ఆరాధన భారతీరాజా దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, సుహాసిని, రాధిక, రాజశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం కడలోర్ కవిదైగళ్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు.

ఆరాధన
దర్శకత్వంభారతీరాజా
రచనభారతీరాజా
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంచిరంజీవి,
రాజశేఖర్,
సుహాసిని
ఛాయాగ్రహణంబి. కన్నన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1987 మార్చి 27 (1987-03-27)
భాషతెలుగు

కథ మార్చు

ఒక చిన్న పట్టణంలో నిరక్షరాస్యుడైన పులిరాజు చిన్నపాటి రౌడీగా చలామణి అవుతుంటాడు. అదే ఊరికి జెన్నిఫర్ ఉపాధ్యాయురాలిగా వస్తుంది. ఒకసారి జెన్నిఫర్ పులిరాజు తన తల్లిని అవమానంగా మాట్లాడుతుంటే మందలిస్తుంది. పులిరాజు ఆమె మీద తన సహజ స్వభావమైన పగ తీర్చుకోవడానికి బదులుగా ఆమెను ఆరాధిస్తూ ఆమె దగ్గర విద్యార్థిగా చేరతాడు. కొద్ది రోజులకు, తన పాత జీవితం నుంచి బయటపడి ఆహార్యంలో, ప్రవర్తనలో తనను తాను మార్చుకుంటాడు. ఇద్దరూ ఒకరినొకరు మనసులోనే అభిమానించుకుంటూ ఉంటారు కానీ బయటికి చెప్పుకోరు. పులిరాజు తల్లి తన కుమారుడిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపడి గ్రామం నుంచి తన మరదలు గంగమ్మను రప్పించి ఆమెతో అతని పెళ్ళి చేయాలని చూస్తుంది. అదే సమయంలో జెన్నిఫర్ కుటుంబానికి స్నేహితుడైన వ్యక్తితో ఆమె వివాహం చేయాలని ఆమె తండ్రి అనుకుంటాడు. పులిరాజు పద్ధతులు మార్చుకున్నా తన పాత శత్రువులు అతని మీద దాడి చేసి ఆసుపత్రి పాలు చేస్తారు. చివరికి పులిరాజు, జెన్నిఫర్ ఎలా ఒకటయ్యారన్నది మిగతా కథ.

తారాగణం మార్చు

విశేషాలు మార్చు

  • తమిళ మూలం కడలోర కవిదైగళ్ (సముద్రపు ఒడ్డు కవితలు)
  • చిరంజీవి పాత్రని సత్యరాజ్ పోషించారు

పాటలు మార్చు

  • హై జముకు జమా - జానకి - రచన: ఆత్రేయ
  • ఏమవుతుందీ - బాలు, జానకి - రచన: ఆత్రేయ
  • తీగనై మల్లి - బాలు, జానకి - రచన: ఆత్రేయ
  • అరె ఏమైందీ - బాలు, జానకి - రచన: ఆత్రేయ

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు