ఆకాశరామన్న (1965 సినిమా)
కాంతారావు కథానాయకుడిగా నటించిన సినిమా ఆకాశరామన్న.1965 జులై 8 విడుదల .దర్శకుడు జి. విశ్వనాథం. ఈ చిత్రంలో రామకృష్ణ , రాజశ్రీ, వాణీశ్రీ, ఎల్ విజయలక్ష్మీ ముఖ్య తారాగణం.సంగీతం., ఎస్. పి. కోదండపాణి అందించారు.
ఆకాశ రామన్న (1965 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.విశ్వనాథం |
నిర్మాణం | భావనారాయణ |
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి, జి.రామకృష్ణ, రాజశ్రీ, ఎల్. విజయలక్ష్మి, రాజనాల, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, పేకేటి శివరాం, వాణిశ్రీ, రాజబాబు |
సంగీతం | ఎస్.పి.కోదండపాణి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, వాణి జయరాం |
నిర్మాణ సంస్థ | గౌరి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథా విషయాలు
మార్చురామకృష్ణ హీరోగా మొదలై క్రమంగా కాంతారావు పాత్ర పెంచబడింది. నవరాత్రి సినిమాలోని తమిళ కథానాయకుడు (శివాజీ గణేశన్)స్ఫూర్తితో కాంతారావు అనేక ఆహార్యాలతో నటించారు. సాహెబు, పురోహితుడు, ముసలమ్మ వగైరా మారువేషాలతో సరదాగే సాగే ఈ చిత్రం కాంతారావుకు మంచిపేరు తెచ్చి విజయవంతమైంది. భావనారాయణ ఈ చిత్ర నిర్మాత.
పాటలు
మార్చు- ఎగరాలి ఎగరాలి రామదండు బావుటా అందరిదీ - ఎస్. జానకి, పిఠాపురం బృందం, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
- ఓ చిన్నవాడా ఒక్కమాట ఉన్నాను చూడు నీ ఎదుట - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ , రచన: వీటూరి
- జలగలా పురుషుల జవసత్వముల (పద్యం) - మాధవపెద్ది
- తేనెపూసిన కత్తి నీదేశభక్తి (పద్యం) - ?
- తళుకు బెళుకులు చూపించి (పద్యం) - ?
- దాగవులే దాగవులే దాగవులే ఉబికి ఉబికి పొంగే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: వీటూరి
- నవ్వు నవ్వు నవ్వు నవ్వే బ్రతుకున వరము కన్ను కన్ను కన్నులు - ఎస్. జానకి. రచన :వీటూరి
- మంచిగా నిధిని కాచేయదలచిన ( పద్యం ) - ఎస్. జానకి
- ముత్యమంటి చిన్నదాని మొగలిరేకువన్నెదాని మొగమాటం - ఎస్. జానకి, రచన: వీటూరి
- డుంకు డుంకు ఓ పిల్లవే డుంకవే ఇల్లాలా - మాధవపెద్ది, ఎస్. జానకి, రచన: వీటూరి
- చల్ల చల్లగా సోకింది మెల్ల మెల్లగా తాకింది - ఎస్. జానకి, రచన: వీటూరి
- నీకోసం ఏమైనా ఐపోనీ నా నాట్యం , ఎస్.జానకి, రచన: వీటూరి.
వనరులు
మార్చు- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
- ఆన్లైన్లో చూడండి Archived 2024-01-26 at the Wayback Machine - చిత్ర ఆర్కైవ్ Archived 2024-01-26 at the Wayback Machine