ఆదర్శం (1952 సినిమా)

1952 తెలుగు సినిమా

ఆదర్శం 1952లో విడుదలైన తెలుగు సినిమా. సుభొదయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు హెచ్.వి.బాబు దర్శకత్వ వహించాడు. షావుకారు జానకి, సావిత్రి, రామశర్మ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు గుడిమెట్ల అశ్వథ్థామ సంగీతాన్నందించాడు.[1]

ఆదర్శం
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.వి.బాబు
తారాగణం సావిత్రి,
రామశర్మ,
కొంగర జగ్గయ్య,
రేవతి,
షావుకారు జానకి,
ఆత్రేయ
నిర్మాణ సంస్థ శుభోదయా పిక్చర్స్
భాష తెలుగు

భగవతారాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఒక ఆంధ్రుల కుటుంబం పంజాబులో బతుకుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి పాకిస్థాన్ విభజన జరిగి మత కలహాలు చెలరేగినవి. ఈ ఘర్షణలలో చాలా మంది పారిపోగా అన్నా చెల్లెలైన రూప్,కామిని మాత్రం ప్రాణాలు దక్కించుకొని పారిపోయారు. మధ్య మార్గంలో రూప్ తప్పిపోయాడు.

మద్రాసులో దగాకోరు ఐన దయానిథి రెప్యూజీ క్యాంపు (శరణార్థుల శిబిరం) స్థాపించి ధనం సంపాదించాలని ఎత్తువేసాడు. కమిటీ సభ్యులు అతన్ని తలదన్నారు. దయానిథి కొడుకు కుమార్ రెఫ్యూటీ సమస్య నాటకం రాసాడు. నాటకంకంపెనీ మానేజర్ కాశీ ఆ నాటకం ఆడటానికి నిర్ణయించాడు. దయానిథి ఆ అదృష్టం ఆ నాటకం తన శరణార్థుల శిబిర సహాయార్థం వేస్తామని ఒప్పుకున్నాడు కాశీ

నాటకం జరుగుతున్న సమయంలో కాశీ ప్రియురాలు సుందరి నాటకాన్ని నాశనం చేస్తుంది. కామిని ఎన్నో అగచాట్లు పడి మగ వేషంలో మద్రాసు వచ్చి చేరింది. నాటకం చూస్తుంది. మద్రాసులో వారు (స్టేజి ఆర్టిస్టులు) శరణార్థులను చూచి వారిని చూసి "మిడతల్లా వచ్చి పడితే మాము మాత్రం ఏమి చేయగలం, చావండి, చంపండి, మాకేం పోపోండి: అంటునారు. కామినికి ఆవేశం వచ్చింది అమాంతంగా స్టేజి మీదికి వెళ్ళింది. అక్కడ ఆవేశంలో పాడి పడిపోతుండగా కుమార్ ఆదుకున్నాడు. కనబడ్డ మగాడి మీదల్లా కన్నువేసే సుందరి కామినిని కూడా మగాడే అనుకుని కన్ను వేసింది. సుందరికి కుమార్ అంటే కొర కొర క్రొత్త కుర్రాణ్ణి హీరోగా వేసుకొని నాటకాలాడాలని ప్లాను వేసింది.

కామిని మగవేషంలో ఉన్న ఆడదని కనిపెట్టాడు కుమార్. కుమార్ కామిని గాథంతా విన్నాడు. కన్నీరు కార్చాడు. నిరాశలో పడ్డ కామినికి ఒక ఆశజ్యోతి కలిగించాడు. తన నాటకాల్లో వేషాలు వేయమని కోరాడు. కుమార్, మాటలు, ఆదర్శాలు, మచ్చలేని మనసు చూచి కామినికి కొంత ఉత్సాహం లభించింది. సరేనన్నది - కుమార్ నాటకాల్లో ప్రీతి చూపించడం దయానిధికి బాధ కలిగింది. నాటకాలు ఆడుకొని డబ్బు సంపాదించడం, నాటకాలకి ప్రెసిడెంటు నని పేరు వేయించుకోడం మాత్రం సహించుకోలేకపోయాడు కుమార్.

సుందరి తారాశశాంకం ఆడాలని, కుమార్ కూడదని వాదులాడుకుంటారు. అప్పుడే కుమార్ చీలిపోయేవాడే గాని "ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుకోండని" కాశీ ఆపాడు.

