ఆరాధన (1962 సినిమా)

1962 అక్కినేని నటించిన సినిమా

ఆరాధన 1962 లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులు. బెంగాలీ నవల సాగరిక ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఆరాధన
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
నిర్మాణం వి.బి. రాజేంద్రప్రసాద్,
రంగారావు
రచన నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ
కథ సాగరిక (బెంగాలీ చిత్రం)
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (గోపి),
సావిత్రి (అనూరాధ),
జగ్గయ్య,
రేలంగి,
గిరిజ (గోపికి నిశ్చయమైన అమ్మాయి),
రాజశ్రీ,
వాసంతి,
అనితా దత్
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి. సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్. జానకి
గీతరచన నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య
ఛాయాగ్రహణం సి. నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
విడుదల తేదీ ఫిబ్రవరి 16, 1962
దేశం ఇండియా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాత్రలు-సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
పాట గీతరచయిత గాయనీగాయకులు సంగీతం నటీనటులు
ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని ఆరుద్ర ఎస్. జానకి బృందం సాలూరి రాజేశ్వరరావు
ఇంగ్లీషులోన మ్యారేజి హిందీలో అర్ధము షాదీ ఆరుద్ర ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్. జానకి సాలూరి రాజేశ్వరరావు రేలంగి, గిరిజ
ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా కొసరాజు రాఘవయ్య స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు ఎల్.విజయలక్ష్మి, ??
ఓహోహో మావయ్య ఇదేమయ్య బలెబలే బాగు ఉందయ్యా ఆరుద్ర పి. సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు
నా హృదయంలో నిదురించే చెలీ కలలోనే కవ్వించే సఖీ శ్రీశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు, రాజశ్రీ
నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని నార్ల చిరంజీవి పి. సుశీల సాలూరి రాజేశ్వరరావు సావిత్రి
వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనుల
వేదన మరచి ప్రశాంతిగ నిదురించుము ఈ రేయి
శ్రీశ్రీ పి. సుశీల సాలూరి రాజేశ్వరరావు సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు

సినిమా విశేషాలు

మార్చు

ఈ సినిమా కథా నాయకుడు: అక్కినేని నాగేశ్వరావు: అప్పటికే నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో బలం వున్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి "శ్రీ శ్రీ (శ్రీ రంగం శ్రీనివాసరావు ) వ్రాశారు. అది నాహృదయంలో నిదురించె చెలీ .... భావోద్వేగ గీతాల రచయితగా ముద్ర పడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి నీహృదయంలో నిదురించే చెలి ఎవరు అని ప్రశ్నించగా శ్రీ శ్రీ కమ్యూనిజం అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే.

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటి లింకులు

మార్చు