ఆడపడుచు (1967 సినిమా)

ఆడపడుచు 1967 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను కె.హేమాంభరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, చంద్రకళ, శోభన్ బాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.[1]

ఆడపడుచు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
చంద్రకళ,
పద్మనాభం,
శోభన్ బాబు,
గీతాంజలి
సంగీతం టి.చలపతిరావు
నేపథ్య గానం మాధవపెద్ది సత్యం,
టి.ఆర్. జయదేవ్,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల ,
బి. వసంత
నిర్మాణ సంస్థ సుభాషిని ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • నందమూరి తారక రామారావు,
  • చంద్రకళ,
  • రేలంగి వెంకటరామయ్య,
  • బి. పద్మనాభం
  • గీతంజలి రామకృష్ణ,
  • శోభన్ బాబు
  • వాణిశ్రీ
  • చదలవాడ కుటుంబరావు
  • ఎ.వి. సుబ్బారావు జూనియర్,
  • కోళ్ళ సత్యం,
  • కాశీనాథ తాత
  • రాధాకుమారి
  • ఝాన్సీ
  • కృష్ణకుమారి
  • హరనాథ్
  • నాగభూషణం

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె. హేమంభరధరరావు
  • స్టూడియో: సుభాషిని ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: కె.హేమభధర రావు;
  • రచయిత: ఎల్.వి. ప్రసాద్, కె.ప్రత్యగాత్మ;
  • ఛాయాగ్రాహకుడు: ఎం.జి. సింగ్, ఎం.సి. శేఖర్;
  • ఎడిటర్: బండి గోపాల్ రావు;
  • స్వరకర్త: టి. చలపతి రావు;
  • గీత రచయిత: దాశారథి అరుద్ర, సి. నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీ శ్రీ

ఈ చిత్రంలో చంద్రకళ ఇద్దరన్నయ్యలుగా ఎన్టీఆర్, శోభన్‌బాబు నటించారు. అన్నయ్యలకు చెల్లెలంటే ఎనలేని ప్రేమ, మురిపెం, గారాబంగా చూసుకొంటారు. అలాగే అన్నయ్యలంటే ఆ చెల్లెలికి అపురూపం. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర అద్భుతం. అద్వితీయం. పరిస్థితులు వికటించి తన అన్నయ్యలకి దూరమై అంధురాలిగా మారుతుంది చెల్లెలు. ఆమెలో అన్నయ్యల పట్ల వున్న అనురాగమే వారితో ఆమె తిరిగి కలుపుతుంది.

పాటలు

మార్చు
  1. గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, సుశీల, రచన: దాశరథి
  2. ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా - మాధవపెద్ది, బి. వసంత , రచన: సి నారాయణ రెడ్డి
  3. మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది - సుశీల బృందం , రచన: ఆరుద్ర
  4. రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల. రచన: కొసరాజు.
  5. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెలకన్నా చల్లదనం - పి.సుశీల ,రచన: దాశరథి
  6. ఇదేనా దయలేని లోకాన న్యాయం ఇదేనా - పి.సుశీల ,రచన: శ్రీరంగం శ్రీనివాసరావు.

దాశరథి రచన, టి.చలపతిరావు సంగీత మాధుర్యంలో పి.సుశీల పాడిన పాట "అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం". అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే ఈ పాట ఇప్పటికీ శ్రోతలను మురిపిస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Aadapaduchu (1967)". Indiancine.ma. Retrieved 2021-06-18.

వనరులు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు