గీతాంజలి (నటి)
గీతాంజలి (1947 - అక్టోబరు 31, 2019) 1960వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నటి. గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది.
గీతాంజలి | |
---|---|
జననం | మణి 1947 |
మరణం | అక్టోబరు 31, 2019 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1960's– 2019 |
జీవిత భాగస్వామి | రామకృష్ణ |
తల్లిదండ్రులు |
|
తొలి జీవితం
మార్చుగీతాంజలి 1947లో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివింది. మూడేళ్ల ప్రాయం నుండే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకోవటం ప్రారంభించింది. నాలుగేళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది.[2]
సినిమారంగం
మార్చుప్రధానంగా తెలుగు, తమిళంలో నటించిన గీతాంజలి కన్నడలో రెండు సినిమాలు, మలయాళంలో మూడు సినిమాలు, ఒక డజనుకు పైగా హిందీ సినిమాలలోనూ నటించింది. ఈమె అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో పనిచేస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని నామకరణం చేశారు.[3] ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది.
వివాహం
మార్చుసహనటుడు రామకృష్ణను వివాహమాడి చిత్రరంగం నుండి నిష్క్రమించింది. వివాహం కాకముందు రామకృష్ణ, గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు. గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరింది.
నటించిన సినిమాలు
మార్చు- రామ్ ఎన్ఆర్ఐ (2024)
- దటీజ్ మహాలక్ష్మీ (2020)
- శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట (2017)
- నేరము - శిక్ష (2009)
- ఆదివిష్ణు (2008)
- ఫూల్స్ (2003)
- పచ్చ తోరణం (1994)
- కాలం మారింది (1972)
- నిర్దోషి (1970)
- పెళ్లి కూతురు (1970)
- ఆదర్శ కుటుంబం (1969)
- మంచి మిత్రులు (1969)
- నిండు హృదయాలు (1969)
- దో కలియా (హిందీ)(1968)
- రణభేరి (1968)
- కాలచక్రం (1967)
- గూఢచారి 116 (1967)
- పూలరంగడు (1967)
- ప్రాణ మిత్రులు (1967)
- శ్రీకృష్ణావతారం (1967)
- శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967)
- లేత మనసులు (1966)
- దేవత (1965) - హేమ
- తోడూనీడా (1965)
- ఇల్లాలు (1965)
- బబ్రువాహన (1964)
- బొబ్బిలి యుద్ధం (1964)
- డాక్టర్ చక్రవర్తి (1964)
- మురళీకృష్ణ (1964)
- పారస్మణి (హిందీ) (1963)
- సీతారామ కళ్యాణం (1961) - సీత
- పేయింగ్ గెస్ట్ (1957) (బేబీ గీతాంజలి)
మరణం
మార్చుగీతాంజలి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, అక్టోబరు 31 ఉదయం 4 గంటలకు మరణించారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ కె., హరనాథ్. "వాళ్ళందరూ హాస్యనటులే!". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 8 ఫిబ్రవరి 2017. Retrieved 16 November 2016.
- ↑ తెలుగుసినిమా.కాం Archived 2010-10-26 at the Wayback Machineలో గీతాంజలి ఇంటర్వ్యూ
- ↑ హిందూ పత్రిక Archived 2008-02-25 at the Wayback Machine లో గీతాంజలి ఇంటర్వ్యూ
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/44864.html
- ↑ ఆంధ్రజ్యోతి, తాజావార్తలు (31 October 2019). "సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 31 అక్టోబరు 2019. Retrieved 31 October 2019.