ఏ.యం.రాజా
ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 - 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.[1]
అయిమల మన్మథరాజు రాజా | |
---|---|
![]() ఏ.యం.రాజా | |
జననం | జూలై 1, 1929 చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురం |
మరణం | 1989 |
ఇతర పేర్లు | ఏ.యం.రాజా |
వృత్తి | సంగీత దర్శకుడు |
ప్రసిద్ధి | నేపద్య గాయకుడు |
తండ్రి | మన్మధరాజు, |
తల్లి | లక్ష్మమ్మ |
ఏ.యం.రాజా 1929, జూలై 1 న చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.[2] మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురానికి తరలి వెళ్ళింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.
రాజా, గాయని జిక్కీని, ఎం.జీ.రామచంద్రన్ హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశాడు. జిక్కిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి, అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.
ఈయన కన్యాకుమారి జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా తిరునల్వేలి జిల్లాలోని వల్లియూరులో జరిగిన రైలు ప్రమాదంలో 1989, ఏప్రిల్ 9న మరణించాడు.
చిత్ర సమాహారంసవరించు
నేపథ్య గాయకునిగాసవరించు
- పెళ్ళి కానుక (1960)
- రాజనందిని (1958)
- అప్పు చేసి పప్పు కూడు (1958)
- అల్లావుద్దీన్ అద్భుతదీపం (1957)
- భాగ్యరేఖ (1957)
- ఎమ్.ఎల్.ఏ. (1957)
- పెంకి పెళ్ళాం (1956)
- మిస్సమ్మ (1955)
- విప్రనారాయణ (1954)
- అగ్గి రాముడు (1954)
- బంగారు పాప (1954)
- శ్రీ కాళహస్తి మహత్యం (1954)
- పక్కింటి అమ్మాయి (1953)
- ప్రేమలేఖలు (1953)
- సంక్రాంతి (1952)
సంగీత దర్శకునిగాసవరించు
- పెళ్ళి కానుక (1960)
- శోభ (1958)
నటునిగాసవరించు
మూలాలుసవరించు
- ఏ.యం.రాజా పేజీ.
- మోహిని: అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానం. ఆంధ్రప్రభ విశేష ప్రచురణ 1999.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-29. Retrieved 2009-04-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-17. Retrieved 2009-04-12.