ఆడారి ఆనంద్ కుమార్
ఆడారి ఆనంద్ కుమార్ విశాఖపట్నంకు చెందిన వాణిజ్యవేత్త, రాజకీయ నాయకుడు, సంఘసేవకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైక్రో చిన్న, మధ్యతరహా సంస్థల కార్పోరేషన్ (ఏపీఎంఎస్‌ఎండీసీ) చైర్మన్ గా, శ్రీ విజయ విశాఖ డెయిరీ చైర్మన్ గా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1]
జననం | 1976 |
---|---|
వృత్తి | విశాఖ డైరీ చైర్మన్ |
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ |
జీవిత భాగస్వామి | ఆడారి మాలతి |
తల్లిదండ్రులు |
|
వెబ్‌సైటు | http://www.visakhadairy.com/ |
విశాఖ డెయిరీ చైర్మన్‌గా
మార్చుశ్రీ విజయ విశాఖ డెయిరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2 లక్షల పాడి రైతులు, వారి కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రస్తుతం 8.5 లక్షల లీటర్లు రోజు వారి పాల సేకరణ, విక్రయాలు చేస్తోంది. 1500 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. సుదీర్ఘ కాలం ఆడారి తులసిరావు విశాఖ డెయిరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతని మరణానంతరం చైర్మన్‌గా ఆడారి ఆనంద్ కుమార్ 2023 జనవరిలో నియమితులయ్యాడు.[2] ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మేలైన పశు జాతి, పశుదాణా, పశు వైద్యాన్ని అందించి పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పాడు. పాడి రైతులకు ఆరోగ్య, సంక్షేమ పథకాల సేవలు అందిస్తూ విశాఖ డెయిరీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నాడు. ఎప్పటిలాగే వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాల అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని అనంద్ కుమార్ తెలిపాడు.[3]
రాజకీయ జీవితం
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆడారి ఆనంద్ కుమార్ సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కార్పోరేషన్ (ఏపీఎంఎస్‌ఎండీసీ) చైర్మన్ గా నియమించారు. ఈ కార్పొరేషన్ చైర్మన్ 2023 మార్చిలో బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా శ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ ఏపీఎంఎస్‌ఎండీసీ సంస్థ యొక్క అభివృద్ధికి, తద్వారా ఔత్సాహిక చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు అభివృద్ధికి నా తోడ్పాటునందిస్తూ, తద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని చెప్పారు.
అతను 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసాడు, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన భీశెట్టి వెంకట సత్యవతి చేతిలో 89,192 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై 2024 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.జి.వి.ఆర్. నాయుడు చేతిలో 35,184 ఓట్ల తేడాతో ఓడిపోయారు.[4]
మూలాలు
మార్చు- ↑ Bureau, The Hindu (2023-03-31). "Anand Kumar takes charge as MSME Dev. Corp. chairman". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-22.
- ↑ "విశాఖ: వైసీపీ నేతకు మరో కీలక పదవి.. సీఎం జగన్ డబుల్ ప్రమోషన్". Samayam Telugu. Retrieved 2024-04-22.
- ↑ "Sri Vijaya Visakha Milk Producers Company ltd.,". www.visakhadairy.com. Retrieved 2024-04-22.
- ↑ Election Commision of India (4 June 2024). "AP Assembly Election Results 2024 - Visakhapatnam West". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.