ఆరెపల్లి మోహన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో మానుకొండూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

ఆరెపల్లి మోహన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
తరువాత రసమయి బాలకిషన్
నియోజకవర్గం మానుకొండూరు నియోజకవర్గం

కరీంనగర్ జెడ్పీ చైర్మన్‌
పదవీ కాలం
2007 – 2009

వ్యక్తిగత వివరాలు

జననం 1960
మానకొండూర్‌, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు
తెలంగాణ రాష్ట్ర సమితి
భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు వెంకటి
జీవిత భాగస్వామి సంధ్య రాణి
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

ఆరేపల్లి మోహన్ విద్యార్థి దశ నుంచి ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 1988లో తొలిసారి మానకొండూరు గ్రామా సర్పంచ్‌గా ఎన్నికై 1988 నుంచి 2001 వరకు 19ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశాడు. ఆయన 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తిమ్మాపూర్‌ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి, 2007 నుంచి 2009 వరకు కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పనిచేశాడు.

ఆరేపల్లి మోహన్ 2009 పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మానకొండూర్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓరుగంటి ఆనంద్ పై గెలిచి మానకొండూర్‌ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యాడు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశాడు. ఆరేపల్లి మోహన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2016లో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా నియమితుడై,[2] 2019లో కాంగ్రెస్ పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]

ఆరెపల్లి మోహన్  2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు. ఆయన 2023 సెప్టెంబర్ 14న భారతీయ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[4] ఆరెపల్లి మోహన్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌, ఓబీసీ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మణ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

ఆయన 2023 ఎన్నికల్లో మానుకొండూరు నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2024 మార్చి 29న బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు.[6]

ఆరేపల్లి మోహన్ 2024 మార్చి 30న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7][8]

మూలాలు మార్చు

  1. Sakshi (17 November 2018). "తీన్‌మార్‌!". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  2. Sakshi (25 January 2016). "తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ఆరెపల్లె మోహన్". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  3. Andhra Jyothy (18 March 2019). "టీఆర్‌ఎస్‌లో చేరిన ఆరెపల్లి మోహన్‌". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  4. Eenadu (15 September 2023). "భారాసను వీడిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌". Archived from the original on 15 September 2023. Retrieved 15 September 2023.
  5. Mana Telangana (12 October 2023). "బిజెపిలో చేరిన ఆరేపల్లి మోహన్, ఈశ్వరప్ప." Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  6. Andhrajyothy (29 March 2024). "బీజేపీకి ఆరేపల్లి మోహన్ రాజీనామా". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  7. Eenadu. "కాంగ్రెస్‌లోకి ఆరెపల్లి". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  8. Andhrajyothy (31 March 2024). "కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.