రెవ్యూజి క్యాంపు ఆధారంగా చేసుకుని దయానిథి భాకుమార్కెటు వ్యాపారము చేస్తున్నాడని తెలిపింది కుమార్ కి. నాటకానికి మంచి వస్తువు దొరికింది "దొంగబజారని" వ్రాసి ఆడించాడు.

కుమార్ ప్రతిభ వింటున్న సుందరీ మరీ మండిపోతుంది. నెల నెల డబ్బు తీసుకువెళ్ళుతున్నారే కాని ఒక్క నాటక ఆడలేదని దయానిథి ఆగ్రహిస్తున్నాడు. హీరో దొరక లేదంటుంది సుద్మరి. సరిగ్గా ఆ సమయానే సుందరిక్ కంటపడ్డాడు రూప్. అతనిని హీరోగా బుక్ చేసుకొని "తారాశశాంకం" ఆడింది. ప్రజలు గోలచేసి రాళ్ల వర్షం కురిపించి నాటకం ఆపేశారు. దాంతో దయానిధికి తల తిరిగింది. ఇప్పటికే రెవ్యూజి ఫండు నుండి 50000 రూపాయలు కాజేశాడు. దాంతో ఇది కూడా కమిటీ వాళ్లకు తెలిసి లెక్కలు అడుగుతున్నారు. భాగ్యమ్మ దగ్గర డబ్బు ఉంది. కానీ శశి పెళ్ళి చేస్తే గాని ఆమె చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. ఏం చేయాలి?

కుమార్ కామిని పేరు మార్చాడు. ఆమనందరు లతగానే ఎరుగుదురు. ఆంధ్రదేశమంతటాఅ తిరిగి వచ్చాడు. మద్రాసులో "అహల్య" నాటకం అభ్యుదయ భావాలతో ఆడారు.

ఈ నాటకం ద్వారా కుమార్ తన ఆదర్శాన్ని అందరితో పాటు కామినికి తెలియజేసాడు. రూప్ ఫోటో చూపించి కూమర్ కు కామిని మీద అనుమానం కలిగించింది సుందరి. వీళ్ళిద్దరూ అన్నా చెళ్ళెళ్లని ఎవ్వరికీ తెలీదు.

తాను పతిత. అతన్ని పెళ్లాడే అర్ఘత తనకు లేదు. ఈ అపవాదు భరిస్తే గానీ, కూమర్ వదలడు అంచేత కామిని కుమార్ ఎదుటే ఆ అపవాదును అంగీకరించింది. అన్నయ్యను ప్రియునిగా అంగీకరించింది ఇక తనకు జీవితంలో ఆశలేమీ లేవు.

పెళ్ళి శశికేమాత్రం ఇష్టంలేదు. రూప్ కాదన్నంత మాత్రాన భూషణ్ ఎలా పెళ్ళి చేసుకుంటింది? అయినా తన ప్రియుడిపై కలిగిన అనుమానం బాధించి కలవర పెట్టింది వెనకటి ఘట్టాలు మరీ బాధిస్తాయి. ప్రతి క్షణం "శసీ ఈ పెళ్ళి జరగాలి - జరిగి తీరాలి" అనే నాన్న మాటలు కలవరపెట్టాయి.

ఇటు శశి పెళ్ళి ఏర్పాట్లన్ని జరుగుతాయి. శశి తప్పక ఒప్పుకుంటుంది భూషణ్ నివ్వెరపోయాడు. కామిని ఇంక తాను బ్రితికి ప్రయోజనం ఏమీ లేదన్ భావించి, సముద్రం వైపు నడుస్తుంది...

శశికి భూషణ్ కు పెళ్ళీ జరుగుతుందా? కామిని కుమార్ లూ శశి రూప్ లు కలుసుకుంటారా? దయానిధి, సుందరి గతి ఏమవుతుంది ? అనేది ఈ సినిమాలో కథాంశం[2]

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: హెచ్.వి.బాబు
  • స్టుడియో: శుభోధయ పిక్చర్స్
  • సంగీతం: గుడిమెట్ల అశ్వథ్థామ
  • విడుదల తేదీ: 1952 డిసెంబరు 25

మూలాలు

మార్చు
  1. "Aadarsham (1952)". Indiancine.ma. Retrieved 2020-08-15.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-15.

బాహ్య లంకెలు

మార్చు