ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే మిస్సమ్మ (1955) సినిమా కోసం రచించబడిన పాట. దీనిని పింగళి నాగేంద్రరావు రచించగా, సాలూరు రాజేశ్వరరావు దర్శకత్వంలో ఏ.ఎం.రాజా మధురంగా గానం చేశారు.[1]
"ఆడువారి మాటలకు అర్థాలే వేరులే" | |
---|---|
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
సాహిత్యం | పింగళి నాగేంద్రరావు |
ప్రచురణ | 1955 |
భాష | తెలుగు |
రూపం | భావ గీతం |
నేపథ్యం
మార్చుమేరీ, భార్యాభర్తలుగా నటించడానికి సమ్మతించి ఒక పాఠశాలలో ఉపధ్యాయ దంపతులుగా చేరుతారు. అక్కడ పాఠశాల యజమానుల అమ్మాయి జమున హీరోను ప్రేమిస్తుంది. అలా సంగీతం నేర్చుకోడానికి వచ్చిన జమునతో హీరో మేరీని ఉద్దేశించి ఈ పాటను గానం చేస్తాడు.
పాటలో కొంతభాగం
మార్చు- అనుపల్లవి
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే
- పల్లవి
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్థాలే వేరులే....అర్థాలే వేరులే అర్థాలే వేరులే
- చరణం
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
సాహిత్యం
మార్చుతెలుగు సాహిత్యంలో ఈ పాట ఒక క్రొత్త ఒరవడిని సృష్టించి ఆడువారి మాటలకు అర్ధాలు వేరు అనేది ఒక సామెతలాగా ప్రజాదరణ పొందింది. ఆడువారు ఔనంటే కాదని, అలిగి తొలగితే దగ్గరకు రమ్మని, రమ్మన్నచో మద్యాదగా పొమ్మని అర్ధం చేసుకోవాలని కొత్త భాష్యం చెప్పారు పింగళి.
పాట రీమిక్స్
మార్చుపవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ (2001) సినిమాలో ఈ పాటను మళ్ళీ చిత్రీకరించారు.[2] దీనిలో పవన్ సరసన భూమిక నటించింది. భూమిక పాత్రలో కూడా ఇలాంటి మనస్తత్వ సూచనలు కనిపిస్తాయి.
2007 సినిమా
మార్చుఆడవారి మాటలకు అర్థాలే వేరులే,వెంకటేష్ కథానాయకుడుగా 2007లో విడుదలైనది. ఈ సినిమా పేరు ప్రఖ్యాత పాత సినిమా మిస్సమ్మలోని ఒక పాట చరణం నుండి తీసుకొన్నారు. 267 థియేటర్లలో (కర్ణాటకలో 15, ఒరిస్సాలో3, విదేశాలలో 21 హాళ్ళతో కలిపి) విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.[3] 200 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 21 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.[4]
మూలాలు
మార్చు- ↑ [1][permanent dead link]
- ↑ [2][permanent dead link]
- ↑ "::Welcome to Superhit". Archived from the original on 2007-09-28. Retrieved 2014-01-19.
- ↑ "CineGoer.com - Box-Office Records And Collections - 100-day Gross Collections Of AMAV". Archived from the original on 2007-08-24. Retrieved 2014-01-19.