బషీర్‌బాగ్
బషీర్‌బాగ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. నగరంలోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో ఒకటైన బషీర్‌బాగ్ వాణిజ్య, వ్యాపార కేంద్రంగా ఉంది. ఆబిడ్స్, కోటి, నాంపల్లి, హిమాయత్‌నగర్ వంటి ఇతర పెద్ద వాణిజ్య ప్రాంతాలకు సమీపంలో ఉన్న కారణంగా ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఇక్కడ ప్రసిద్ధ బషీర్‌బాగ్ ప్యాలెస్ ఉంది.[1] ఈ ప్రాంతం హుస్సేన్ సాగర్ సరస్సుకి దగ్గరగా ఉంది.
బషీర్‌బాగ్ | |
---|---|
సిటీ సెంటర్ | |
Coordinates: 17°23′59″N 78°28′36″E / 17.399782°N 78.476615°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
స్థాపన | 1880 |
Named for | నవాబ్ అస్మాన్ జా బహదూర్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500029 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
చరిత్ర
మార్చునవాబ్ అస్మాన్ జా బహదూర్ (ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా) పేరు మీదుగా ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అని పేరు వచ్చింది. ఇతను 1880 ప్రాంతంలో ఇక్కడ బషీర్‌బాగ్ ప్యాలెస్ ను కట్టించాడు.
వాణిజ్యప్రాంతం
మార్చుఇక్కడ పెద్ద సంఖ్యలో ఆభరణాల దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలలో అధిక సంఖ్యలో షాపింగ్ మాల్‌లు ఉన్నాయి. థియేటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయాకార్ భవన్ (ఆదాయ పన్ను కార్యాలయం), పోలీస్ కమీషనర్ కార్యాలయం, పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, వస్తు సేవల పన్ను కార్యాలయం, తెలంగాణ పర్యాటక రిజర్వేషన్ కార్యాలయం మొదలైన ప్రభుత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. బాబూ ఖాన్ ఎస్టేట్ (ఒకప్పుడు ఇది 14 అంతస్తులతో హైదరాబాద్‌లో ఎత్తైన భవనం), ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్ వంటి వాణిజ్య భవనాలు ఇక్కడ అనేక రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి.
విద్యారంగం
మార్చుఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన నిజాం కళాశాల, 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో బషీర్‌బాగ్ ప్రాంతంలో స్థాపించబడింది.
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. బషీర్‌బాగ్ సమీపంలో హైదరాబాదు రైల్వే స్టేషను ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి లాల్ బహదూర్ స్టేడియం, బాబుకాన్ ఎస్టేట్, పోలీస్ కంట్రోల్ రూమ్, పాత గాంధీ వైద్య కళాశాల, హైదరాబాద్ నర్సింగ్ హోమ్, మాధవరెడ్డి మెమోరియల్ ఫ్లైఓవర్, పోలీస్ కమీషనర్ కార్యాలయం, ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం వంటివి ఉన్నాయి.
క్రీడలు
మార్చుబషీర్బాగ్ ఒక స్పోర్ట్స్ హబ్ గా ఉంది. ఫుట్‌బాల్ అథ్లెటిక్స్ కోసం ఉపయోగించే లాల్ బభదూర్ స్టేడియం ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌ను భారత సైన్యానికి అప్పగించడం జరిగినందున దీనిని ఫతే మైదాన్ అని పిలిచేవారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఉపయోగించేవారు. ఇక్కడ బ్యాడ్మింటన్, టెన్నిస్ కోసం ఉపయోగించే ఇండోర్ స్టేడియం కూడా ఉంది. ఇండియన్ క్రికెల్ లీగ్ మ్యాచ్‌లతో ఇక్కడ క్రికెటక ఆడడం పునఃప్రారంభమయింది.
మఖ్య కార్యాలయాలు
మార్చు- లాల్ బహదూర్ స్టేడియం
- బాబూఖాన్ ఎస్టేట్
- పోలీస్ కంట్రోల్ రూమ్
- పాత గాంధీ వైద్య కళాశాల
- హైదరాబాద్ నర్సింగ్ హోమ్
- మాధవ రెడ్డి మెమోరియల్ ఫ్లై ఓవర్
- పోలీస్ కమీషనర్ కార్యాలయం
- ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం (ఆయ్కార్ భవన్)
చిత్రమాలిక
మార్చు-
బషీర్‌బాగ్ ప్రధాన మార్గం
-
బషీర్‌బాగ్ ప్యాలస్ (1880)
-
సర్ అస్మాన్ జా (1890)
-
బషీర్‌బాగ్ ప్యాలస్ లోని డ్రాయింగ్ రూం (1880)
మూలాలు
మార్చు- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 18 September 2018.