ఆకుల భూమయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు. ఆయన 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశాడు.

ఆకుల భూమయ్య
జననం1948
మరణం2013
ఇతర పేర్లుభూమన్న
వృత్తిఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు
పిల్లలుచారుమతి, కవిత
తల్లిదండ్రులువెంకటయ్య, రత్నమ్మల

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆకుల భూమయ్య 1948లో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, జూలపల్లి మండలం, కాచాపూర్ గ్రామంలో వెంకటయ్య, రత్నమ్మల దంపతులకు జన్మించాడు. ఆయన 6వ తరగతి వరకు కాచాపూర్ గ్రామంలో, పెద్దపల్లిలోని ఓల్డ్ హెచ్‌ఎస్‌సీలో పదవ తరగతి, కరీంనగర్‌లో పీయూసీ, జమ్మికుంటలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

మార్చు

ఆకుల భూమయ్య బీఈడీ పూర్తి చేసిన అనంతరం 1973లో రామగుండం మండలం గుడిపెల్లి జయ్యారంలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి,తరువాత రాఘవాపూర్, పాత రామగుండం, వెన్నంపల్లి, కరీంనగర్ దగ్గరి కొత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే ఉద్యమాలలో కీలకంగా పనిచేస్తున్నాడని, ఆయనను అప్పటి టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీకి బదిలీ చేసింది.

ఉద్యమ జీవితం

మార్చు

ఆకుల భూమయ్య బీఈడీ చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో, తపాలాపూర్ జంట హత్యలు, జగిత్యాల జైత్రయాత్రలో కీలకంగా పని చేశాడు. భూమయ్య ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్)ను స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏపీటీఎఫ్ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ఆ సంఘానికి 1992 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.విప్లవ భావజాలం కలిగిన ఆయనను మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్‌వార్) సానుభూతిపరులుగా గుర్తించడంతో ఆయన రహస్యంగా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో భూమయ్యను అరెస్టు చేశారు.

ఆకుల భూమయ్య పై పోలీసుల నిఘా కొనసాగించడంతో ఏపీటీఎఫ్ లో ఏర్పడ్డ విభేదాల కారణంగా (డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్) డీటీఎఫ్‌ ను స్థాపించి అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన తెలంగాణ ప్రజల ప్రాంతీయ సమస్యలతోపాటు ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశాడు. తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాసభల పేరిట సదస్సులు నిర్వహి స్తూ ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై 1994 నుంచి తీవ్ర నిర్బం ధం మధ్య ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యలపై ఉద్యమించాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా 2001లో తెలంగాణ జనసభను స్థాపించి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.

తెలంగాణ జనసభను పోలీసులు పీపుల్స్‌వార్ పార్టీ లీగల్ సంఘంగా భావించి ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన జైల్లో ఉంటూ కూడా తెలంగాణ వాదాన్ని వినిపించి తెలంగాణ ఉద్యమానికి అంకితమయ్యాడు. జనసభపై పోలీసు నిర్బంధం పెరగడంతో గద్దర్ సారథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాఫ్రంట్‌కు అధ్యక్షుడిగా ఉంటూ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు మద్దతు పలికాడు. [1]

ఆకుల భూమయ్య 25 డిసెంబర్ 2013న బషీర్‌బాగ్ లో జరిగిన ‘ప్రజాస్వామిక తెలంగాణ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్ని ఇంటికి చేరుకునే సమయంలో రాత్రి హైదరాబాద్‌ నల్లకుంట, విద్యానగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Sakshi (27 December 2013). "అరుదైన వ్యక్తిత్వం... రాజీపడని తత్వం". Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.
  2. Sakshi (25 December 2013). "అనంతతీరాలకు ఆకుల భూమయ్య". Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.
  3. Deccan Chronicle (26 December 2013). "My father was killed, alleges Akula daughter" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.
  4. Sakshi (27 December 2013). "లాల్‌సలామ్.. భూమన్నా". Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.