ఆరవల్లి జిల్లా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా (గుజరాతీ : અરવલ્લી જીલ્લો) ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[3]

ఆరవల్లి జిల్లా
અરવલ્લી જીલ્લો
జిల్లా
షామ్లాజీ దేవాలయం
షామ్లాజీ దేవాలయం
Location of district in Gujarat
Location of district in Gujarat
Coordinates: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E / 24.0283; 73.0414
ప్రధాన కార్యాలయంమొడసా
Named forఅరవల్లి హిల్స్
జనాభా
 (2013)
 • Total1.024 Million [1]
 • Summer (DST)IST (UTC+05:30)

పేరువెనుక చరిత్ర

మార్చు

గుజరాత్, రాజస్థాన్ ఆరవల్లి పర్వతావళి జిల్లాలో ఉన్న కారణం జిల్లాకు ఈ పేరు వచ్చింది. .[4] గుజరాత్ ప్రభుత్వ రికార్డులు ఆరవల్లి పర్వతావళిలోని అరసూర్ శాఖ జిల్లాలోని దంతా, మొదస, శ్యామల్జీ తాలూకాలలో ఉందని తెలియజేస్తున్నాయి.[5]

చరిత్ర

మార్చు

2013లో గుజరాత్ ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[6] జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 2012లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.[7]

భౌగోళికం

మార్చు

బనస్ కాంతా జిల్లాలోని మొదస, మల్పుర్, ధన్సుర, మెఘరాజ్, భిలోద, భయద్ తాలూకాలను వేరు చేసి ఆరవల్లి జిల్లా రూపొందించబడింది. [1]

గణాంకాలు

మార్చు

జిల్లాలోని మెఘరాజ్, మల్పూర్, భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.[5] జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.[1]

పర్యాటక ఆకర్షణలు

మార్చు

జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు, శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి.[1]

ఆర్ధికం

మార్చు

ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది.[1] జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా, ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Dave, Kapil (August 25, 2013). "Dignity of PM office has reached its nadir: Modi". The Times of India. Retrieved 26 August 2013.
  2. http://m.indianexpress.com/news/7-new-districts-this-iday-govt-appoints-collectors/1155714/[permanent dead link]
  3. "Aravalli now a district in Gujarat". DNA. 18 September 2012. Retrieved 23 February 2013.
  4. "Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi". The Indian Express. 18 September 2012. Retrieved 23 February 2013.
  5. 5.0 5.1 5.2 "Namesake of oldest mountain, Aravalli scores nil in industry". The Indian Express. 2 September 2013. Retrieved 23 September 2013.
  6. "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. January 24, 2013. Retrieved 23 February 2013.
  7. "Aravali to be Gujarat's 29th district". Times of India. September 17, 2012. Archived from the original on 2013-01-28. Retrieved 23 February 2013.

వెలుపలి లింకులు

మార్చు

24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E / 24.0283; 73.0414{{#coordinates:}}: cannot have more than one primary tag per page