ఆజం జా

హైదరాబాద్ రాయల్

ఆజం జా, దామత్ వాలాషన్ సాహెబ్జాదా నవాబ్ సర్ మీర్ హిమాయత్ అలీ ఖాన్ సిద్ధికీ బహదూర్ బయాఫెండి (1907, ఫిబ్రవరి 22 - 1970, అక్టోబరు 9) హైదరాబాద్ ఏడవ (చివరి) నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII, సాహెబ్జాది ఆజం ఉన్నిసా బేగం (సాహెబ్జాదా మీర్ జహంగీర్ అలీ ఖాన్ సిద్ధిఖ్ కుమార్తె) ల మొదటి కుమారుడు.

మీర్ హిమాయత్ అలీ ఖాన్ సిద్ధికీ బహదూర్ బయాఫెండి
ఆజం (1937)
జననం(1907-02-22)1907 ఫిబ్రవరి 22
హైదరాబాదు, తెలంగాణ
మరణం1970 అక్టోబరు 7(1970-10-07) (వయసు 63)
హైదరాబాదు, తెలంగాణ
Spouseదుర్రు షెహ్వార్‌ (ఒట్టోమన్ సామ్రాజ్యం యువరాణి)
Issue
Names
సాహెబ్జాదా మీర్ హిమాయత్ అలీ ఖాన్ సిద్ధికీ ఆజం జా
Houseఅసఫ్ జాహీ రాజవంశం
తండ్రిమీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII
తల్లిసాహెబ్జాది ఆజం ఉన్నిసా బేగం[1]

జీవిత విశేషాలు మార్చు

1936లో ఇతనికి బేరార్ యువరాజు అనే బిరుదు లభించింది,[2] నిజాం భూభాగాన్ని బ్రిటిష్ వారికి శాశ్వతంగా లీజుకిచ్చి వారిచే నిర్వహించబడుతుంది.

ఆజం జా 1932, నవంబరు 12న నైస్‌లో హౌస్ ఆఫ్ ఒస్మాన్ (గతంలో ఒట్టోమన్ సామ్రాజ్యం), చివరి ఒట్టోమన్ ఖలీఫ్ అబ్దుల్మెసిడ్ II కుమార్తె అయిన యువరాణి దుర్రు షెహ్వార్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత, విడాకులు తీసుకున్నారు. ఏడవ నిజాం మరణంతో ఆజం జా పెద్ద కుమారుడు సాహెబ్జాదా మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్ధికీ ముకర్రం జాకు ఎనిమిదవ నిజాంగా బిరుదు బదిలీ చేయబడింది. కాగా, ఆజం జాకు చిన్న కుమారుడు సాహెబ్జాదా మీర్ కరామత్ అలీ ఖాన్ సిద్ధికీ ముఫఖం జా కూడా ఉన్నాడు.

హుస్సేన్ సాగర్ సమీపంలోని బెల్లా విస్టా 10-acre (40,000 m2) ప్యాలెస్ లో నివసించాడు.

బిరుదులు మార్చు

  • 1907–1912: రెండవ వలీ అహద్ నవాబ్ మీర్ హిమాయత్ 'అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్
  • 1912–1934: వలీ అహద్ సాహెబ్జాదా నవాబ్ మీర్ హిమాయత్ 'అలీ ఖాన్ బహదూర్
  • 1934–1937: మేజర్ హిస్ హైనెస్ ఆజం జా, వాలాషన్ సాహెబ్జాదా నవాబ్ మీర్ హిమాయత్ 'అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్, బేరార్ యువరాజు
  • 1937–1942: జనరల్ హిస్ హైనెస్ ఆజం జా, వాలాషన్ సాహెబ్జాదా నవాబ్ మీర్ హిమాయత్ 'అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్, ప్రిన్స్ ఆఫ్ బేరార్
  • 1942–1947: జనరల్ హిస్ హైనెస్ ఆజం జా, వాలాషన్ సాహెబ్జాదా నవాబ్ మీర్ సర్ హిమాయత్ 'అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్, ప్రిన్స్ ఆఫ్ బేరార్, నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్
  • 1947–1970: జనరల్ హిస్ హైనెస్ ఆజం జా, వాలాషన్ సాహెబ్జాదా నవాబ్ మీర్ సర్ హిమాయత్ 'అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్, ప్రిన్స్ ఆఫ్ బెరార్, నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్[3]

ప్రముఖ దాతృత్వం మార్చు

 
అసఫ్ జా కుమారుడు యువరాజు ఆజం జా మసీదుకు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

లండన్ సెంట్రల్ మసీదుగా పిలవబడుతున్న నిజామియా మసీదుకు ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII నిధులు సమకూర్చాడు. అతని పెద్ద కుమారుడు హిజ్ హైనెస్ ప్రిన్స్ ఆజం జా చేత 1937, జూన్ 4 శుక్రవారం రోజున మసీదు శంకుస్థాపన వేయబడింది.[4][5]

గౌరవాలు, వారసత్వం మార్చు

  • కింగ్ జార్జ్ V సిల్వర్ జూబ్లీ మెడల్ - 1935
  • కింగ్ జార్జ్ VI పట్టాభిషేక పతకం - 1937
  • నిజాం సిల్వర్ జూబ్లీ మెడల్ - 1937
  • ట్యూనిస్ విక్టరీ మెడల్ - 1942
  • నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (GBE) - 1943
  • డిఫెన్స్ మెడల్ - 1945
  • యుద్ధ పతకం 1939-1945 – 1945
  • హైదరాబాద్ యుద్ధ పతకం - 1945
  • (హైదరాబాద్) మెరిటోరియస్ సర్వీస్ మెడల్-1945
  • నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ - 1946

పేరుగల ప్రాంతాలు, కట్టడాలు మార్చు

మూలాలు మార్చు

  1. Hyderabad Archived 23 మార్చి 2009 at the Wayback Machine, Indian Princely States website, accessed 2023-08-09
  2. Haidar, Navina Najat; Sardar, Marika (13 April 2015). Sultans of Deccan India, 1500–1700: Opulence and Fantasy (in ఇంగ్లీష్). Metropolitan Museum of Art. p. 332. ISBN 978-0-300-21110-8.
  3. https://ia600301.us.archive.org/24/items/listofleadingoff030666mbp/listofleadingoff030666mbp.pdf
  4. "Laying of foundation stone of London Nizamia Mosque, June 1937". wokingmuslim.org.
  5. "Crescent obscured: Indian Muslims in Britain". twocircles.in. Archived from the original on 23 March 2012.
  6. Administrator. "A History behind Street Names of Hyderabad & Secunderabad". knowap.com. Archived from the original on 2018-06-19. Retrieved 2023-08-09.
  7. "Himayat Sagar Lake – Weekend Tourist Spot of Hyderabad". exploretelangana.com. Archived from the original on 19 June 2018. Retrieved 2023-08-09.
  8. Ahmed, Shelly (19 May 2020). "King of Fruits 'Mango' The Most Delicious And Sweetest!". Hyderabad News. Retrieved 2023-08-09. It is no wonder that the best varieties of mangoes from Indian Subcontinent bear royal names such as Jahangir and Himayuddin, Himayat (named after Mir Himayat Ali Khan Muazzam Jah Bahadur, eldest son of Nizam of Hyderabad Deccan, Nizam VII Mir Osman Ali Khan Bahadur).

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆజం_జా&oldid=3950909" నుండి వెలికితీశారు