పంచ్‌మహల్ జిల్లా

గుజరాత్ లోని జిల్లా
(పంచ్‌మహల్స్ నుండి దారిమార్పు చెందింది)

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పంచ్‌మహల్స్ జిల్లా ఒకటి. గోద్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,025,277 చ.కి.మీ.పంచ్‌మహల్స్ అంటే 5 తాలూకాలు (గోద్రా, దాహోద్, హలాల్, కలాక్, ఝలాద్). ఈప్రాంతాలను గ్వాలియర్ మహారాజా జివాజీరావు సింధియా బ్రిటిష్ సామ్రాజ్యానికి బదిలీచేసాడు. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్యలో 12.5% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు. ఈ జిల్లా గుజరాత్ రాష్ట్ర తూర్పు భూభాగంలో ఉంది.

పంచ్‌మహల్స్ డిస్ట్రిక్ట్
district
సత్ కమాన్, పావగడ
సత్ కమాన్, పావగడ
Districts of central Gujarat
Districts of central Gujarat
Country India
రాష్ట్రంగుజరాత్
జనాభా
 (2001)
 • Total20,25,277
భాషలు
 • అధికారగుజరాతీ, హిందీ
Time zoneUTC+5:30 (IST)

సరిహద్దులు

మార్చు

పంచ్‌మహల్స్ జిల్లా ఈశాన్య, తూర్పు సరిహద్దులో దాహొద్ జిల్లా, దక్షిణ, ఆగ్నేయ, నైరుతీ సరిహద్దులో వదోదరా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఖేడా జిల్లా, వాయవ్య సరిహద్దులో సబర్ కాంతా జిల్లా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సరిహద్దులో బన్‌స్వార జిల్లాలు ఉన్నాయి.[1]

చరిత్ర

మార్చు

పంచ్‌మహల్స్‌ జిల్లా చరిత్ర చాపనర్‌ను చుట్టి ఉంటుంది. ఇది 7వ శతాబ్దంలో సోలంకి వంశానికి చెందిన రాజావనరాజ్ చేత (647) లో స్థాపించబడింది. 13వ శతాబ్దంలో చౌహాన్లు ముస్లిం పాలకుడు అల్లావుద్ధీన్ ఖల్జి నుండి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ సుల్తాన్ మొహ్హమద్ బెగ్దా (1484) ఈ ప్రాంతాన్ని ఆక్రమించే వరకు వరకు ఈ ప్రాంతం చౌహానుల పాలన కొనసాగింది. తరువాత మొగలుల పాలనలో (1575-1727) గోద్రా ఈప్రాంతానికి రాజధాని అయింది.

సింధియాలు

మార్చు

18వ శతాబ్దంలో పంచ్‌మహల్స్‌ ప్రాంతాన్ని మొగలుల నుండి మరాఠీ సైన్యాధికారి సింధియా జయించాడు. తరువాత ఈ ప్రాంతంలో గ్వాలియర్ మహారాజులు సింధియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. తరువాత 1818లో బలవంతంగా బ్రిటిష్ ఆధిపత్యానికి తలవంచాడు. 1861లో పంచ్‌మహల్స్ ప్రాతాన్ని సిధియా రాజు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇచ్చాడు. తరువాత ఈ ప్రాంతం బాంబే భూభాగంలోని గుజరాత్ విభాగంలో భాగంగా మారింది. జిల్లా పశ్చిమ పంచ్‌మహల్స్, తూర్పు పంచ్‌మహల్స్‌గా వ్యవహరించబడుతుంది. ఇవి బరియా (దేవ్‌గడ్), షంజెలి రాజాస్థానాలుగా విభజించబడ్డాయి. పశ్చిమ భూభాగం సారవంతమైన మైదానంగా ఉంది. తూర్పు భూభాగంలో కూడా సారవంతమైన లోయలు ఉన్నాయి. ఇవి ఎగుడుదిగుడుగా స్వల్పంగా వ్యవసాయ భూములుగా ఉపయోగపడుతున్నాయి. బ్రిటిష్ జిల్లా వైశాల్యం 1606 చ.కి.మీ. 1901లో జిల్లా జనసంఖ్య 261,020. తరువాత పూర్వపు హిందూసామ్రాజ్యపు రాజధాని తరువాత గుజరాత్ సామ్రాజ్యపు రాజధాని చాంపనర్ జిల్లాతో చేర్చబడింది.

ఆర్ధికం

మార్చు

జిల్లాలో శాండ్ స్టోన్, గ్రానైట్, ఇతర భవన నిర్మాణ రాళ్ళు ఉత్పత్తులు ఆధిక్యత కలిగిఉన్నాయి. యురేనియం సంస్థ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మాంగనీస్ ఉత్పత్తి ఆరంభించింది. జిల్లాలో ప్రధానంగా మొక్కజొన్నలు, బియ్యం, పప్పులు, చమురు గింజలు పండించబడుతున్నాయి. జిల్లాలో లక్క బ్రాస్‌లెట్లు, లక్కతో చేసిన బొమ్మలు తయారు చేయబడుతున్నాయి. జిల్లా నుండి ప్రధానంగా టింబర్ ఎగుమతి చేయబడుతుంది.

ప్రయాణ వసతులు

మార్చు

బరోడా, బాంబే, సెంట్రల్ ఇండియా రైల్వే జిల్లాలోని రెండు భాగాలను దాటిపోతుంది. ఈ రైలు మార్గం ఆనంద్ నుండి గోద్రా, దాహొద్ నుండి రట్లం వరకు నిర్మించబడింది. 1904లో గోద్రా నుండి వదోదరా వరకు రైలు మార్గం నిర్మించబడింది. 1899-1900 లో జిల్లాలో కరువు సంభవించింది. ఈ కరువులో (1891-1901) మద్యకాలంలో 17% మంది ప్రజలు మరణించారు. 1960లో గుజరాత్ రాష్ట్రం పచ్‌మహల్స్ ప్రాంతాన్ని గోద్రాను జిల్లాకేంద్రంగా చేస్తూ ఒకే జిల్లాగా మార్చింది. 1997లో గొద్రా కేంద్రగా పంచ్‌మహల్స్ జిల్లా, దాహోద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. చాంప్నర్ ప్రపంచ వారసత్వసంపదగా ప్రకటించబడింది. పావగర్‌లో కాలిల్ కాళికా మాతా ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులు వస్తుంటారు.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పంచ్‌మహల్స్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

తాలూకాలు

మార్చు

పంచ్‌మహల్స్ 11 తాలూకాలుగా విభజించబడింది;

 • గొధ్ర
 • హలోల్
 • కలోల్ (పంచ్మహల్)
 • లునవద
 • అంత్రంపుర్
 • అదన
 • అంబుఘొద
 • మొర్వ-హదఫ్
 • మ్హంపుర్
 • గొఘంబ

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,388,267,[3]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 187వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 458 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.92%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 945:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 72.32%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. సమం

మూలాలు

మార్చు
 1. "Census GIS India". Censusindiamaps.net. Archived from the original on 2015-04-25. Retrieved 2013-07-10.
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

సరిహద్దులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు