ఆనంద్ జిల్లా

గుజరాత్ లోని జిల్లా

" ఆనంద్ జిల్లా " గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. దీనిని చరోతర్ అని కూడా ఉంటారు.[3]1997లో ఖేడా జిల్లా నుండి కొంత భాగం విడతీసి ఆనంద్ జిల్లా రూపొందించబడింది. ఆనంద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంటుంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఖేడా జిల్లా, తూర్పు సరిహద్దులో వదోదరా జిల్లా, పశ్చిమ సరిహద్దులో అహ్మదాబాదు జిల్లా, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా ఖంబాత్, తారాపూర్ (గుజరాత్), పెట్లాద్ సొజిత్రా మొదలైన పట్టణాలు ఉన్నాయి. ఆనంద్ (గుజరాత్) జిల్లా ముఖ్యపట్టణం.

Anand district
district
Entrance of the AMUL Dairy
Entrance of the AMUL Dairy
Nickname: 
Charotar
Location of district in Gujarat
Location of district in Gujarat
Country India
రాష్ట్రంGujarat
Area
 • Total5,000 km2 (2,000 sq mi)
Population
 (2011)
 • Total20,90,276
 • Rank14th in state
భాషలు
 • అధికారGujarati, హిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-23[1]
Websitehttps://ananddp.gujarat.gov.in/Anand

2001 - 2011లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,090,276[4]
పురుషులు 1,088,253[5]
స్త్రీలు 1,002,023[5]
ఇది దాదాపు. మసెడోనియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం..[7]
640 భారతదేశ జిల్లాలలో. 219వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 711 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.57%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 85.79%[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
పురుషుల అక్షరాస్యత 93.23%[5]
స్త్రీల అక్షరాస్యత 77.76%.[5]

ఆర్ధిక రంగం మార్చు

ఆనంద్ జిల్లా ఆర్థికరంగం వైవిధ్యంగా ఉంటుంది. ఆర్థికరంగం వ్యవసాయం, పెద్ద తరహా పరిశ్రమల మీద ఆధారపడి ఉంది. జిల్లాలో పొగాకు, అరటి పంటలు ప్రధానంగా పండించబడుతున్నాయి. జిల్లాలో ప్రఖ్యాత అమూల్ డెయిరీ సంస్థ ఉంది. జిల్లా కేంద్రం శివారుప్రాంతంలో విథల్ ఉద్యోగ్ నగర్ (అతిపెద్ద పారిడ్రామిక బెల్ట్) ఉంది. ఇక్కడ ఎల్కాన్, ది చరోటర్ ఐరన్ ఫ్యాక్టరీ (1938), వార్మ్‌ స్టీం, మిల్సెంట్ అండ్ అట్లాంటా ఎలెక్ట్రానిక్స్ మొదలైన పరిశ్రమలు ఈ పారిశ్రామిక వలయంలో ఉన్నాయి.గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో అమూల్ డెయిరీ కోపరేటివ్ సంస్థ స్థాపించబడింది. భారతదేశ శ్వేతవిప్లవంలో అమూల్ ప్రధానపాత్ర వహిస్తుంది. ఇది ప్రంపంచంలో అతిపెద్ద పాలు, పాల ఉత్పత్తుల సంస్థగా గుర్తించబడుతుంది. అమూల్ భారతదేశంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిగా గుర్తించబడుతూ ఉండడమేకాక ఈసంస్థ ఉత్పత్తి మార్కెట్ విదేశాలలో కూడా విస్తరించాయి.

నిర్వహణా విభాగాలు మార్చు

ఆనంద్ జిల్లా నిర్వహణాపరంగా 8 తాలూకాలుగా విభజించబడ్డాయి; ఆనంద్, అంక్లవ్, బొర్సద్, ఖంబాద్, పెట్లద్, సొజిత్ర, తారాపూర్, ఉంరేద్.[8]

పర్యాటక ఆకర్షణలు మార్చు

 
Topographical map of Anand district
  • ఆనంద్ నగరం :[9] ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, - కోపరేటివ్ మూవ్మెంట్, మిల్క్ సిటీ వ్యవస్థాపకుడు త్రిభువందాస్ పఠేల్ వ్యవస్థాపకుని జన్మస్థలం.
  • అమూల్- ఆపరేషన్ - ఫ్లడ్, ది వైట్ రివల్యూషన్ ఆఫ్ ఇండియా జన్మస్థానం,
  • ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ,[10]
  • కరంసద్: సర్దార్ పఠేల్ జన్మస్థానం. (స్వామి మెడికల్ కాలేజ్)
  • కంబాత్ : చారిత్రాత్మక, పురాతన నౌకాశ్రయం. (బే ఆఫ్ కంబాత్) ఇక్కడ నుండి విదేశాలకు వాణిజ్యం జరిగింది.
  • దాకొర్ - హిందు ఆలయం: రణ్చోద్రై ఆలయం: కృష్ణుని రూపాలలో ఒకటి.
  • పవగద్ కోట : ఇది ఆనంద్ జిల్లా సమీపంలోని పంచ్‌మహల్స్ జిల్లాలో ఉంది. శిథిలమైన కోట అవశేషాలు యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడుతుంది.
  • భద్రన్ : పట్టణానికి " పారిస్ ఆఫ్ గీక్వార్డ్ స్టేట్ " అనే మారుపేరు ఉంది. ఒక శతాబ్ధానికి ముందుగా మహారాజా మూడవ సయాజీరావ్ గీక్వర్డ్ ఆరంభించిన సివిల్ వర్క్, పట్టణ సుసంపన్నత కారణంగా నగరానికి ఈ పేరు వచ్చింది.
  • వద్తల్.
  • సర్దార్ పఠేల్ యూనివర్శిటీ: భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఇది ఒకటి. ఇది ఆనంద్ జిల్లాలోని వల్లభ్ విద్యానగర్‌లో ఉంది.

సరిహద్దు ప్రాంతాలు మార్చు

మూలాల జాబితా మార్చు

  1. "RTO Gujarat Codes". Archived from the original on 2016-05-21. Retrieved 2016-05-28.
  2. "Anand Pin Code". MapsofIndia.com. Retrieved 2016-05-28.
  3. "History of Anand District". Gujarat Government. Archived from the original on 10 ఫిబ్రవరి 2015. Retrieved 9 October 2012.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. 5.0 5.1 5.2 5.3 "Anand District Panchayat". ananddp.gujarat.gov.in. 2016. Archived from the original on 2016-06-29. Retrieved 2016-05-28.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Macedonia 2,077,328 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2016-12-29. New Mexico - 2,059,179
  8. "Gujarat Administrative Divisions 2011" (PDF). Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. Archived from the original (PDF) on 2011-10-26. Retrieved 29 డిసెంబరు 2016.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-09-13. Retrieved 2021-11-05.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-27. Retrieved 2016-12-29.

వెలుపలి లంకెలు మార్చు