ఆమె (సినిమా)
ఆమె 1994 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఊహ, శ్రీకాంత్, నరేష్ ముఖ్యపాత్రల్లో నటించారు.[1][2][3]
ఆమె (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
తారాగణం | నరేష్, ఊహ |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | సిరి చిత్ర |
భాష | తెలుగు |
1994సంవత్సరానికి ఉత్తమ నటి ఊహా , నంది పురస్కారం .
కథ
మార్చుశ్రీనివాస రావు ఇంట్లో పెళ్ళైన కొద్ది రోజులకే వైధవ్యం ప్రాప్తించిన ఊహ అనే అమ్మాయిని చూసి విక్రం ఇష్టపడతాడు. ఆమెని పెళ్ళి చేసుకోవాలని అడుగుతాడు. ఊహ తన గతాన్ని గురించి అతనికి చెబుతుంది. శ్రీనివాస రావు పరమ పిసినారి. కొడుకు ఆంజనేయులు ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. కొడుకుకి పెళ్ళి చేయడానికి వధువు ఎలాంటిదైనా పరవాలేదు కానీ కట్నం మాత్రం దండిగా రావాలని కోరుకుంటాడు. అందుకోసం ఓ ఊబకాయం కలిగిన అమ్మాయినీ, పెళ్ళికి ముందే మోసపోయి గర్భవతి అయిన అమ్మాయినీ పెళ్ళి సంబంధాలుగా చూస్తాడు. కానీ ఆంజనేయులు ఆ సంబంధాలన్నీ తిప్పి కొడతాడు.
సుబ్రహ్మణ్యం ఒక సాధారణ ఉద్యోగి. అతని కుటుంబం చాలా పేదరికంలో ఉంటుంది. కనీసం పిల్లలకు సరైన బట్టలు కూడా కుట్టించలేని దీన స్థితి. దానికి తోడు అతని అల్లుడు ఆ ఇంట్లోనే తిష్ట వేసి ఏ పనీ లేకుండా తిని తిరుగుతుంటాడు. అతని కూతురు ఊహను ఆంజనేయులు ప్రేమిస్తాడు. వాళ్ళు కట్నం ఇవ్వలేరని శ్రీనివాసరావు ఒప్పుకోడు. ఆంజనేయులు మాత్రం తండ్రిని ఎదిరించి ఊహతో పెళ్ళికి ఒప్పిస్తాడు. కానీ శోభనం రోజునే ప్రమాదంలో మరణిస్తాడు.
తారాగణం
మార్చు- ఊహ గా ఊహ
- ఆంజనేయులు గా శ్రీకాంత్
- విక్రమ్ గా నరేష్[4]
- శ్రీనివాస రావు గా కోట శ్రీనివాసరావు
- శ్రీనివాస రావు భార్య గా సుధ
- ఊహ తండ్రి సుబ్రహ్మణ్యం గా చంద్రమోహన్
- సుబ్రహ్మణ్యం భార్య గా సంగీత
- సుబ్రహ్మణ్యం అల్లుడు గా తనికెళ్ళ భరణి
- పురోహితుడు గా బ్రహ్మానందం
- ఎ. వి. ఎస్
పాటలు
మార్చుఈ సినిమాకు విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు.[5][6] , పాటల రచయిత భువనచంద్ర .
- నాగమణీ నాగమణీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఊహల పల్లకిలో ఊగుతున్నదీ వధువు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- చల్లగాలికీ ఈడు వచ్చింది , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- అమ్మమ్మ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఓ చల్లగాలీ ఓదార్చిపోవా , గానం. గిరీశం, రాధిక.
మూలాలు
మార్చు- ↑ "Remembering EVV Satyanarayana on his birth anniversary - Kannada Movie News". Indiaglitz.com. 2014-06-10. Archived from the original on 2015-08-19. Retrieved 2015-04-30.
- ↑ "Srikanth interview - Telugu Cinema interview - Telugu film actor". Idlebrain.com. 2009-09-28. Retrieved 2015-04-30.
- ↑ "EVV Satyanarayana dies Б─⌠ A legend of his own league". Supergoodmovies.com. 22 జనవరి 2011. Archived from the original on 25 జూలై 2015. Retrieved 30 ఏప్రిల్ 2015.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ "Aame - All Songs - Download or Listen Free - JioSaavn".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-27. Retrieved 2017-10-23.