ఆనంద్ కౌశిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఆనంద్ కౌశిక్

పదవీ కాలం
2009 – 2014
ముందు ఐకాగర్ చంద్ చౌదరి
తరువాత విపుల్ గోయెల్
నియోజకవర్గం ఫరీదాబాద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ఆనంద్ కౌశిక్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పర్వేష్ మెహతాపై 10,841 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విపుల్ గోయెల్ చేతిలో 44,781 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

ఆనంద్ కౌశిక్ 2019 శాసనసభ ఎన్నికలలో బల్లబ్‌గఢ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మూల్ చంద్ శర్మ చేతిలో 41,713 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

మార్చు
  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. Live Mint (4 June 2024). "Haryana Election Results: BJP wins five assembly seats out of six in Faridabad". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  3. ANI News (24 October 2019). "Haryana poll: BJP wins 40 seats, Cong 31, JJP 10" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.