రసమయి బాలకిషన్
రసమయి బాలకిషన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకుడు, కవి, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున మానకొండూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమింపబడ్డాడు.[2] తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించాడు.[3] ఆయన తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించాడు.[4] ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'జానపద గాయకుడు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[5] సినిమాలలో నటించడమేకాకుండా స్వీయ నిర్మాణంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.
రసమయి బాలకిషన్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2014 – 2023 డిసెంబర్ 03 | |||
ముందు | ఆరెపల్లి మోహన్ | ||
---|---|---|---|
తరువాత | కవ్వంపల్లి సత్యనారాయణ | ||
నియోజకవర్గం | మానకొండూర్ శాసనసభ నియోజకవర్గం | ||
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్
| |||
పదవీ కాలం 6 డిసెంబరు 2015 – 2023 డిసెంబర్ 03 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రావురూకుల, సిద్ధిపేట మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ | 1965 మే 15||
రాజకీయ పార్టీ | బి.ఆర్.ఎస్ | ||
తల్లిదండ్రులు | రాజయ్య-మైసమ్మ | ||
జీవిత భాగస్వామి | రజియా సుల్తానా | ||
సంతానం | ఇద్దరు కుమారులు (అమిత్, ఆదర్శ్) | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ |
జననం, విద్య
మార్చుబాలకిషన్ 1965, మే 15న రాజయ్య-మైసమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట మండలంలోని రావురూకుల గ్రామంలో జన్మించాడు. 2005లో హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసాడు. తరువాత బిఈడి, పిహెచ్.డి.లను కూడా పూర్తిచేశాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుబాలకిషన్ కు రజియా సుల్తానాతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (అమిత్, ఆదర్శ్) ఉన్నారు.
కెరీర్
మార్చురసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో ఉపాధ్యాయునిగా ప్రారంభించాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సాంస్కృతిక విభాగంలో ఒక భాగమైనాడు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్, నృత్య కార్యక్రమాలను నిర్వహించేవాడు. 2009-10 లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఆయన 2014 సాధారణ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందాడు. ఆయన 2018లో ఎన్నికల్లో మానకొండూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ 13 జూలై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6] ఆయన హైదరాబాద్‌లోని సాంస్కృతిక సారథిభవన్‌లో 19 జూలై 2021న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[7]
ఆడియో సిడిల
మార్చుతెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు.పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు.
డాక్టరేట్
మార్చురసమయి బాలకిషన్ 2021 నవంబరు 16న తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళలశాఖ నుంచి ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘తెలంగాణ సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూం ధాం) పాత్ర’ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను డాక్టరేట్ అందుకున్నాడు.[8]
పురస్కారాలు
మార్చు- జానపద గాయకులు విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[9]
ఇతర వివరాలు
మార్చుఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
మార్చు- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "TELANGANA First Chairman of Cultural Department". Archived from the original on 2015-09-24. Retrieved 2015-06-29.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-08. Retrieved 2015-06-29.
- ↑ http://www.outlookindia.com/article.aspx?264118
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
- ↑ Sakshi (13 July 2021). "మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి". Sakshi. Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
- ↑ T News (19 July 2021). "సాంస్కృతిక సారథి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రసమయి - TNews Telugu". Archived from the original on 19 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Eenadu (16 November 2021). "రసమయి బాలకిషన్‌కు డాక్టరేట్". Archived from the original on 2021-11-17. Retrieved 19 November 2021.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.