వాణీ జయరామ్
వాణీ జయరాం (1945 నవంబరు 30 - 2023 ఫిబ్రవరి 4) దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.[1] ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలు కొనసాగించింది. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు పైగా నేపధ్యగానం చేసింది. అదేకాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడింది. [1] 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.[2]
వాణీ జయరామ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | వెల్లూర్, తమిళనాడు | 1945 నవంబరు 30
మరణం | 2023 ఫిబ్రవరి 4 చెన్నై | (వయసు 77)
సంగీత శైలి | నేపథ్యగానం |
వృత్తి | గాయని |
వాయిద్యాలు | గానం |
క్రియాశీల కాలం | 1971 - 2023 |
జీవిత భాగస్వామి | జయరాం (మ.2018) |
వెబ్‌సైటు | Official website |
జీవిత విశేషాలు
మార్చువాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రికగా జన్మించింది. వారి తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది.
ఆమె కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నది.
వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకుంది.
2018లో ఆమె భర్త జయరాం మృతి చెందారు. అప్పటినుంచి చెన్నైలోని హడోవ్స్ రోడ్ లోని తమ నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు.
తెలుగు సినిమాలు
మార్చు- స్వాతికిరణం (1992)
- పెళ్ళి పుస్తకం (1991)
- టైగర్ శివ (1990)
- బావా మరదల సవాళ్ (1988)
- అగ్ని నక్షత్రం (1988)
- ఇల్లు ఇల్లాలు పిల్లలు (1988)
- స్వర్ణకమలం (1988)
- ఆరాధన (1987)
- శృతిలయలు (1987)
- శ్రీ శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్యం (1986)
- వసంతసేన (1985)
- ప్రతిజ్ఞ (1983)
- ఆక్రోశం (1982)
- పార్వతి (1981)
- సీతాకోకచిలుక (1981)
- సర్కస్ రాముడు (1980)
- శుభోదయం (1980)
- లక్ష్మీ పూజ (1979)
- ఇది కథకాదు (1979)
- మీరా (1979)
- ఆవేశం (1979)
- గుప్పెడు మనసు (1979)
- శంకరాభరణం (1979)
- కరుణామయుడు (1978)
- చిరంజీవి రాంబాబు (1978)
- మరోచరిత్ర (1978)
- ఐనా (1977)
- అంతులేని కథ (1976)
- సీతా కళ్యాణం (1976)
- రాగం (1975)
- చెలియా (1973)
- స్వప్నం (1973)
హిట్ సాంగ్స్
మార్చు- ఎన్నెన్నో జన్మలబంధం నీది నాదీ (పూజ)
- మానస సంచరరే (శంకరాభరణం)[3]
- సాగర సంగమమే (సీతాకోకచిలుక)
- శ్రీసూర్య నారాయణా మేలుకో (మంగమ్మగారి మనవడు)
- ఇన్నిరాసుల యునికి (శృతిలయలు)
- అందెల రవమిది (స్వర్ణకమలం)
- ఒక బృందావనం (ఘర్షణ)
- ఆనతినీయరా హరా (స్వాతికిరణం)[4]
మరణం
మార్చు78 సంవత్సరాల వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో 2023 ఫిబ్రవరి 4న కన్నుమూశారు.[5] అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన వాణీ జయరాం మృతిపై పోలీసు కేసు నమోదు చేసారు. ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా 2023 ఫిబ్రవరి 5న తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తిచేసారు. ఆమె భౌతికకాయానికి వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కడసారి నివాళులు అర్పించారు.[6]
వాణీజయరాంకు 2022వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె తుదిశ్వాస విడిచారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Lending 'Vani' to patriotism". The Hindu. 12 June 2006. Retrieved 2016-11-23.
- ↑ Namasthe Telangana (5 February 2023). "ఎన్నెన్నో జన్మల బంధం." Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Andhra Jyothy (5 February 2023). "అందెల రవమిది పదములదా...!". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Andhra Jyothy (5 February 2023). "ఆనతి ఆయెనా హరా!". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ "vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత". web.archive.org. 2023-02-04. Archived from the original on 2023-02-04. Retrieved 2023-02-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "అధికారిక లాంఛనాలతో మధుర గాయని వాణీజయరాం అంత్యక్రియలు, famous-singer-vani-jayaram-was-cremated-with-state-honors". web.archive.org. 2023-02-05. Archived from the original on 2023-02-05. Retrieved 2023-02-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)