ఆదివారం ఆడవాళ్లకు సెలవు

తెలుగు సినిమా

ఆదివారం ఆడవాళ్ళకి సెలవు 2007 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస,తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు.

ఆదివారం ఆడవాళ్లకు సెలవు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా వన్నెంరెడ్డి
నిర్మాణం లీలా వన్నెంరెడ్డి
కథ దాసరి నారాయణరావు
తారాగణం శివాజీ,
సుహాసిని,
బ్రహ్మానందం,
వేణుమాధవ్,
కృష్ణభగవాన్‌,
కొండవలస,
కోవై సరళ,
అభినయశ్రీ,
గీతాసింగ్,
సురేఖావాణి,
శకుంతల
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ మంగ మూవీ మేకర్స్
భాష తెలుగు
దాసరి నారాయణరావు

బృందావన్ అపార్టుమెంట్‌లో పని మనిషి రాములమ్మ (కోవై సరళ). అదే అపార్టుమెంట్‌లో వేణు (వేణుమాధవ్), బాపినీడు (ధర్మవరపు), రాంబాబు (కృష్ణ భగవాన్), ఆనందరావు (శివాజీ) తదితరులు కాపురం ఉంటారు. ఇంట్లో పనీ, బయటిపనీ కూడా ఆడవాళ్లే చేయాలనుకునే మనస్తత్వం వారిలో కొందరిది. ఆనందరావు మాత్రం ఇంట్లో భార్యకు తోడుగా పనులు చేస్తుంటాడు. మగాళ్ల ఆలోచనా తీరు మార్చడానికి రాములమ్మ చెప్పిన బాటలో ఆడవాళ్లందరూ నడుస్తారు. వాళ్లు కోరినట్టు ఆదివారం ఆడవాళ్లకు సెలవు దొరికిందా? లేదా అన్నదే కథాంశం.

తారాగణం

మార్చు

బయటి లింకులు

మార్చు