గ్రీకు భాషలో ఆటో అనగా స్వయంగా, గ్రాఫ్ అంటే వ్రాయుట. దీనిని బట్టి స్వయంగా వ్రాసిన దానిని ఆటోగ్రాఫ్ అంటారు. ఇది ఒక సంతకం వంటిదే. ఆర్థిక పరమైన లావాదేవిల కొరకు దస్తావేజులపై స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని సంతకం అంటే, అభిమానుల కోరికపై ప్రముఖ వ్యక్తులు మంచి సందేశాన్ని అందిస్తూ స్వయంగా తన యొక్క పేరును వ్రాయడాన్ని ఆటోగ్రాఫ్ అంటారు. ప్రసిద్ధులైన వ్యక్తుల సంతకాలు ఆటోగ్రాఫ్‌లుగా సేకరిస్తారు. ఇది ఒక డాక్యుమెంట్ నిర్ధారణకు కాకుండా ఒక జ్ఞాపికగా భావిస్తారు. కొంతమందికి ప్రముఖుల ఆటోగ్రాఫ్ లను సేకరించడం ఒక హాబి, ఆటోగ్రాఫ్ ల సేకరణను ఫిలోగ్రఫీ (philography) అంటారు.

మార్టిన్ లూథర్ యొక్క ఆటోగ్రాఫ్..

ఆటోగ్రాఫ్ విషయాలలో అత్యంత జనాదరణ పొందిన వర్గములలో కొన్ని అధ్యక్షులు, సైనిక వ్యక్తులు, క్రీడలు, ప్రసిద్ధ సంస్కృతి, కళాకారులు, సామాజిక, మత నాయకులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములు, రచయితలు ఉన్నాయి.

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు