్ ప్లే మాటలు రాస్తున్నారు, 2022లో వీరు కథ అందించిన "పులి మేక" webseries zee 5 OTT లో ప్రసారం అయి 200 millian minuits reviews సాధించి zee5 లో రికార్డు సృష్టించింది.భారతీయ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా TANA (telugu association of north America) వారు సన్మానించి అవార్డుతో గౌరవించారు. తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఏర్పడి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా యువ రచయిత ప్రతిభ పురస్కారం అవార్డ్ ఇచ్చి సత్కరించింది .

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu. Retrieved 27 March 2017.
  2. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 7 November 2016. Retrieved 7 November 2016.
  3. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పెనమలూరు&oldid=4341557" నుండి వెలికితీశారు