ఆరంబల్
ఆరంబల్ లేదా హర్మల్ భారతదేశంలోని గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ ఆరంబల్ బీచ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది గోవాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.[1][2]
ఆరంబల్
హర్మల్ | |
---|---|
Coordinates: 15°41′17″N 73°42′43″E / 15.688°N 73.712°E | |
దేశము | భారతదేశం |
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు | గోవా |
భారతదేశ జిల్లాలు | ఉత్తర గోవా జిల్లా |
జనాభా (2011) | |
• Total | 5,322 |
భాష | |
• వాడుక భాష | కొంకణి, మరాఠీ |
Time zone | UTC+5:30 (IST) |
వివరణ
మార్చుఆరంబల్ సాంప్రదాయకంగా మత్స్యకారుల గ్రామం, ఇది ఉత్తర గోవాలోని పెర్నెమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్‌లో ఉంది. గోవా రాజధాని పానాజీ(పంజిమ్) నుండి దీని దూరం దాదాపు 55 కిలోమీటర్లు.[3] దబోలిమ్ విమానాశ్రయం నుండి సుమారు గంట ప్రయాణం. ముఖ్యంగా నవంబర్ నుండి మార్చి నెలలలో ఆరంబల్ బీచ్ కి చాలా మంది అంతర్జాతీయ పర్యాటకులు వస్తారు. దీనికి ఉత్తరాన కెర్రీ బీచ్, దక్షిణాన మాండ్రేమ్ బీచ్ ఉన్నాయి.[4] ఇక్కడ పారాగ్లైడింగ్, కైట్ సర్ఫింగ్ వంటివి కూడా ఉంటాయి.
వసతి సౌకర్యాలు
మార్చుఇక్కడ స్థానిక ప్రజల నిరసనలు, ఒత్తిళ్ల కారణంగా ఈ ప్రాంతంలో వసతి సౌకర్యాలు అతిథి గృహాలు, గృహాలు లేదా తాత్కాలిక బీచ్ హట్‌లు పర్యాటక సీజన్‌లో నిర్మించి, సీజన్ చివరిలో తొలగిస్తారు.
స్థానిక సంస్కృతి
మార్చుఇక్కడ ఎక్కువ మంది క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఉంటారు. ఇక్కడ మౌంట్ కార్మెల్ అవర్ లేడీ చర్చ్ కాథలిక్ ప్రజల మతపరమైన ప్రదేశం. ఇక్కడ మేరీ మాతను కొంకణి భాషలో సైబిన్ మాయి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఫుట్‌బాల్, క్రికెట్ ఎక్కువగా ఆడతారు.
వాతావరణం
మార్చు- వర్షపాతం: 3117 మి.మీ
- గరిష్ట ఉష్ణోగ్రత: 34 °C
- కనిష్ట ఉష్ణోగ్రత: 23 °C
చిత్ర మాలిక
మార్చు-
అరాంబల్ బీచ్
-
ఆరంబల్లోని గుడిసెలు
-
ఆరంబల్లోని మంచినీటి సరస్సు
-
మర్రి చెట్టు మీద "మనీ స్టోన్" విగ్రహం
-
ఆరంబల్ బీచ్
-
పారాగ్లైడింగ్
-
సముద్రంలోకి వెళ్తున్న మత్స్యకారులు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "The Rough Guide to Goa," Rough Guides UK, 2010, ISBN 9781405386616
- ↑ "Goa and Mumbai," Amelia Thomas, Lonely Planet, 2012, ISBN 9781741797787
- ↑ Arambol Beach Archived 2015-08-13 at the Wayback Machine
- ↑ Introducing Arambol (Harmal) Archived 2015-09-05 at the Wayback Machine