సుహాసిని (జూనియర్)

సుహాసిని (జూనియర్) దక్షిణ భారత చలనచిత్ర నటి. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[1]

సుహాసిని
జననం
ఇతర పేర్లుసుహా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సినీరంగ ప్రస్థానం సవరించు

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది.[2] 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అటుతర్వాత తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో కూడా నటించింది.

టెలివిజన్ రంగం సవరించు

2010లో జెమినీ టీవీ లో వచ్చిన అపరంజి ధారావాహిక ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. అపరంజి (తెలుగు), అనుబంధాలు (తెలుగు), అష్టాచెమ్మ (తెలుగు), శివశంకరి (తమిళం), ఇద్దరు అమ్మాయిలు (తెలుగు) వంటి ధారావాహికలలో నటించింది.

నటించినవి సవరించు

సినిమాలు సవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2003 చంటిగాడు[1] సీతామహాలక్ష్మీ తెలుగు
2004 అదు కాయల్ విజి తమిళం సుహా
2005 మన్నిన్ మైందన్ అముద భైరవమూర్తి తమిళం సుహా
2006 సుందరానికి తొందరెక్కువా తెలుగు
2006 కోకిల సుబ్బలక్ష్మీ తెలుగు
2006 గుణ ప్రియా తెలుగు
2007 ఆదివారం ఆడవాళ్లకు సెలవు తెలుగు
2007 భూకైలాస్ బుజ్జి తెలుగు
2007 లక్ష్మీ కళ్యాణం పారిజాతం తెలుగు
2007 జ్ఞాబాగం వారుతే తమిళం సుహా
2008 హైవే సీత తెలుగు
2008 పాండురంగడు సత్యభామ తెలుగు
2008 బా బేగ చందమామ ప్రీతి కన్నడ
2008 తమాష చూద్దాం రండి తెలుగు
2009 స్వీట్ హార్ట్ లక్ష్మీ తెలుగు
2009 పున్నమి నాగు కాజల్ తెలుగు
2010 సందడి సుజి తెలుగు
2010 మౌనరాగం కావేరి తెలుగు
2011 ప్రేమ చరిత్ర అంజలి తెలుగు
2011 పిల్లైయార్ తెరు కాడైసి వీడు వల్లీ తమిళం
2011 శభరి భోజ్ పురి
2011 కుర్బాని భోజ్ పురి
2011 పాయిజన్[3] తెలుగు
2011 భలే మొగుడు భలే పెళ్ళామ్[3] తెలుగు
2012 శ్రీ వాసవి వైభవం వాసవి కన్యక తెలుగు
2013 అడ్డా[4][1] పూజ తెలుగు
2014 రఫ్[1] తెలుగు

టెలివిజన్ సవరించు

  • అపరంజి (తెలుగు)
  • అనుబంధాలు (తెలుగు)
  • అష్టాచెమ్మ (తెలుగు)
  • శివశంకరి (తమిళం)
  • ఇద్దరు అమ్మాయిలు (తెలుగు)
  • గిరిజా కళ్యాణం (జెమినీ టీవీ)
  • దేవత (స్టార్ మా - 2020, ఆగస్టు 17 నుండి)

మూలాలు సవరించు

  1. 1.0 1.1 1.2 1.3 నమస్తే తెలంగాణ. "పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని". Retrieved 26 May 2017.[permanent dead link]
  2. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
  3. 3.0 3.1 తెలుగు ఫిల్మిబీట్. "సుహాసిని". telugu.filmibeat.com. Retrieved 26 May 2017.
  4. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.